For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత బరువు తగ్గి, స్లిమ్ గా మారాలంటే ..!?

|

మహిళల జీవితంలో ప్రెగ్నెన్సీ మరియు డెలివరీ రెండు ఒక మధుర ఘట్టాలు. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చిన శారీరక మార్పులు మరియు అధిక బరువు, ప్రసవం తర్వాత కూడా అలాగే కొనసాగితే, తల్లికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త తల్లికి అదనపు బరువు అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

గర్భధారణ సమయంలో బరువు పెరగడం సహజం. కానీ, ప్రసవం తర్వాత స్త్రీలు తిరిగి యథాస్థితికి, ఒక మంచి షేప్ పొందడానికి కొంత సమయం పడుతుంది. అందుకు బాలింతలు కొంత సమయం వేచి చూడాల్సింది. బరువు తగ్గలేదని ఆందోళన చెందకుండా సహనంతో ఉండాలి. ఒత్తిడి లేకుండా జీవించడాన్ని ప్రయత్నించాలి. అదే సమయంలో కొన్ని షెడ్యూల్స్ మార్పు చేసుకోవాలి. రొటీన్ గా చేసే అలవాట్లను కొద్దిగా మర్చుకోవడం వల్ల ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ప్రెగ్నెన్సీ మరియు ప్రసవం తర్వాత బరువు తగ్గించుకోవడానికి కొత్త తల్లులు, తప్పకుండా గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలను ఇక్కడ ఇస్తున్నాం. వాటిని పరిశీలించి, పాటించినట్లైతే తప్పకుండా బరువు తగ్గవచ్చు.

హెల్తీ డైట్:

హెల్తీ డైట్:

పాలిచ్చే తల్లులు కఠినమైన డైట్ ను పాటించకూడదు. ఎక్కువ డైట్ ను పాటించడం కంటే, బరువు, శరీరంలో కొవ్వు పెరగడానికి ఉపయోగపడని ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువ తినడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి కొవ్వును నిరోధించే తాజా కూరగాలను మీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవాలి పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ జరగాలంటే, తినే ఆహారం మీద ఎక్కు శ్రద్దపెట్టాలి. అందులో ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. దాంతో మీరు నిదానంగా బరువు తగ్గడాన్ని గమనించాలి.

పాలు పట్టడం:

పాలు పట్టడం:

ప్రసవం తర్వాత పాలిచ్చే తల్లులు బరువు తగ్గుతారనేది ఇప్పటికీ కాంట్రవర్షియల్ గానే ఉంది. కానీ కొన్ని స్టడీస్ మాత్రం, శిశువుకు పాలు పట్టడం వల్ల కొత్త తల్లులు బరువు తగ్గడానికి సహాయపడుతుందని తెలుపుతున్నాయి. కొత్త తల్లిలో పాలు ఉత్పత్తి అవ్వడానికి కొన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయని, దాంతో శరీర బరువు తగ్గుతుందని తెలుపుతున్నాయి.

వ్యాయామం:

వ్యాయామం:

వ్యాయం ద్వారా బరువు తగ్గడానికి ప్రయత్నించాలనుకుంటే ఇది ఒక మంచి పద్దతి. కానీ, వైద్యుల సలహా ప్రకారం, రెగ్యులర్ వ్యాయామం చేయాల్సి ఉంటుంది . ప్రసవం తర్వాత తిరిగి నార్మల్ బాడీ కండీషన్ కు రావాలంటే కొంత సమయం పడుతుంది. అటువంటిప్పుడు ఇటువంటి వ్యాయామాలు చేయడానికి డాక్టర్ సలహాలు తప్పనిసరి.

విశ్రాంతి:

విశ్రాంతి:

ప్రసవం తర్వాత తిరిగి మీ శరీరం యథాస్థితికి రావడానికి సమయం పడుతుందని తెలుసుకొన్నారు కాబట్టి, ఆ సమయం మీరు ఓపికతో మరియు సైరన డైట్ ను పాటిస్తూ వ్యాయామాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఒత్తిడి అనేది మిమ్మల్ని ఎప్పటికీ బరువు తగ్గనివ్వదు . మీ రెగ్యులర్ పనులతో పాటు యోగాను చేయడం వల్ల పోస్ట్ నేటల్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

తగినంత నిద్ర:

తగినంత నిద్ర:

పోస్ట్ ప్రెగ్నెన్సీ బాడీ వెయిట్ తగ్గడానికి ముఖ్యంగా తగినంత నిద్ర అవసరం. సరైన నిద్ర పొందడం వల్ల శరీరానికి విశ్రాంతి కలిగి ప్రసవం తర్వాత బరవు తగ్గడానికి సహాయపడుతుంది. ప్రసవం తర్వాత సరైన విశ్రాంతి తీసుకోవడం వల్ల హార్మోనులు సమతుల్యం చెందుతాయి. మీ శిశువు ఎప్పుడు నిద్రిస్తుందే అదే టైమ్ లో మీరు కూడా నిద్రపోవడాన్ని అలవాటు చేసుకోండి.

శరీరానికి తగినంత హైడ్రేషన్:

శరీరానికి తగినంత హైడ్రేషన్:

మీరు పాలిచ్చే తల్లులైతే, ఎక్కువ నీళ్ళ తాగడం చాలా ముఖ్యం. పాలిచ్చే తల్లుల్లి రోజులో అధిక నీరు తాగడం వల్ల వారి శరీరం తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతే కాదు, పాల ఉత్పత్తికి కూడా చాలా మేలు చేస్తుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల, పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అనవసరమైన ఆహారానికి దూరంగా ఉండవచ్చు.

English summary

Tips To Lose Post-Pregnancy Weight

Pregnancy and delivery are the most beautiful parts of a woman's life. But, the unwanted weight gain, which remains as the after effect of pregnancy will be disturbing and irritating for most of the new moms.
Story first published: Monday, August 19, 2013, 17:01 [IST]
Desktop Bottom Promotion