For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత తీసుకోవల్సిన 10 హెల్తీ ఫుడ్స్

|

సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చాక బాలింతలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. ఆ సమయంలో జీర్ణమైన ఆహారం మాత్రమే శిశువుకు పాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో బాలింతలు తగు జాగ్రత్తులు పాటిస్తూ తీసుకునే ఆహారం పుష్టికరంగా, ఆరోగ్యవృద్దికరంగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవం జరిగిన తొలిరోజుల్లో ఎక్కువగా పులుపు, కారం, మసాలాలను తీసుకోకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడే కాదు, ప్రసవం తర్వాత కూడా కొత్తగా తల్లి అయిన స్త్రీలకు నియమిత ఆహారం ఎంతో అవసరం. శిశువు జన్మించిన ఆరు నెలల వరకూ తల్లిపాలే శిశువులకు పోషకాహారం. శిశువు తాగే పాలు తేలికగా జీర్ణించుకుని ఆరోగ్యవంతంగా దినదినాభివృద్ది చెందాలంటే తల్లి తగిన జాగ్రత్తలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. దీంతో తల్లీ, బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో, గర్భిణి స్త్రీ ఆరోగ్యంగా ఉండటానికి, సురక్షితంగా ప్రసవించడం కోసం కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు. అయితే, ప్రసవించిన వెంటనే కొత్త తల్లిలో కొత్త కొత్త కోరికలు మొదలవుతాయి. ఈ కోరికలు ముఖ్యంగా వారు తినే ఆహారం మీద ఎక్కువ. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో దూరమైన ఆహారాలను ఎక్కువగా ఇష్టపడుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రసవం తర్వాత ఈ క్రింది లిస్ట్ అవుట్ చేసిన ఆహారాలను తీసుకోవచ్చు.

క్రింది లిస్ట్ లో ఇవ్వబడ్డ క్యాలరీ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రసవం తర్వాత బరువు పెరగడానికి అవకాశం ఉంది. బరువు పెరగాలనుకొనే వారు ఈ ఆహారాలను తీసుకోవడం సురక్షితం. అయితే ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన ఆహారాలు కొంత మంది మహిళలు వారి శిశువు ఆరోగ్యానికి హానికరం అని భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది నిజం అవుతుంది. ఎందుకంటే మోతాదుకు మించి తింటే అలానే జరగవచ్చు. కాబట్టి, ఏ ఆహారం అయినా సరే, ప్రసవించిన కొత్త తల్లి మితంగా తీసుకోవడం మంచి పద్దతి.

కొత్తగా తల్లైన వారు గుర్తుంచుకోవల్సిన ఒక ముఖ్యమైన విషయం, ప్రసవం తర్వాత ఏ ఆహారం తీసుకొన్న సరే, మితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ లేదా వికారానికి దారితీస్తుంది. కాబట్టి, ప్రసవం తర్వాత కొత్త తల్లి తీసుకోవల్సి కొన్ని ఉత్తమ ఆహారాలు క్రింది స్లైడ్ లో ఇవ్వబడ్డాయి, వాటిని పరిశీలించి తల్లిబిడ్డ సురక్షింతంగా ఉండేలా మితంగా తీసుకోవాలి.

ప్రసవం తర్వాత తీసుకోవల్సిన కొన్ని ఆహారాలు

పాస్తా:

పాస్తా:

ప్రసవం తర్వాత కొత్త తల్లి తీసుకోవల్సిన ఆహారాల్లో ఒక బెస్ట్ ఫుడ్ పాస్తా. ఈ పాస్తా హై క్యాలరీలను కలిగి ఉండటం మాత్రమే కాదు, అధిక ఎనర్జీని కూడా అంధిస్తాయి. ఈ హైక్యాలరీ మరియు హై ఎనర్జీ రెండూ కూడా ప్రసవించిన తల్లికి చాలా అవసరం .

చీజ్:

చీజ్:

ప్రసవం తర్వాత తీసుకోవల్సిన ఆహారాల్లో మరొక హెల్తీ ఫుడ్ చీజ్. ఈ డైరీ ప్రొడక్ట్ హై క్యాలరీస్ ను కలిగి ఉంటుంది, కాబట్టి పాలిచ్చే తల్లులకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లలో అనేక రకాలున్నాయి. అన్నీ కూడా ప్రసవం తర్వాత నిరభ్యరంతంగా మితంగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఆరెంజ్, పైనాపిల్, గ్రేప్స్, మరికొన్ని ఇతర సిట్రస్ పండ్లును తీసుకోవచ్చు. వీటని కూడా మితంగా తీసుకోవడం ఉత్తమం.

ప్రొద్దుతిరుగుడు గింజలు:

ప్రొద్దుతిరుగుడు గింజలు:

ప్రొద్దుతిరుగుడు గింజల్లో అత్యధిక శాతంలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి, ప్రసవం తర్వాత వీటిని తీసుకోవడం చాలా మంచిది. శిశువుకు పాలు పట్టడానికి ముందు ఒక గుప్పెడు ప్రొద్దుతిరుగుడు గింజలను తినడం చాలా మంచిది. ఇది పాలు ఎక్కువగా పడటానికి సహాయపడుతుంది.

కాఫీ:

కాఫీ:

గర్భధారణ సమయంలో, కాఫీకి దూరంగా ఉండమని సలహాలిస్తుంటారు. కాఫీ కడుపులో పెరిగే శిశువు పెరుగుదల మీద ప్రభావం చూపుతుందని తెలుపుతారు. కానీ ప్రసవించిన తర్వాత ఒక కప్పు కాఫీ తాగడం వల్ల కొత్త తల్లి కొంత విశ్రాంతి పొందుతుంది. ప్రసవించిన కొత్త తల్లికి కాఫీ కూడా కొంత శక్తిని ఇవ్వడానికి సహాయపడుతుంది.

పాలు:

పాలు:

పాలు మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ ప్రసవం తర్వాత తల్లికి అవసరమయ్యే ప్రోటీనులను మరియు క్యాల్షియంను పుష్కలంగా అందిస్తుంది. ఈ రెండు రకాల ప్రోటీనులు మరియు క్యాల్షియం పాలిచ్చే తల్లికి చాలా అవసరం. పాలు పోస్ట్ నేటల్ డైట్ లో చేర్చాల్సినటువంటి ముఖ్యమైన సూపర్ ఫుడ్. పాలు రెగ్యులర్ గా త్రాగడం వల్ల ఇవి శరీరానికి కావల్సిన క్యాల్షియంను అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ రెండు గ్లాసుల పాలు తీసుకోవడం చాలా అవసరం.

గ్రీన్ లీఫ్స్ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫ్స్ వెజిటేబుల్స్:

ప్రసవం తర్వాత హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం ఎంతైనా అవసరం. కొత్త తల్లి ఒక సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆకుకూరల్లో కూరలో అధికంగా ఐరన్ మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి కొత్తగా తల్లైన వారికి, తిరిగి ఆరోగ్యాన్ని యథావిథిగా అందిస్తుంది. ప్రసవ సమయంలో కోల్పోయిన పోషకాంశాలను తిరిగి శరీరానికి అందిస్తుంది.

చేపలు:

చేపలు:

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ సాల్మన్ మరియు తున చేపల్లో ఎక్కువగా కనుగొనబడింది. ఇది మీ శిశువు యొక్క బ్రెయిన్ మరియు కళ్ళ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి, పాలు పట్టే తల్లులు వారంలో రెండు సార్లు ఇటువంటి చేపలను ఆహారంగా తీసుకోవడం ఉత్తమమైన మార్గం.

హెల్తీ కార్బోహైడ్రేట్స్:

హెల్తీ కార్బోహైడ్రేట్స్:

గర్భధారణ, తర్వాత ప్రసవం తర్వాత కొత్త తల్లి కోల్పోయిన ఎనర్జీ పొందడానికి కార్బో హైడ్రేట్స్ చాలా అవసరం . మరి ప్రసవించిన కొత్తతల్లి ఎనర్జీ తిరిగి పొందడానికి తగినంత కార్బో హైడ్రేట్స్ తిరిగి శరీరం గ్రహించబడాలంటే బ్రైన్ రైస్ లేదా బార్లీను ఎక్కువగా తీసుకోవాలి.

గ్రాన్యులా:

గ్రాన్యులా:

ప్రసవం తర్వాత తీసుకోవల్సిన హెల్తీ ఫుడ్స్ లో ఇది ఒక బెస్ట్ ఫుడ్. ఎందుకంటే , గ్రాన్యుల్స్ లో అత్యధిక శాతంలో ఫైబర్ కలిగి ఉండి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాదు ఇది, కండర నిర్మానికి మరియు కండరాల బలానికి బాగా సహాయపడుతుంది.

English summary

Foods To Consume After Giving Birth

During pregnancy, there are tons of foods which pregnant women should stay away from in order to give birth to a healthy baby. But, as soon as the baby is born, a new mother longs for certain types of cravings.
Story first published: Tuesday, November 5, 2013, 16:29 [IST]
Desktop Bottom Promotion