For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిస్కరేజ్(అబార్షన్)జరిగిన తర్వాత తీసుకోవల్సిన హెల్తీ ఫుడ్స్

|

గర్భస్రావం అనేది మహిళలకు ఒక దురదృష్టకరమైన విషయం. ఇది మన ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి దీన్ని నేచుర్ ఆఫ్ లాస్ అని కూడా పిలవవచ్చు. గర్భం ధరించామని సంతోషకరమైన, ఆనంద సమయంలో ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఇలా జరగడం వల్ల, ఆ బాధ నుండి బయటపడటం చాలా కష్టం .

ఏదైతేనేమీ, గర్భస్రావం జరగడానికి వివిధ రకాల, మనకు తెలియని కారణాలుండవచ్చు . ఇది అకస్మాత్తుగా తల్లిలో లేదా పిండానికి అవసరం అయ్యే వాటిలో ఏదో ఒక లోపం వల్లే ఇలా జరుగుతుంటాయి. పిండం అనారోగ్యం కారణంగా కూడా గర్భస్రావం జరుగుతుంటుంది.

అయితే, గర్భస్రావం జరగడానికి కారణం ఏదైనా, భరించలేని పరిస్థితిని ఎదుర్కోవల్సి వస్తుంది. అందువల్ల, అనుకోకుండా గర్భస్రావం జరిగినప్పుడు మీరు తర్వాతి గర్భధారణకు ఎలాంటి ఇబ్బందులు, అవాంతరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

మరీ ముఖ్యంగా తీసుకోవల్సిన జాగ్రత్త, గర్భస్రావం జరిగిన తర్వాత మహిళలు తప్పనిసరిగా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమై ఆహారాలు తీసుకోవడం ద్వారా గర్భస్రావం వల్ల కోల్పోయిన న్యూట్రీషియన్స్ మరయు పోషకాలను తిరిగిపొందవచ్చు. అంతే కాదు, ముందుముందు గర్భం ధరించడానికి శరీరాన్ని దృడంగా తయారుచేసుకోవచ్చు.

గర్భస్రావం జరిగినప్పుడు, మహిళల్లో అధిక రక్తస్రావం వల్ల0 అనేక విటమిన్స్, మినిరల్స్ కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి, అలా కోల్పోయిన వాటిని తిరిగి పొందడానికి సరైన పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. అలాంటి ఆహారాలను ీ క్రింది లిస్ట్ ద్వారా తెలపడం జరిగింది....

1. బీన్స్:

1. బీన్స్:

బీన్స్ లో ఐరన్ మరియు మెగ్నీషియం అధికంగా ఉంటుంది . ఈ రెండు గర్భస్రావం జరిగిన మహిళలకు చాలా అవసరం. ఇది అనీమియా మరియు డిప్రెషన్ తగ్గించడానికి ఖచ్చితంగా అవసరం అవుతుంది.

2. గ్రీన్ వెజిటేబుల్స్:

2. గ్రీన్ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ముఖ్యంగా ఆకుకూరలు వంటి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో క్యాల్షియం మరియు ఐరన్ వంటివి అధికంగా ఉండటం వల్ల గర్భస్రావం జరిగిన మహిళలకు చాలా అవసరం అవుతాయి.

3. బొప్పాయి:

3. బొప్పాయి:

బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

4. స్ట్రాబెర్రీ:

4. స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీలలో ఐరన్ మరియు విటమిన్ సిలు అధికంగా ఉండటం వల్ల అభార్షన్ జరిగినప్పుడు వీటి తీసుకోవడం చాలా అవసరం.

5. గ్రేప్ ఫ్రూట్:

5. గ్రేప్ ఫ్రూట్:

విటమిన్ సి అధికంగా ఉండే మరో పవర్ బ్యాంక్ గ్రేప్ ఫ్రూట్. ఇది శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది .

6. సోయా మిల్క్:

6. సోయా మిల్క్:

గర్భస్రావంలో అధికంగా బ్లీడింగ్ అవ్వడం వల్ల ఎముకల్లో క్యాల్షియం తగ్గుతుంది కాబట్టి, సోయా మిల్క్ తీసుకోవడం వల్ల తిరిగి క్యాల్షియంను పొందవచ్చు.

7. నట్స్:

7. నట్స్:

నట్స్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఎంతో అవసరం అవుతుంది . ఆందోళను మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.

8. డ్రై ఫ్రూట్స్ :

8. డ్రై ఫ్రూట్స్ :

బాదం, పిస్తా, ఎండు ద్రాక్షలో అత్యధికంగా క్యాల్షియం డ్రై ఫ్రూట్స్ లో అధికంగా ఉండటం వల్ల ఇవి శరీరానికి తగినంత ఎనర్జీని అందిస్తాయి.

9. రెడ్ మీట్:

9. రెడ్ మీట్:

రెడ్ మీట్ ను బాగా ఉడికించి లేదా బాగా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల గర్భ స్రావంలో కోల్పోయిన రక్తంను తిరిగి పొందవచ్చు.

10.ఫిష్:

10.ఫిష్:

చేపలు ముఖ్యంగా సాల్మన్ మరియు సార్డిన్స్ వంటి వాటిలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలు మరయు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.

11. పాలు:

11. పాలు:

పాలు ఒక అత్యవసరమైనటువంటి ఆహారం . గర్భస్రావం జరిగిన తర్వాత తప్పనిసరిగా తీసుకోవాల్సి ఆహారాల్లో ఇది ఒకటి క్యాల్షియం వంటి హైన్యూట్రీషియన్స్ శరీరానికి చాలా అవసరం అవుతాయి.

12. డైరీ ప్రొడక్ట్స్ :

12. డైరీ ప్రొడక్ట్స్ :

కొంత మంది మహిళలు పాలు తాగడానికి ఇష్టపడరు. అటువంటి వారు పాలకు ప్రత్యామ్నాయంగా డైరీప్రొడక్ట్స్, కాటేజ్ చీజ్, పెరుగు వంటివి తీసుకోవచ్చు. ఎ శరీరంలో కోల్పోయిన క్యాల్షియం ను తిరిగి పొందడానికి ఇవి చాలా గ్రేట్ గా సహాయపడుతాయి.

13. ప్లెయిన్ చాక్లెట్:

13. ప్లెయిన్ చాక్లెట్:

ప్లెయిన్ చాక్లెట్ లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది డిప్రెషన్ మరియు ఆందోళనను మాత్రమే తగ్గించడం కాదు, కణాల పునరుద్దరణకు గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Indian Healthy Foods After A Miscarriage

A woman loses an extremely high quantity of vitamins and minerals due to excessive bleeding post-abortion. Hence, a good dosage of healthy foods for women after miscarriage becomes a necessity. Given below are some foods that would help you replenish and store nutrients in the body.
Story first published: Tuesday, May 19, 2015, 16:26 [IST]
Desktop Bottom Promotion