For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచే న్యూట్రీషియన్స్

By Super Admin
|

మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడానికి మంచి మార్గం రోగనిరోధక శక్తిని పెంపొందించడమే. రోగనిరోధక శక్తిని పెంచే అవసరమైన పోషకాలను తీసుకోండి.

పెరిగే వయసులో, పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి అనేక పోషకాలు అవసరం. మీ పిల్లలు దురద, దగ్గు, ముక్కు కారడం లేదా కడుపు నొప్పి వంటి వాటితో బాధపడుతుంటే, మీ పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచడానికి మీరు దృష్టి పెట్టడానికి ఇదే మంచి సమయం.

పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచే న్యూట్రీషియన్స్

వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల పిల్లల చదువులు దెబ్బతినడమే కాకుండా, అది మీ పిల్లలు బలహీన పడేట్టు చేసి, హాని చేస్తుంది కూడా.

పెరుగుతున్న పిల్లల్లో 81% మంది తగినంత ఐరన్, విటమిన్ A, విటమిన్ C ని కలిగి ఉండలేదని ప్రస్తుత పరిసోధనలు తెలియచేశాయి. లోపాలు నిరోధకతను చంపి పిల్లల్ని నీరసింప చేస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గితే కాలానుగుణ మార్పులు కూడా పిల్లల్ని అనరోగ్యవంతుల్ని చేస్తుంది.

విటమిన్ A

విటమిన్ A

రోగనిరోధక వ్యవస్థలో అంతర్గత వైద్య సామర్థ్యాలను నిర్వహించడానికి విటమిన్ ఎ అవసరం. దీని లేమి వల్ల పిల్లల్లో రక్షణ పొర బలహీన పడుతుంది. అంటువ్యాధులు పిల్లల్లో కనపడటం మొదలవుతుంది. మీ బిడ్డ విటమిన్ ఏ సమృద్ధిగా ఉన్న ఆహరం తీసుకుంటున్నారా లేదా నిర్ధారించుకోండి.

విటమిన్ B

విటమిన్ B

శరీరాన్ని రక్షించే వైట్ బ్లడ్ సేల్స్ కి విటమిన్ B అవసరం. ప్రత్యేకంగా విటమిన్ B12, B9, B6 లిమ్ఫోసైట్ల ను నిలబెట్టుకోవడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఈ విటమిన్లు శరీరాన్ని స్థితిస్థాపకంగా ఉంచి, పిల్లలకు అంటువ్యాధులు తిరిగి రాకుండా నిరోధిస్తాయి.

విటమిన్ C

విటమిన్ C

విటమిన్ C తగ్గితే పిల్లలకు హాని చేస్తాయి. విటమిన్ సి ని తగినంత తీసుకోవడం వల్ల T కణాల పనితీరును, రోగనిరోధక కణాలు అయిన ఫాగోసైట్లు పెంచుతుంది. విటమిన్ C యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గా కూడా పనిచేస్తుంది. ఇది ఎన్నో అంటువ్యాధులను నివారించగలదు.

ఐరన్

ఐరన్

ఎర్ర రక్త కణాలకి ఐరన్ అవసరం. అంతేకాకుండా, న్యూట్రోఫిల్స్ ద్వారా బ్యాక్టీరియాను తొలగించడానికి ఇనుము అవసరం. తగినంత ఐరన్ లేకపోతే T కణాల సంఖ్య తగ్గిపోతుంది. ప్రధానంగా, ఐరన్ లోపం వల్ల రోగనిరోధకత పై ప్రభావం పడుతుంది.

జింక్

జింక్

జింక్ ఆరోగ్యకరమైన రోగనిరోధక కణాల (న్యూట్రోఫిల్స్, కిల్లర్ సెల్స్) నిర్వహణలో కూడా సహాయపడుతుంది. జింక్ లేకపోవడ౦ అనేది ప్రతిరోధకాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. జింక్ లోపం వల్ల వ్యాధినిరోధకత తగ్గిపోతుంది.

విటమిన్ E

విటమిన్ E

ఈ విటమిన్ ఒక యాంటీ ఆక్సిడెంట్, ఇది మీ పిల్లవాడి శరీర౦ అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది. బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుసెనగ ఈ పోషకాలను కలిగి ఉంటాయి.

విటమిన్ B6

విటమిన్ B6

ఈ విటమిన్ మానవ శరీరంలోని వందల జీవరసాయనిక ప్రతిచర్యల కన్నా ఎక్కువ పాత్రను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అరటిపళ్ళు, చికెన్ ముక్కలు ఈ పోషకాలు కలిగి ఉంటాయి.

సేలేనియం

సేలేనియం

రోగనిరోధకతలో అద్భుతమైన ప్రభావాన్ని కలిగి ఉండే మరో పోషకం సేలేనియం. బార్లీ, బ్రజిల్ నట్స్, వేల్లుల్లిలో ఈ పోషకాలు కలిగి ఉంటాయి.

English summary

Nutrients That Decide A Kid's Immunity!

The best way to boost the health of your kid is by boosting his immunity. Get the necessary nutrients that boost immunity.
Story first published:Thursday, May 18, 2017, 11:50 [IST]
Desktop Bottom Promotion