For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రసవం తర్వాత యోని శుభ్రత కొరకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

|

ప్రసవం తర్వాత వైజినల్ కేర్(యోని శుభ్రత)తీసుకోవడం చాలా ముఖ్యంగా. మరీ ముఖ్యంగా వైజినల్ డెలవరీ అయితే మరింత ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం.

ప్రసవం సమయంలో ప్రసవం సులభం చేయడానికి వైజినా మరియు ఆనస్ మద్య ఉన్న చర్మంను కట్ చేయడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో ఆ ప్రదేశంలో కుట్లు పడటం కూడా సహజమే. ఈ కుట్ల వల్ల కొత్తగా తల్లైన వారిలో కూర్చోవడానికి, నిలబడటానికి లేదా నడవటానికి కష్టం గా ఉంటుంది . అంతే కాకుండా, నవ్వినప్పుడు, తుమ్మినప్పుడు, లేదా దగ్గినప్పుడు ఆ ప్రదేశంలో నొప్పికి గురికావల్సి వస్తుంది.

ఇలా ప్రసవ సమయంలో చిన్నసిజర్ గాట్లు, కుట్లు పడినప్పుడు వైజల్(యోని) ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా యోని శుభ్రత లోపిస్తే, ప్రసవం తర్వాత వైజినల్ ఇన్ఫెక్షన్ ఎక్కవగా ఉంటుంది. వైజనల్ ఇన్ఫెక్షన్స్ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. వైజినల్ డిశ్చార్జ్, ముఖ్యంగా రక్తస్రావం వల్ల ఇన్ఫెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల ప్రసవం తర్వాత వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండవచ్చు మరియు సంతోషకరమైన జీవితంను గడపవచ్చు. ప్రసవం తర్వాత ఆరోగ్యకరమైన వైజినల్(యోని)కోసం తీసుకోవల్సిన ఎఫెక్టివ్ టిప్స్ ఈక్రింది విధంగా...

Top 7 Post delivery vaginal care tips

క్లీన్ గా మరియు డ్రైగా ఉంచుకోవాలి: ప్రసవం అయిన తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వల్ల తల్లి, బిడ్డకు సురక్షితం. తరచూ సానిటరీ ప్యాడ్స్ ను మార్చుతుండాలి . ఇలా చేయడం వల్ల ప్రసవం తర్వాత ఎదురయ్యే వైజినల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించవచ్చు . వాష్ రూమ్ కు వెళ్లిన ప్రతి సారి, వేడినీళ్ళతో శుభ్రం చేసుకోవడం వల్ల ఆ ప్రదేశంలో నొప్పి మరియు వాపు నివారించబడుతుంది.

Top 7 Post delivery vaginal care tips

ఉపయోగించిన ప్యాడ్స్ ను తిరిగి ఉపయోగించకూడదు: డెలివరీ తర్వాత కొద్ది రోజుల వరకూ రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది. కనీసం రెండు మూడు వారాలు ఉంటుంది. కాబట్టి, ప్రసవం తర్వాత సానిటరీ న్యాప్కిన్స్ ను రెగ్యులర్ గా ఉపయోగిస్తుండాలి . రెగ్యులర్ గా మార్చుకుంటుండం వల్ల వైజినల్ ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.

Top 7 Post delivery vaginal care tips

ఐస్ ప్యాక్: వైజినల్ ఏరియాలో నొప్పి మరియు వాపు ఉన్నట్లు మీకు అనిపిస్తుంటే, అందుకు మీరు ఐస్ లేదా ఐస్ ప్యాక్స్ ను ఉపయోగించవచ్చు . ఎఫెక్టెడ్ ఏరియాలో ఐస్ ప్యాక్ ను 15-20నిముషాల వరకూ ఉపయోగించుకోవచ్చు . ఐస్ ను నేరుగా ఉపయోగించేటప్పుడు ఐస్ ను ఒక మందపాటు వస్త్రంలో వేసి మర్దన చేసుకోవాలి.

Top 7 Post delivery vaginal care tips

ఆంటీసెప్టిక్ వాష్ : ప్రసవం తర్వాత కుట్లు పడిన ప్రదేశంలో యాంటీ సెప్టిక్ వాష్ చాలా అవసరం అని డాక్టర్లు కూడా సూచిస్తుంటారు. ఇది ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . యాంటీసెప్టిక్ లోషన్ నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేసి ఆ నీటితో వైజినా శుభ్రం చేసుకోవాలి. లేదా ఆ ప్రదేశంలో పోయాలి.

Top 7 Post delivery vaginal care tips

పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలు: ప్రసవం తర్వాత కుట్లు వద్ద ఎటువంటి నొప్పి, వాపు లేదని మీరు భావిస్తే, మీరు పెల్విక్ ఫ్లోర్ వ్యాయామాలను మీరు ప్రారంభించవచ్చు. ఇది వైజినాకు రక్తం ప్రసరణకు సహాయపడుతుంది మరియు ఇది చాలా త్వరగా గాయాలను నయం చేస్తుంది. ప్రసవం తర్వాత వైజినల్ ఇన్ఫెక్షన్ నివారించడానికి ఇది ఒక సులభ మార్గం.

Top 7 Post delivery vaginal care tips

వాషింగ్ టెక్నిక్స్: వాష్ రూమ్ ఉపయోగించుకొన్న తర్వతా శుభ్రం చేసుకొనే విధానం కరెక్ట్ గా ఉన్నట్లైతే ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు. ఎప్పుడూ ముందు నుండి వెనకకు(యురెత్ర నుండి ఆనస్)వరకు శుభ్రం చేసుకోవాలి. ప్రసవం తర్వాత ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన చిట్కా.

Top 7 Post delivery vaginal care tips

మెడికల్ అసిస్టెన్స్ : మీరు పొట్ట ఉదరంలో నొప్పి, వాపు, లేదా యోని నుండి వాసనతో కూడిన డిశ్చార్జ్ అవుతుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ ను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇవి ఇన్ఫెక్షన్ ద్వారానే వస్తాయి కాబట్టి, త్వరగా డయాగ్నెసిస్ చేయించుకోవడం వల్ల చికిత్సకు సహాయపడుతుంది.

English summary

Top 7 Post delivery vaginal care tips


 Vaginal care is one of the important things to do post delivery, especially if it was a vaginal delivery. Your perineum, the skin between the vagina and the anus, would be cut by your doctor or might get torn during the birth. Both cases end up in stitches that will make it difficult for you to sit, stand or walk. Apart from this, you may experience pain when you laugh, sneeze or cough.
Story first published:Tuesday, February 3, 2015, 16:08 [IST]
Desktop Bottom Promotion