For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడానికి మార్గాలు

By Lakshmi Perumalla
|

గర్భధారణ అనేది మీ మనస్సు మరియు శరీరంలో అనేక మార్పులకు కారణం అవుతుంది. గర్భం సమయంలో ఒత్తిడి మరియు ఆతృతకు దారి తీయవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడి కూడా మీ డెలివరీ తర్వాత సమయంలో కూడా ఉండవచ్చు. మీ జీవితంలో మీ దగ్గర మీ బిడ్డ ఉండటం అనేది ఒక అందమైన సమయంగా చెప్పవచ్చు. మీ కొత్త నిత్యకృత్యాలను సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఆందోళన, విసుగు మరియు అలసిపోయిన భావన కలుగుతుంది. సాధారణంగా ఇది మీ డెలివరీ తర్వాత మొదటి కొన్ని నెలల్లో జరుగుతుంది. మీరు ముందు నుండే ప్రసవానంతర ఒత్తిడిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలి.

గర్భధారణ సమయంలో ఒత్తిడిని వదిలివేయడం వలన మీ పుట్టబోయే బిడ్డను ఆరోగ్య సంబంధిత సమస్యల నుండి దూరంగా ఉంచవచ్చు. ప్రసవానంతర ఒత్తిడి పరిష్కరించేందుకు మీ మనస్సును ప్రశాంతత మరియు రిలాక్స్డ్ గా ఉంచటం ముఖ్యం. అప్పుడు మీరు ఫుల్ ఎనర్జీతో మీ శిశువు పట్ల శ్రద్ధ వహించవచ్చు. ప్రసవానంతరం ఒత్తిడి స్థాయి పెరిగితే అది మీ మీద మరింత తీవ్రమైన ప్రభావం పడి నిరాశకు దారితీస్తుంది. ఇక్కడ ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడే కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను ప్రయత్నించి మాతృత్వాన్ని ఆస్వాదించవచ్చు.

ఆరోగ్యకరమైన ఆహారం

ఆరోగ్యకరమైన ఆహారం

మీరు పూర్తిగా మీ బిడ్డ పట్ల జాగ్రత్త తీసుకున్న సందర్భంలో మీరు ఆహారం తీసుకోవటం మిస్ అవుతారు. కానీ,ఒక ఆరోగ్యకరమైన ఆహారంను షెడ్యూల్ ప్రకారం తీసుకోవటం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఇది మీ ప్రసవానంతర ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది.

తగినంత సమయం గడపండి

తగినంత సమయం గడపండి

మీ శిశువుతో ఎక్కువ సమయం గడపటం అనేది ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడం కోసం ఉత్తమ ఆలోచన. ఇది మీకు విశ్రాంతి మరియు మీ శిశువుతో బంధం పెరుగటానికి సహాయపడుతుంది. ప్రసవానంతర ఒత్తిడి పరిష్కరించేందుకు మీ ఆ తీపి స్మైల్ కన్నా ఈ ప్రపంచంలో ఉత్తమ మెడిసిన్ ఏమి ఉంటుంది.

ఒక ఔటింగ్ ప్లాన్

ఒక ఔటింగ్ ప్లాన్

మీరు చాలా అలసిన అనుభూతిలో ఉన్నప్పుడు మీ భాగస్వామి,స్నేహితులు లేదా బంధువులతో ఒక ఔటింగ్ ప్రణాళిక చేయటం ఒక మంచి ఆలోచన.మీరు మీ శిశువు తీసుకుని వెళ్ళకపోతే,అప్పటికి ఇతరుల సహాయం తీసుకోవచ్చు. శిశువును రోజు బయటకు తీసుకువెళ్ళితే మీరు ప్రసవానంతర ఒత్తిడి ఎదుర్కోవటానికి సహాయం చేస్తుంది.

లుక్ కొనసాగించండి

లుక్ కొనసాగించండి

గర్భం మీ భౌతిక రూపంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్ని అధునాతన మరియు ఫ్యాషన్ దుస్తులు మరియు ఉపకరణాలను ప్రయత్నించండి.మీ అందం పెరగటానికి సెలూన్ సందర్శించండి. ఇది ఖచ్చితంగా మీ విశ్వాసం మరియు స్వీయ గౌరవం పెరుగటానికి సహాయంచేస్తుంది. మీరు ఈ చిట్కా అనుసరిస్తే ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడం సులభంగా ఉంటుంది.

మీ భాగస్వామి మీ పనులను పంచుకోవటం

మీ భాగస్వామి మీ పనులను పంచుకోవటం

మీ భాగస్వామి మీ పనులను పంచుకోవటం అనేది ఒక మంచి ఆలోచన. మీరు మీ భాగస్వామిని రాత్రి సమయంలో బేబికి డైపర్ మార్చటం చేయాలనీ చెప్పండి. ప్రసవానంతర ఒత్తిడి తగ్గించడం కోసం మీ భర్త ప్రేమ ఖచ్చితంగా సహాయపడుతుంది.

ప్రసవానంతరం యోగ

ప్రసవానంతరం యోగ

మీరు మీ డెలివరీ తర్వాత శారీరికంగా ఆరోగ్యంగా ఉండటానికి యోగ లేదా ధ్యానం చేయడం ప్రారంభించవచ్చు. ఇది ప్రసవానంతర ఒత్తిడి తగ్గించడం కోసం ఉత్తమ ఆలోచనలలో ఒకటి. యోగ సాధన ప్రసవానంతర ఒత్తిడి పరిష్కరించేందుకు మాత్రమే కాకుండా మొత్తం మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం సహాయపడుతుంది.

సామాజిక సంబంధాలు

సామాజిక సంబంధాలు

మీ సామాజిక సంబంధాలలో క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు. అప్పుడు అది మిమ్మల్ని చురుకుగా మరియు శక్తివంతముగా చేస్తుంది.మీరు మీ సామాజిక క్లబ్ ను సందర్శించవచ్చు. మీ స్నేహితులతో చాట్ చేయవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా మీ శిశువు యొక్క కొత్త ఫోటోలను పంచుకోవచ్చు.ఇది ప్రసవానంతరం ఒత్తిడిని మరియు ఆతృతను తగ్గించడంలో సహాయం చేస్తుంది.

English summary

Ways to reduce postpartum stress

Pregnancy will bring many changes to your mind and body. This may lead to stress and anxiety during the pregnancy period. But, in some cases, the stress may stay for a long time even after your delivery
Story first published: Tuesday, January 7, 2014, 20:21 [IST]
Desktop Bottom Promotion