For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత బరువు తగ్గించే 8 పద్దతులు

|

ప్రసవం తర్వాత బరువు తగ్గడం అంత సులభమైన పని కాదు, ప్రసవం తర్వాత కూడా కొంత మంది మహిళలు గర్భిణీగానే కనిపిస్తుంటారు. అందుకు కారణం గర్భధారణ సమయంలో యూట్రస్ విస్తరించబడి ఉంటుంది. అది తిరగి యథాస్థితికి, నార్మల్ షేప్ మరియు సైజ్ కు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా హార్మోన్లు మరియు డైట్లో మార్పులు కూడా మిమ్మల్ని ఫ్యాట్ గా కనబడేలా చేస్తుంది .

అందువల్ల, పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కొంచెం కష్టం అవుతుంది, అయితే, మీ పోస్ట్ నేటల్ డైట్ లో కొన్ని వెయిట్ లాస్ ఫుడ్స్ : నిమ్మవంటివి చేర్చుకోవడం ద్వారా అవి గొప్పగా సహాయపడుతాయి . పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ డైట్ చాలా సింపుల్ గా ఉంటుంది. మరి ఈ సిట్రస్ ఫ్రూట్ మీరు ఎలా తీసుకోవాలో ఒకసారి చూడండి...

లెమన్ జ్యూస్ :

లెమన్ జ్యూస్ :

ఆరోగ్యకరమైన ద్రవాలు అంటే నిమ్మరసం వంటివి తీసుకోవడం మంచిది. ఇవి పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . అయితే నిమ్మజ్యూస్ కు పంచదార మిక్స్ చేయకుండా తీసుకోవడం మంచిది. మంచి ఆరోగ్యానికి మరియు కొవ్వు కరిగించడానికి పంచదారకు బదులు తేనెను మిక్స్ చేసుకోవచ్చు. శరీరంలో కొవ్వు కణాలను విచ్చిన్న చేయడానికి నిమ్మ మరియు తేనె చాలా అద్భుతంగా సహాయపడుతాయి . ప్రసవం తర్వత, మహిళ ప్రతి రోజూ ఉదయం నిమ్మ మరియు తేనె మిశ్రమాన్ని తీసుకోవచ్చు. తాగాజా తయారుచేసిన తేనె మరియు నిమ్మజ్యూస్ ను కాలీ కడుపుతో ఒక గ్లాసు తీసుకోవాలి. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేసి, కడుపును క్లీన్ గా ఉంచుతంది.

గోరువెచ్చని లెమన్ వాటర్:

గోరువెచ్చని లెమన్ వాటర్:

మీరు తప్పకుండా రోజంతా వేడినీళ్ళు త్రాగడానికి ప్రయత్నించండి . హాట్ వాటర్ లో బరువు తగ్గించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. భోజనం చేసిన తర్వాత, వెంటనే నీళ్ళు త్రాగకండి. మీకు దప్పికగా ఉన్నప్పుడు, కొద్దిగా తీసుకోవచ్చు. అరగంట లేదా గంట తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళు త్రాగాలి . మరింత మంచి ఫలితాలు పొందాలంటే అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకోండి . పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కొరకు ప్రతి రోజూ మూడు గ్లాసుల లెమన్ వాటర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

లెమన్ డ్రెస్సింగ్:

లెమన్ డ్రెస్సింగ్:

సలాడ్స్ మరియు కొన్ని ప్రత్యేకమైన వంటలు మీ పోస్ట్ నేటల్ డైట్ లో చేర్చండి. సలాడ్స్ డ్రెస్సింగ్ నిజంగా కొవ్వును కరిగిస్తాయి . కాబట్టి పోస్ట్ నేటల్ వెయిట్ లాస్ కొరకు మీ సలాడ్స్ లో నిమ్మరసాన్ని జోడించండి.

ఫ్రెష్ గా ఉన్నవాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

ఫ్రెష్ గా ఉన్నవాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి:

కొంతమంది ఉదయం, సాయంత్రం...ఇలా రెండు పూటలకు సరిపడా వంట ఉదయమే చేసేస్తారు. కానీ అలా ఉదయం చేసిన పదార్థాలు సాయంత్రానికి చల్లగా అయిపోతాయి. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఏ పూటకు ఆ పూటే తాజాగా, వేడి వేడిగా వండుకొని తినడం వల్ల అటు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా...ఇటు పొట్ట ఎత్తు కూడా తగ్గుతుంది. అలా తాజా పండ్లు కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి.

కూరగాయలు:

కూరగాయలు:

ఇక కూరగాయల విషయంలో ఏ సీజన్ లో దొరికే తాజా కూరగాయల్ని ఆ సీజన్ లో తప్పనిసరిగా తినడం మంచిది. మీరు ఏది తిన్నా సరే..అవి తాజాగా ఉండేవై ఉండాలి. అప్పుడే తయారుచేసినవి మాత్రమే తీసుకోవాలి. అలాగే యటి ఫుడ్స్ క్యాలరీలు ఎక్కువగా ఉండేవి తీసుకోకూడదు. వీటితో పాటు మరొక విషయం గుర్తించుకోవాలి. అదేంటంటే మీరు తినే ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది. లేదంటే మీకున్న సమస్యతో పాటు అజీర్తి సమస్య కూడా తోడవుతుంది.

బాగా నమిలి తినడం ఉత్తమం:

బాగా నమిలి తినడం ఉత్తమం:

కొంత మంది ఆహారాన్ని నమలకుండా అలాగే మింగేస్తుంటారు. కానీ ఈ సమయంలో అది మంచిది కాదు. కాబట్టి నోట్లో పెట్టుకున్న పదార్థాన్ని పూర్తిగా నమిలిన తర్వాతే మింగాలి. ఇలా నమలడం వల్ల నోటికి మంచి ఎక్సర్ సైజ్ అవడంతో పాటు పొట్ట ఎత్తు తగ్గించుకుని పూర్వరూపాన్ని సొంతం చేసుకుంటుంది.

భోజనం తర్వాత చిన్నపాటి నడక:

భోజనం తర్వాత చిన్నపాటి నడక:

భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటారు. మరి ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే మీ పొట్ట తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు పావుగంట అయినా అటూ ఇటూ నడవాలి. ఇది ఆరోగ్యానికి, పొట్టతగ్గడానికి రెండింటికీ మంచిది.

లవంగాలు దాల్చిన చెక్క

లవంగాలు దాల్చిన చెక్క

లవంగాలు దాల్చిన చెక్క రెండు లీటర్ల నీటిలో రెండు మూడు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి పది నిముషాల పాటు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని చలికాలంలో అయితే గోరువెచ్చగా ఎండాకాలంలో అయితే చల్లార్చుకుని తాగాలి. ఇలా వరుసగా 40రోజుల పాటు తాగడం వల్ల పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఇదే పద్ధతిని లవంగాలు, దాల్చిన చెక్క ముక్కకు బదులుగా బార్లీ, వాము..చెంచా చొప్పున వేసి కూడా ప్రయత్నించవచ్చు.

English summary

8 Tips for Losing Weight After Pregnancy

Having a baby changes your life -- it also changes your body. You may be surprised by some of those changes if you're a new mom, wondering why it takes so long for your belly to shrink, how to lose the baby weight and whether your body will ever be the same.
Story first published: Saturday, September 26, 2015, 17:23 [IST]
Desktop Bottom Promotion