For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత మసాజ్ వల్ల మహిళ పొందే ప్రయోజనాలు...

|

మర్దనా లేక మసాజ్ ద్వారా శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ఎంతో శక్తిని, ఉత్తేజాన్నితిరిగి మన శరీరం పొందుతుంది. శారీరకంగా, మానసికంగా అలసట చెందిన శరీరానికి ఉల్లాసాన్నిచ్చే ప్రక్రియ మసాజ్‌. ప్రతిరోజు పని ఒత్తిడి మూలంగా టెన్షన్‌కు గురైన వారు హారుుగా సేదతీరేందుకు నేడు మసాజ్‌ సెంటర్లను ఆశ్రరుుస్తున్నారు. శరీరంలోని కండరాలకు ఉత్తేజాన్నిచ్చే మసాజ్‌ అన్ని వయసుల వారికి మంచిదే. వివిధ రకాల మసాజ్‌లతో శరీరంలోని పలు రకాల రుగ్మతలను నిర్మూలించవచ్చని వైద్య, ఆరోగ్య నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

ప్రసవం తర్వాత తల్లి తన ఆరోగ్యం చూసుకోవటానికి సమయం వుండదు. ఆమెకు రాత్రి, పగలు బిడ్డ ధ్యాసే అధికంగా వుంటుంది. అదే సమయంలో ఆమె శారీరక నొప్పులున్నాయని తెలుపుతుంది. ప్రసవం తర్వాత మహిళలు కొద్దిపాటి బరువు పెరుగుతారు. తమ పూర్వపు శరీర రూపం పొందాలనేది వారి ధ్యేయంగా వుంటుంది. అందుకుగాను వారు ఏం చేయాలి? వారు ప్రసవం తర్వాత మసాజ్ చేయించుకోవాలి. దీన్నే పోస్ట్ నేటల్ మసాజ్ అంటారు. పోస్ట్ నేటల్ మసాజ్ వల్ల సౌందర్య, శరీర నొప్పులు మాత్రమే కాదు, ఇతర ప్రయోజనాలు కూడా చూడండి...

Health Benefits of Postnatal Massage

విశ్రాంతి: కాన్పు తర్వాత మహిళలకు ఒత్తిడి వుంటుంది. తన బిడ్డకు అధిక సమయం కేటాయించడంతో కొత్త తల్లి శారీరకంగా, మానసికంగా అలసిపోతుంది. కనుక, అలసిన శరీరానికి మసాజ్ చాలా అవసరం.

శారీరక నొప్పులు: కాళ్ళలో, తొడలలో, చేతులు, మెడ, వీపు వంటివి కాన్పు తర్వాత నొప్పులు పెడతాయి. మసాజ్ చేస్తే వీటినుండి విముక్తి పొందవచ్చు. మసాజ్ రాత్రివేళ చేస్తే మంచిది. నిద్రించేముందు కొద్ది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. లేదా భర్త సహాయం తీసుకుని మసాజ్ చేయించుకోవాలి. నొప్పిలేని నిద్ర పడుతుంది.

స్ట్రెచ్ మార్కులు: ప్రసవానంతరం పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్కులు మసాజ్ తో తగ్గుతాయి. మంచి నూనెలు వాడి మసాజ్ చేయించాలి. చర్మం - చర్మంపై అప్పటివరకు వున్న మృతకణాలు మసాజ్ తో తొలగిపోతాయి.

బరువు తగ్గుట: కాన్పు ముందరి శరీర రూపం పొందాలంటే, పొట్ట తగ్గాలంటే, శరీర కొవ్వు కరగాలంటే మసాజ్ తప్ప మరోమార్గం లేదు.

పాలు ఉత్పత్తి: ఆమెలోని పాలగ్రంధులు అధిక ఉత్పత్తి చేయాలంటే మసాజ్ సహకరిస్తుంది. స్తనాలు మసాజ్ చేస్తే పాలు అధికమవటమే కాక, రొమ్ములు వేలాడకుండా వుంటాయి. అంతవరకు అడ్డగించబడిన పాలగ్రంధులకు రక్తప్రసరణ బాగా జరిగి ఉత్పత్తి అధికమవుతుంది.

కండరాలు బిగువు: కాన్పు సమయంలో ఆమె కండరాలు వదులవుతాయి. కాన్పు తర్వాత చేసే మసాజ్ కు కండరాలు మరోమారు ఫిట్ నెస్ సంతరించుకుంటాయి.

రక్త సరఫరా: శరీర మసాజ్ శరీరమంతా రక్తప్రసరణ వుండేలా చేస్తుంది. నొప్పి దూరమవటమే కాక, అది ఆక్సిజన్ అధికంచేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.

మహిళలకు పోస్ట్ నేటల్ మసాజ్ వల్ల ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. డెలివరీ తర్వాత శరీరానికి కొంత విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి మసాజ్ తర్వాతి దశలో దొరుకుతుంది. మసాజ్ చేసేటపుడు గోరు వెచ్చటి నూనెలు ఉపయోగించండి. ఈ మసాజ్ ఇంటివద్దే చేసుకొనవచ్చు.

English summary

Health Benefits of Postnatal Massage | డెలివరీ తర్వాత మసాజ్..!అద్భుతమైన మార్పులు!

Postnatal Massage is the best way to care for yourself and your baby after birth. As a new mom, you need to take care of yourself while caring for your newborn.
Story first published: Thursday, February 28, 2013, 16:26 [IST]
Desktop Bottom Promotion