For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవించిన తర్వాత పొట్ట తగ్గించుకొనేందుకు సులభ చిట్కాలు

|

గర్భం ధరించినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకూ గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది. అయితే ప్రసవానంతరం పొట్ట తిరిగి మామూలు స్థితిలోకి రావాలి. కానీ చాలా మంది మహిళల్లో ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే...ప్రెగ్నెంట్ లాగేనే కనిపిస్తారు. దీని వల్ల కొంతమంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్దమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు. మరి అవేంటో మీరు కూడా తెలుసుకోండి...

ఫ్రెష్ గా ఉన్నవాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

ఫ్రెష్ గా ఉన్నవాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

కొంతమంది ఉదయం, సాయంత్రం...ఇలా రెండు పూటలకు సరిపడా వంట ఉదయమే చేసేస్తారు. కానీ అలా ఉదయం చేసిన పదార్థాలు సాయంత్రానికి చల్లగా అయిపోతాయి. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఏ పూటకు ఆ పూటే తాజాగా, వేడి వేడిగా వండుకొని తినడం వల్ల అటు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా...ఇటు పొట్ట ఎత్తు కూడా తగ్గుతుంది. అలా తాజా పండ్లు కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి.

కూరగాయలు:

కూరగాయలు:

ఇక కూరగాయల విషయంలో ఏ సీజన్ లో దొరికే తాజా కూరగాయల్ని ఆ సీజన్ లో తప్పనిసరిగా తినడం మంచిది. మీరు ఏది తిన్నా సరే..అవి తాజాగా ఉండేవై ఉండాలి. అప్పుడే తయారుచేసినవి మాత్రమే తీసుకోవాలి. అలాగే యటి ఫుడ్స్ క్యాలరీలు ఎక్కువగా ఉండేవి తీసుకోకూడదు. వీటితో పాటు మరొక విషయం గుర్తించుకోవాలి. అదేంటంటే మీరు తినే ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. లేదంటే మీకున్న సమస్యతో పాటు అజీర్తి సమస్య కూడా తోడవుతుంది.

బాగా నమిలి తినడం ఉత్తమం:

బాగా నమిలి తినడం ఉత్తమం:

కొంత మంది ఆహారాన్ని నమలకుండా అలాగే మింగేస్తుంటారు. కానీ ఈ సమయంలో అది మంచిది కాదు. కాబట్టి నోట్లో పెట్టుకున్న పదార్థాన్ని పూర్తిగా నమిలిన తర్వాతే మింగాలి. ఇలా నమలడం వల్ల నోటికి మంచి ఎక్సర్ సైజ్ అవడంతో పాటు పొట్ట ఎత్తు తగ్గించుకుని పూర్వరూపాన్ని సొంతం చేసుకుంటుంది.

వ్యాయామం:

వ్యాయామం:

ప్రసవం తర్వాత--- ఎన్ని రోజుల తర్వాత వ్యాయామం చేయడం మొదలు పెట్టాలి?ఏయే వ్యాయామాలు చేయాలి? అనే విషయం మీ డాక్టర్, ఫిట్ నెస్ ట్రెయినర్ ని అడిగి తెలుసుకోవాలి. ఆ తర్వాత సంబంధిత వ్యాయామాలకు శిక్షన తరగతులకు వెళ్తారా? లేదంటే ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తారా? అనే విషయాలు మీరే నిర్ణయించుకుని క్రమం తప్పకుండా వాటిని అమలు చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. దీంతో శారీరక, మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. అలాగే వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా చేయడం మాత్రం మర్చిపోవద్దు.

భోజనం తర్వాత చిన్నపాటి నడక:

భోజనం తర్వాత చిన్నపాటి నడక:

భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటారు. మరి ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే మీ పొట్ట తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు పావుగంట అయినా అటూ ఇటూ నడవాలి. ఇది ఆరోగ్యానికి, పొట్టతగ్గడానికి రెండింటికీ మంచిది.

హాట్ వాటర్ విత్ లెమన్ జ్యూస్& హనీ:

హాట్ వాటర్ విత్ లెమన్ జ్యూస్& హనీ:

ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీరు త్రాగడం మంచిది. దీనికి ఒక చెంచా నిమ్మరసం, అరచెంచా తేనె కూడా కలిపితే రుచితో పాటు మరింత మెరుగైన ఫలితం ుంటుంది. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని భోజనానికి ముందు కూడా తాగవచ్చు.

లవంగాలు

లవంగాలు

దాల్చిన చెక్క రెండు లీటర్ల నీటిలో రెండు మూడు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పది నిముషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చలికాలంలో అయితే గోరువెచ్చగా ఎండాకాలంలో అయితే చల్లార్చుకుని తాగాలి. ఇలా వరుసగా 40రోజుల పాటు తాగడం వల్ల పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతిని లవంగాలు, దాల్చిన చెక్క ముక్కకు బదులుగా బార్లీ, వాము..చెంచా చొప్పున వేసి కూడా ప్రయత్నించవచ్చు.

తల్లి పాలు

తల్లి పాలు

పిల్లలకు డబ్బా పాలు కాకుండా తల్లి పాలు పట్టడం వల్ల కూడా సమస్యను తగ్గించుకోవచ్చు. తల్లి ప్రతి రోజూ పాలివ్వడం వల్ల రోజుకు శరీరంలో 500 క్యాలరీలు ఖర్చవుతాయి. కాబట్టి పాలివ్వడం కూడా ప్రసవానంతరం పొట్ట తగ్గించుకోవడానికి ఒక మార్గం.

యాపిల్

యాపిల్

పండ్లలో ముఖ్యంగా యాపిల్ మంచిది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పెక్టిన్...ఆహారం ద్వారా వచ్చే కొవ్వుల్ని శరీరం గ్రహించకుండా చేయడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తాయి. ఫలితంగా పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది.

సూచన:

సూచన:

సిజేరియన్, నార్మల్ ..వీటిలో ఏది జరిగినా ఓ ఆరు నెలల వరకూ బరువులు ఎత్తడం, ఎక్కువ బలంతో వ్యాయామాలు చేయడం అస్సలు మంచిది కాదు. నార్మల్ డెలవరీ అయినప్పుడు కొన్ని రోజుల తర్వాత వ్యాయామం చేయడం మొదలు పెట్టవచ్చు. కానీ సిజేరియన్ అయితే మాత్రం వ్యాయామం పున: ప్రారంభించడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది. ఏదేమైనా సరే వ్యాయామం ఎప్పుడు మొదలు పెట్టాలి? దానికి ఎంత సమయం కేటాయించాలి? చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలన్నీ సంబంధిత ఫిట్ నెస్ నిపుణుల సలహా మేరకే పాటించడం మంచిది.

English summary

Losing Weight After Pregnancy

Having a baby changes your life -- it also changes your body. You may be surprised by some of those changes if you're a new mom, wondering why it takes so long for your belly to shrink, how to lose the baby weight and whether your body will ever be the same.
Story first published: Tuesday, December 2, 2014, 17:47 [IST]
Desktop Bottom Promotion