For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత వీటికి దూరం: తల్లిబిడ్డకు క్షేమం

|

గర్భం ధరించడం మరియు ఎటువంటి సమస్య లేకుండా ప్రసవించడం అనేది స్త్రీకి దేవుడు ఇచ్చిన ఒక వరం అని చెప్పవచ్చు. శారీరకంగా స్త్రీకు ఒక కష్టమైన పనే. అయితే గర్భావధి కాలం ముగిసి, ప్రవసించిన తర్వాత ఒక సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అదే సమయంలో స్త్రీ తన ఆరోగ్యం గురించి, తన శక్తి సామర్థ్యాలు, ఫిట్ గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసవించిన తర్వాత చాలా మంది మహిళలో చాలా అపోహలు, ఆందోళనలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా డైట్ విషయంలో. ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎటువంటి ఆహారాలను దూరంగా ఉండాలని అనుమానాలు వారిలో మొదలవుతాయి. వీటన్నింటికి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రసవించి అనేక మంది తల్లులు ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు.

గర్భధారణ సమయంలో, కడుపు పెరిగే శిశువు ఆరోగ్యంను ద్రుష్టిలో పెట్టుకొని చాలా వరకూ కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు. మరి ఇప్పుడు ప్రసవించిన తర్వాత మీకు ఇష్టమైన ఆహారాలను తినేందుకు ఒక మంచి సమయం. మీ ఫేవరెట్ డిష్ లను మీ మెనులో చేర్చుకొని, రిలాక్స్ అయ్యేందుకు ఒక మంచి సమయం. కానీ ప్రసవం తర్వాత తినకూడాని ఆహారాలేవైనా ఉన్నాయా?

ఉన్నాయనే చెప్పాలి ఎందుకంటే, శిశువు పొట్టలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రసవం జరిగిన తర్వాత కూడా శిశువు, తల్లిమీద ఆధారపడుతారు. తల్లి నుండి పొందే తగిన పోషకాలు మరియు న్యూట్రీషియన్స్ తోనే బేబీ పెరుగుదల ఉంటుంది. పాలిచ్చే తల్లు, వారు తీసుకొనే ఆహారం మీద కొంత శ్రద్ద వహించడం చాలా అవసరం. మీరు తీసుకొనే ఆహారం ఆరోగ్యకరంగా లేకపోతే, అది మీ బేబీ మీద కూడా ప్రభావం చూపుతుంది. అలర్జీ లేదా కోలిక్ లేదా ఇతర సమస్యలు బ్రెస్ట్ మిల్క్ ద్వారా ప్రభావం చూపవచ్చు. కాబట్టి, మీరు ప్రసవం తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదో క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకోండి...

స్పైసీ ఫుడ్

స్పైసీ ఫుడ్

మెక్సికన్ హాట్ పెప్పర్ లేదా ఎటువంటి స్పైసీ ఫుడ్ కు అయినా సరే దూరంగా ఉండాలి. మీరు తీసుకొనే ఆహారం మీదనే మీ బేబీ కూడా మీ మీమీద ఆధారపడి ఉంటుంది. కారంగా ఉన్న ఆహారాలను దూరంగా ఉండాలి.

ఫ్యాటీ మీట్

ఫ్యాటీ మీట్

కొవ్వు కలిగిన ఆహారాలు తీసుకోవడం ప్రసవం తర్వాత పూర్తిగా తగ్గించుకోవాలి. గర్భధరించినప్పుడు బరువు పెరగడం సహజం, ఆ అదనపు బరువు తగ్గించుకొనే ఆలోచనలో ఉన్నప్పుడు, తల్లి, తప్పనిసరిగా ఫ్యాటీ ఫుడ్స్ మాంసాహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవాలి. మరియు ఎక్కువ కొవ్వు కలిగిన ఆహారాలు తల్లిలో జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి, ఫ్యాటీ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

ఫ్రైడ్ ఫుడ్స్

ఫ్రైడ్ ఫుడ్స్

ప్రసవం తర్వాత ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. అవి శరీరంలో కొవ్వు పెరుగుదలకు కారణం అవుతాయి. కాబట్టి, మీరు బరువు తగ్గడానికి బదులు మరింత బరువు పెరిగేందుకు కారణం అయ్యే ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది.

సాఫ్ట్ డ్రింక్స్

సాఫ్ట్ డ్రింక్స్

సాప్ట్ డ్రింక్స్ పొట్టలో గ్యాస్ ఏర్పడు కారణం అవుతుంది. మరియు అనేక జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. అలాగే మీ ద్వారా మీ బేబీకి కూడా సమస్య ఏర్పడుతుంది. కాబట్టి, ప్రసవం తర్వాత ఈ సాఫ్ట్ డ్రింక్ ను మీరు తీసుకోవడం తగ్గించాలి.

కెఫిన్

కెఫిన్

ప్రసవం తర్వాత తప్పని సరిగా నివారించాల్సిన ఆహారం కాఫీ తీసుకోవడం నివారించాలి. కాఫీ వల్ల తల్లి లేదా బిడ్డలో నిద్రలేమి సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి, ప్రసవం తర్వాత కెఫిన్ కు దూరంగా ఉండండి.

ఆల్కహాల్

ఆల్కహాల్

ప్రసవం తర్వాత తప్పనిసరిగా నివారించాల్సిన మరో ఆహారం, ఆల్కహాల్. గర్భంతో ఉన్నప్పుడు మీరు చాలా కఠినంగా తీసుకొన్న ఆహారపు అలవాట్లు , ప్రసవం తర్వాత కూడా తీసుకోవడం తల్లి, బిడ్డలిద్దరికి చాలా మేలు చేస్తుంది.

పాలు

పాలు

ప్రసవం తర్వాత తల్లి నివారించాల్సి ఫుడ్స్ లో ఇది ఒకటి కావచ్చు. అయితే ఇది అందరు తల్లులకు మరియు బిడ్డలకు వర్తించకపోవచ్చు. కొంత మంది పిల్లలకు డైరీ ప్రొడక్ట్స్ కు సరిపడకపోవచ్చు. అలర్జీలు కలగవచ్చు. అందువల్ల ప్రసవం తర్వాత తల్లి డైరీప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

మెర్క్యురి కలిగిన ఆహారం

మెర్క్యురి కలిగిన ఆహారం

ప్రసవం తర్వాత అధిక శాతం మెర్క్యురి కలిగిన చేపలను తినడం నివారించాలి. ఈ మెర్క్యురి ఫుడ్స్ ను గర్భం ధరించినప్పుడు, తినకూదని సలహాలిస్తుంటారు. కానీ, ప్రసవం తర్వాత కూడా ఇది వర్తిస్తుంది.

సాఫ్ట్ చీజ్

సాఫ్ట్ చీజ్

సాఫ్ట్ చీజ్ ను పాలిచ్చే తల్లులి తినకూడదు. ఇది బేబీకి అనారోగ్యం చేస్తుంది. కాబట్టి, గర్భంతో ఉన్నప్పుడు, ప్రసవం తర్వాత సాప్ట్ చీజ్ తీసుకోవడం నివారించడండి.

English summary

What Not To Eat After A Delivery

Giving birth is a physically exhausting time for the mother. But the good news is that you can finally hold your bundle of joy in your arms. Now you will start to worry about your capabilities to be a good mom. You will have doubts about everything, especially concerning your diet.
Story first published: Monday, February 17, 2014, 14:04 [IST]
Desktop Bottom Promotion