For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తల్లిలో పాలు బాగా పడాలంటే తినండి 10 బెస్ట్ ఫుడ్స్

|

ఆరోగ్య పరిరక్షణకు మాతృస్తన్యమే గొప్పది. తల్లిపాలవల్ల బిడ్డల్లో రోగనిరోధకశక్తి పెరగడంతో పాటు వాళ్లు పెద్దయ్యాక వచ్చే అనేకరకాల వ్యాధులు (డీజనరేటివ్ డిసీజెస్) ఆలస్యం కావడం వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. బిడ్డకు ఏడాది వయసు వచ్చేవరకు స్తన్యం ఇవ్వాలి. తల్లికి ఏడాదికి పైగా నిరంతరం పాలు పడుతూ ఉండాలంటే ఈ ప్రక్రియలను ఆచరించండి.

తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతంది. చాలా మంది తల్లులు తమ పిల్లలకు సరిపోయేన్ని పాలు ఇవ్వలేకపోతున్నామని మధన పడిపోతుంటారు. పోతపాలకు అలవాటు చేస్తుంటారు. వారికి పోతపాలు పట్టక పడే ఇబ్బందులు చాలా ఇళ్ళలో నిత్యకృత్యాలే. ఇలాంటి సమయంలో పాలిచ్చే తల్లులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమృద్ధిగా పాలు పడతాయి. చిన్న పిల్లల తల్లులలో పాల ఉత్పత్తికి ఈ క్రింది ఆహారాలు బాగా సహాయపడుతాయి.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్ మీల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మరియు ఆరోగ్యకరమైన బ్లడ్ ప్రెజర్ ను నిర్వహించడంలో ఓట్ మీల్ బాగా సహాయపడుతుంది . అంతే కాదు కొత్తగా తల్లైన వారిలో ఓట్ మీల్ చాలా సౌకర్యవంతమైన ఆహారంగా మరియు తల్లి విశ్రాంతి పొందడానికి సహాయపడుతుంది. ఓట్ మీల్ శరీరంలోని ఆక్సిటోసిన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మో పాల ఉత్పత్తిన్ని ప్రోత్సహిస్తుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

గ్రీన్ లీఫ్స్ అత్యంత ఆరోగ్యకరమైన ఆహారం. ఆకు కూరల్లో అద్భుతమైన విటమిన్ కె మరియు విటమిన్ ఎ మరియు ఫ్లొల్లెట్ ఉంటుంది. ఫొల్లెట్ గర్భిణీ స్త్రీకి చాలా అవసరం అలాగే పాలిచ్చే తల్లులుకు కూడా చాలా మేలు చేస్తుంది. ఆకుకూరల్లోని ఫైటో ఈస్ట్రోజన్ తల్లి శరీరంలో బ్రెస్ట్ టిష్యూల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

కూరాకుల్లో లాగే క్యారెట్స్ కూడా ఫైటో ఈస్ట్రోజన్ ఇది బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కు చాలా అవసరం. క్యారెట్ లోని బీటా కెరోటిన్ మరియు విటమిన్స్ తల్లిలో ఎనర్జీ లెవల్స్ ను పెంచడానికి చాలా ముఖ్య పాత్రను పోషిస్తాయి.

హమ్స్:

హమ్స్:

హమ్స్ ను చిక్ పీస్, నిమ్మరసం, వెల్లుల్లి, మరియు ఆలివ్ ఆయిల్ తో తయారుచేస్తారు. ఇది పాలిచ్చే తల్లులకు అత్యవసర ఆహారంగా, ఒక మంచి స్నాక్ గా తీసుకోమని సలహాలిస్తుంటారు. ఎందుకంటే చీక్ పీస్ వంటి లెగ్యుమ్స్ లేదా గ్రీన్ బీన్స్ మరియు వెల్లుల్లి వంటివి చాలా ముఖ్యమైన ల్యాక్టోజనిక్ ఆహారాలు. ఈ డిష్ లో ఎక్కువ ప్రోటీనులు కలిగి ఉండి పాలిచ్చే తల్లులకు ఒక అద్భుతమైన పోషకాహారంగా ఉపయోగపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బాలింతలకు బొప్పాయి కల్పతరువులాంటిది. బొప్పాయి దోరగా ఉన్నదాన్ని కొబ్బరి కోరులా చేసి కూరవండుకుని తిన్నట్లయితే స్తన్యవృద్ధి కలుగుతుంది. తన పాలు దోషయుక్తంగా ఉండి బిడ్డకు వికారం, విరేచనాలు కల్గిస్తున్నప్పుడు, బొప్పాయి కాయనుగానీ పండునిగానీ తీసుకోవడం మంచిది.

ఆస్పరాగస్:

ఆస్పరాగస్:

ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో ఫైబర్ మరియు ఫోలిక్ యాసిడి, విటమిన్ ఎ, సి మరియు కెలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ చాలా ముఖ్యమైన పోషకాంశాలు. వీటిలో ఇంకా అమినో యాసిడ్స్ ఉండి, పాల ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి.

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్:

బ్రౌన్ రైస్ లో కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ పుష్కలంగా ఉండి పాలిచ్చే తల్లుల్లో ఎనర్జీ లెవల్స్ క్రమంగా నిర్వహించడానికి బాగా సహాయపడుతాయి.

ఆప్రికాట్:

ఆప్రికాట్:

ఆప్రికాట్స్ లో ఫైబర్, విటమిన్స్ మరియు క్యాల్షియం ఫుష్కలంగా ఉంటుంది. క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు కూడా పాల ఉత్పత్తికి బాగా సహాయపడుతాయని కనుగొనబడింది. ఆప్రికాట్స్ లో ట్రై ప్రోటోపోన్ ప్రొలాక్టిన్ స్థాయిలను సహజంగా పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

సాల్మన్:

సాల్మన్:

పాలిచ్చే తల్లులకు చేపలు చాలా అవసరమైన ముఖ్యమైన ఆహారం. సాల్మన్ చేపల్లో ప్యాటీ యాసిడ్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ తల్లిలో పాలను ఉత్పత్తి చేయడానికి బాగా సహాయపడుతాయి.

నీళ్ళు:

నీళ్ళు:

రోజులో సాధ్యమైనంత నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తికి బాగా సహాయపడే ఒక ఉత్తమమైన మార్గం. కాబట్టి పాలు ఇవ్వడానికి కూర్చొనే ముందు తప్పకుండా ఒక గ్లాసు పాలు తాగేలా చూడండి.

English summary

10 Foods To Increase Breast Milk

As soon as your baby is born, the first most important thing to do is breastfeed. Mother's milk is extremely important for the baby in the initial years. It is the only source of food and nutrients for the growing baby.
Story first published: Thursday, October 10, 2013, 17:07 [IST]
Desktop Bottom Promotion