For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత మహిళ ఖచ్చితంగా తీసుకోవల్సిన ఇండియన్ ఫుడ్...!

|

మాతృత్వం ప్రతి స్త్రీకీ ఒక కళ. కొత్త కోడలు కడుపు పండాలని, తాము త్వరగా అత్త, బామ్మ, అమ్మమ్మ, పిన్ని అని పిలిపించుకోవాలనీ కుటుంబ సభ్యుల్లో అందరూ కోరుకుంటుంటారు. గర్భిణీకి ఆ సమయంలో అందరూ సలహాదారులే. తినాల్సినవీ, తినకూడనవీ అని వాటి గురించి ఆమె చుట్టూ చేరి అందరూ చర్చించుకుంటూ ఉంటారు. బాలింతకీ, ఆమెను కనిపెట్టుకుని ఉండే వారికీ కూడా ఆహారాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్య విషయంలో ఆ మాత్రం జాగ్రత్తలు అవసరమే...

సాధారణంగా బిడ్డకు జన్మనిచ్చాక బాలింతలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే పెడతారు. ఆ సమయంలో జీర్ణమైన ఆహారం మాత్రమే శిశువుకు పాలుగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఈ సమయంలో బాలింతలు తగు జాగ్రత్తులు పాటిస్తూ తీసుకునే ఆహారం పుష్టికరంగా, ఆరోగ్యవృద్దికరంగా ఉండేలా చూసుకోవాలి. ప్రసవం జరిగిన తొలిరోజుల్లో ఎక్కువగా పులుపు, కారం, మసాలాలను తీసుకోకూడదు. గర్భవతిగా ఉన్నప్పుడే కాదు, ప్రసవం తర్వాత కూడా కొత్తగా తల్లి అయిన స్త్రీలకు నియమిత ఆహారం ఎంతో అవసరం. శిశువు జన్మించిన ఆరు నెలల వరకూ తల్లిపాలే శిశువులకు పోషకాహారం. శిశువు తాగే పాలు తేలికగా జీర్ణించుకుని ఆరోగ్యవంతంగా దినదినాభివృద్ది చెందాలంటే తల్లి తగిన జాగ్రత్తలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. దీంతో తల్లీ, బిడ్డల ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

ఈ విషయంలో నిపుణుల సలహా ప్రకారం సాధారణంగా బాలింతలకు తొలిసారి తల్లులైనప్పుడు వారిపై ఎటువంటి ఆంక్షలూ ఉండవు. కానీ మందులు వాడేటప్పుడు మాత్రం మీ డాక్టర్ సలహాలను పాటించడం అవసరం. ఆరు నెలల వరకూ ఆమె ఇచ్చే పాలే శిశువుకి సంపూర్ణ ఆహారంగా మారుతుంది. ఈ సమయంలో పొగతాగడం, మద్యపానం లాంటివి చేయకూడదు. మసాలాలు, కృత్రిమ రంగులు, రుచులతో నిండిన ఆహారాన్ని తీసుకోకూడదు. తల్లి తీసుకొనే ఆహారంలో ఇవి చేరితే బిడ్డ జీర్ణవ్యవస్థ చెడిపోతుంది. శుద్దమైన సమతులహారం మాత్రమే తీసుకోవాలి. దీంతో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.

ఇండియన్ పోస్ట్ నేటల్ ఫుడ్ ప్రకారం అందులు ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే బిడ్డ పుట్టే సమయంలో ఎక్కువ రక్తాన్ని కోల్పోతారు కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల తల్లి ఆరోగ్యానికి కావల్సి కాల్షియాన్ని పొందగలుగుతుంది. వీటిలో నెయ్యి మరియు ప్యూర్ బట్టర్ వంటివి చాలా ఆరోగ్యకరమైనవి. స్వచ్చమైన నెయ్యిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ప్రసవంలో ఏర్పడ్డ గాయాలను త్వరగా నివారిస్తుంది. ఇండియన్ పోస్ట్ నేటల్ ఫుడ్స్ లో పాలు మరియు ఇతర డైరీప్రొడక్ట్స్ ను కూడా చేర్చవచ్చు. వెజిటేబుల్స్ లో మునగకాయ మరయు గార్డ్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి తల్లి బిడ్డకు ఆరోగ్యకరమైన పోస్ట్ నేటల్ ఫుడ్స్ మరికొన్ని ఏంటో ఒక సారి చూద్దాం..

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

నెయ్యి: నెయ్యిని కొత్తగా తల్లైన వారికి ఇవ్వొచ్చు. ప్రసవంలో ఏర్పడ్డ గాయాలను నివారించడానికి ఇది బాగా సహాయపడుతుంది. శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

మెంతి ఆకుకూర: మెంతి కూరలో అధికంగా ఐరన్ మరియు విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇవి కొత్తగా తల్లైన వారికి, తిరిగి ఆరోగ్యాన్ని యథావిథిగా అందిస్తుంది . ప్రసవ సమయంలో కోల్పోయిన పోషకాంశాలను తిరిగి శరీరానికి అందిస్తుంది.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

జామకాయ: పోస్ట్ నేటల్ ఫుడ్స్ లో కొత్తతల్లి తినదగిన పండు లేదా కాయ జామకాయ. ఈ పండులో ఆపిల్ లో లాగే ఇందులో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

పాలు: పాలు మరియు ఇతర డైరీ ప్రొడక్ట్స్ ప్రసవం తర్వాత తల్లికి అవసరమయ్యే ప్రోటీనులను మరియు క్యాల్షియంను పుష్కలంగా అందిస్తుంది. ఈ రెండు రకాల ప్రోటీనులు మరియు క్యాల్షియం పాలిచ్చే తల్లికి చాలా అవసరం.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

కాకరకాయ: కాకరకాయను ఇంగ్లీష్ లో బిట్టర్ గార్డ్ అంటారు. ఈ గార్డ్స్ లో మనకు తెలియని వివిధ రకాలైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఈ గార్డ్ ఫ్యామిలీకి చెందిన వెజిటేబుల్స్ లో బిట్టర్ గార్డ్, బాటిల్ గార్డ్ వంటివి తీసుకోవడం వల్ల కొత్త తల్లిలో హార్మోనుల సమతుల్యంగా ఉంచుతుంది.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇంకా శక్తినిచ్చే విటమిన్ ఇ కూడా పుష్కలం. ఇండియన్ మహిళలు జీడిపప్పు, ఎండు ద్రాక్ష, వాల్ నట్స్ మరియు బాదాం లను పౌడర్ చేసి పాలలో కలిపి త్రాగడం వల్ల మంచి ఎనర్జీని పొందవచ్చు.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

మునక్కాయ: మునక్కాయను గ్రీన్ వెజిటేబుల్స్ లో ఒకటి దీన్ని ఇండియాలో ఎక్కువగా తింటారు. ఈ వెజిటేబుల్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దాంతో వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారి నుండి కొత్తగా తల్లైన మహిళ రక్షణ పొందుతుంది.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

గుడ్డు: గుడ్డులో మంచి క్రొవ్వులు మరియు ప్రోటీనులు మరియు క్యాల్షియం తగినన్ని ఉంటాయి కాబట్టి ఈ పౌష్టికాహారం ప్రసవం తర్వాత తల్లి చాలా అవసరం. వీటిని ప్రతి రోజూ ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల తగినంత శక్తి పొందగలుగుతారు. హార్మోనుల అసమతుల్యతను క్రమబద్దం చేస్తుంది.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

ఆకు కూరలు: అధిక శాతంలో ఐరన్, క్యాల్షియం, విటమిన్ కె మరియు విటమిన్ ఎ పుష్కలంగా ఉండే ఈ ఆహారాన్ని యూనివర్సల్ ఫుడ్ గా చెబుతారు. కాబట్టి ఇన్ని పోషకవిలువలున్న ఆకు కూరను తల్లి తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.

ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

బీట్ రూట్: పోస్ట్ నేటల్ సమయంలో తీసుకొనే ఆహారాల్లో ఇది ఒక మంచి ఆహారం. కొత్త తల్లికి అవసరమయ్యే బీటాకెరోటిన్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

English summary

Indian Foods For Postnatal Mothers | ఈ ఇండియన్ ఫుడ్స్ ప్రసవించిన తల్లికి చాలా అవసరం..!

Indian postnatal foods have proved to be very beneficial for new moms. We did not become one of the most populous countries in the world without providing good post-partum foods to mothers who have just delivered babies. In ancient India, women delivered 10 or more babies during their lifetime. And yet, they lived long enough to become great-grandmothers.
Story first published: Wednesday, March 6, 2013, 16:20 [IST]
Desktop Bottom Promotion