For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు.. నివారణ

|

గర్భధారణ అనేది మహిళల శరీరంలో అతి పెద్ద మార్పు. అందువల్లే ప్రసవం అయినా తర్వాత కూడా గర్భధారణ గుర్తులు శరీరం మీద అలాగే నిలిచి ఉండిపోతాయి. కొత్తగా తల్లైన వారికి పోస్ట్ ప్రెగ్నెన్సీ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రసవం తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం ఉత్తమం.

ప్రోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే ప్రోస్ట్ ప్రెగ్నెన్సీ గాల్ స్టోన్ లేదా పోస్ట్ మార్టన్ డిప్రెషన్ వంటి వాటి గురించి ఖచ్చింతా తెలుసుకోవాలి. ఇవి ప్రసవించిన ప్రతి కొత్త తల్లిలోనూ జరగకపోవచ్చు మరియు ఒక వేళ అలా జరిగినప్పటికీ వీటికి ఉపశమనం పొందవచ్చు. ఇవి కొత్తగా తల్లైన వారిలో భాగంగా లేదా మాతృత్వం అనుగుణంగా ఉంటుంది.

ఇలా అతి సాధారణంగా కొత్త తల్లల్లో వచ్చే పోస్ట్ ప్రెగ్నెన్సీ హెల్త్ ప్రొబ్లమ్స్ మరికొన్నింటిని గురించి తెలుసుకోండి...

Post Pregnancy
1. నొప్పులు: కాన్పు తర్వాత కొందరిలో వెన్ను, తొడలు, పిరుదుల్లో నొప్పులు ఎక్కువగా ఉండవచ్చు. గర్భాశయం బరువు వెన్నుపూసపై పడటం వల్ల, కండరాల పటుత్వం తగ్గడం వల్ల వెన్నునొప్పి ఉంటుంది. కొన్నిసార్లు కాన్పుకి ఎక్కువ సమయం పట్టినా, లేదా కాన్పు కష్టమై పరికరాల (ఫోర్సెప్) సహాయంతో కాన్పు జరిపినప్పుడు, వెన్నుపూస కింది భాగంలోని నరాలపై ఒత్తిడి పడి కాళ్లు కదపలేకపోవడం, స్పర్శ తగ్గడం జరగవచ్చు. అయితే ఫిజియోథెరపీతో దీన్ని అధిగమించవచ్చు.

2. మూత్రసమస్యలు: కొన్నిసార్లు కాన్పు తర్వాత మూత్రాశయానికి చేరే నరాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల మూత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోవడం వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాన్పు తర్వాత నొప్పి వల్ల కూడా మూత్రం పూర్తిగా విసర్జించలేకపోవచ్చు. తగినంత నీరు తాగకపోవడం వల్ల, జననాంగాల నుంచీ మూత్రవ్యవస్థకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. కొంతమందిలో కొన్ని రోజులపాటు మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవచ్చు. దీనికి ప్రత్యేకించి పెల్విక్‌ఫ్లోర్ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.

3. మలబద్దకం: కాన్పు తర్వాత 2-3 రోజుల వరకు విరేచనం సాఫీగా అయినా,నీరు తాగకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కొంతమందిలో ఆ తర్వాత మలబద్దకం ఏర్పడవచ్చు.

4. రొమ్ముల్లో ఇన్ఫెక్షన్స్: తల్లి... బిడ్డకు పాలు సక్రమంగా పట్టకపోవడం, రొమ్ము మొనలు సరిగాలేకపోవడం, రొమ్ముల్ని సరిగా ఖాళీ చేయకపోవడం వల్ల పాలు గడ్డకట్టి రొమ్ముల్లో ఇన్పెక్షన్ రావచ్చు. రొమ్ముపై ఏవైనా పగుళ్లు ఏర్పడితే, వాటి ద్వారా తల్లి శరీరంలోకి రోగక్రిములు చేరుకోవచ్చు. అలాగే బిడ్డ నోటిలో పూత ఉన్నా రోగక్రిములు రొమ్ములోకి పాకి ఇన్ఫెక్షన్‌కు దారితీయవచ్చు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రొమ్ముల్లో చీముగడ్డలు ఏర్పడవచ్చు.

5. ఇన్ఫెక్షన్లు: సిజేరియన్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు పొట్ట మీద వేసే కుట్లలో చీము పట్టవచ్చు. మలేరియా, టైఫాయిడ్, నిమోనియా వంటి ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్స్‌ని అశ్రద్ధ చేస్తే అవి రక్తం ద్వారా శరీరమంతటా పాకి ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉంది.

6. గాల్ స్టోన్: పిత్తాశయమున గాని, పైత్యరస నాళములో గాని తయారయిన రాళ్ళు : గర్భధారణ సమయంలో, హార్మోన్ ప్రొజెస్టెరాన్ పెద్ద మొత్తంలో స్రవిస్తుంది. ఈ హార్మోన్ పిత్త రసాలను ఊరటను అడ్డుకొని. మరియు పైత్య రసాలు లోపం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది. అందువల్లే గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత పిత్తాశయం రాళ్లను ఏర్పడటం చాలా సాధారణం.

7. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం: గర్భవతికి కాన్పు తర్వాత జరిగే రక్తస్రావాన్ని అరికట్టడం కోసం రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్థాలు ఎక్కువగా తయారయ్యేలా ప్రకృతి ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. కొంతమందిలో (బరువు ఎక్కువగా ఉన్నవారు, హైబీపీతో ఉన్నవారు, ఎక్కువ వయసు ఉన్నవారిలో) కాన్పు తర్వాత వారం నుంచి పది రోజుల వరకు ఈ పదార్థాల వల్ల రక్తం గడ్డకట్టి, ఆ గడ్డలు వేరే రక్తనాళాల్లోకి పాకి రక్తప్రసరణకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. కాన్పు తర్వాత ఎక్కువ సేపు కదలకుండా పడుకుని ఉండేవారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కొందరిలో రక్తం గడ్డలు ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళాల్లోకి చేరి రక్తప్రసరణకు ఆటంకం కలిగించడం ద్వారా అకస్మాత్తుగా ఊపిరి అందక ప్రాణాపాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది.

8. మానసిక సమస్యలు: కొంతమంది బాలింతల్లో కాన్పు తర్వాత 3-5 రోజుల తర్వాత డిప్రెషన్ వస్తుంది. రక్తహీనత, బిడ్డ పెంపకం బాధ్యతల గురించిన భయం, ఆందోళన, నిద్రలేమి, కొన్ని హార్మోన్లలో మార్పులు, కుటుంబకలహాల వంటి ఎన్నో కారణాల వల్ల ఇది రావచ్చు. కొంతమందిలో కుటుంబసభ్యుల సహకారం వల్ల 2-3 రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. కొంతమందిలో మాత్రం పరిస్థితి తీవ్రమై సైకోసిస్ స్థితిలోకి వెళ్తారు. దీనికి చికిత్స అవసరం.

9. తీవ్రమైన రక్తస్రావం: కాన్పు తర్వాత సాధారణంగా 200 ఎం.ఎల్. నుంచి 500 ఎం.ఎల్. వరకు రక్తస్రావం అవుతుండటం మామూలే. అంతకంటే ఎక్కువైతే ఆ కండిషన్‌ను పోస్ట్‌పార్టమ్ హేమరేజ్ (పీపీహెచ్) అంటారు. పీపీహెచ్‌ను మొదటే నియంత్రించకపోతే, దాదాపు 25 శాతం మంది తల్లులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 90 శాతం పీపీఎమ్ కేసుల్లో గర్భాశయం ముడుచుకుపోవడంవల్ల బ్లీడింగ్ జరుగుతుంది. కొంతమందిలో గర్భాశయ ముఖద్వారం చీరుకుపోవడం, మరికొందరిలో గర్భాశయం లోపల మాయముక్కలు ఉండిపోవడం కూడా పీపీహెచ్‌కు కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కారణాన్ని బట్టి చికిత్సతో పాటు రక్తం ఎక్కించాల్సిన అవసరం కూడా రావచ్చు. రక్తస్రావం ఎంతకీ నియంత్రణలోకి రాకపోతే గర్భసంచిని తొలగించాల్సి రావచ్చు.

10. ఫిట్స్: కొంతమందిలో కాన్పుకి ముందు బీపీ పెరిగి కాన్పు తర్వాత తగ్గుతుంది. కానీ కొంతమందిలో కాన్పు తర్వాత కూడా వారం నుంచి పదిరోజుల పాటు బీపీ పెరిగి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.

11. బాలింత జ్వరం: కాన్పు తర్వాత ఒళ్లు కొంచెం వేడిగా అనిపించి, తర్వాత మామూలుగా ఉంటుంది. కొంతమందికి కాన్పు తర్వాత 24 గంటల నుంచి 10 రోజుల్లోపు 100 డిగ్రీల కంటే ఎక్కువగా వచ్చే జ్వరాన్ని బాలింత జ్వరం అంటారు. దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు.

12. జననాంగాల్లో ఇన్ఫెక్షన్: రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత లోపం, కాన్పు సమయంలో శుభ్రత పాటించకపోవడం, రోగక్రిములు జననాంగంలో ప్రవేశించడం, గర్భాశయంలో ఏమైనా మాయ ముక్కలు ఉండిపోవడం, యాంటీబయాటిక్స్ మందులు సరిగా వాడకపోవడం వంటి ఎన్నో కారణాల వల్ల జననాంగాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బాలింత జ్వరం రావచ్చు.

English summary

Common Post Pregnancy Health Problems | ప్రసవం తర్వాత మహిళల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు.. నివారణ

Pregnancy is a huge change for a woman's body. That is why, a pregnancy leaves its mark on your body even after child birth. Women are prone to several post pregnancy health problems that can make your life as a new mom difficult.
Story first published: Thursday, May 9, 2013, 15:54 [IST]
Desktop Bottom Promotion