For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలివరీ తర్వాత ప్రతి తల్లీ డైట్ లో చేర్చుకోవాల్సిన హెల్తీ ఫుడ్స్..!

By Swathi
|

పాలు ఇచ్చే తల్లులు ఎనర్జీ ఎక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా డెలివరీ అయిన వెంటనే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. డెలివరీ తర్వాత శరీరంలో, హార్మోన్స్ లో చాలా మార్పులు కనిపిస్తాయి. అలాగే పాల ఉత్పత్తిని పెంచాలి. కాబట్టి క్యాలరీలు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారానే క్యాలరీలు పెరుగుతాయి.

డెలివరి తర్వాత తినడకూడని కొన్ని ఆహారాలు డెలివరి తర్వాత తినడకూడని కొన్ని ఆహారాలు

బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో ఏది తీసుకున్నా చాలా హెల్తీది అయ్యి ఉండేలా జాగ్రత్తపడాలి. బేబీ కోసమే కాకుండా.. మీకు ఆరోగ్యకరమైనదై ఉండాలి. మంచి ఆహారం తినడం వల్ల.. ప్రెగ్నెన్సీ వెయిట్ కూడా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. డెలివరీ తర్వాత ప్రతి తల్లీ డైట్ లో చేర్చుకోవాల్సిన హెల్తీ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సిట్రస్ ఫుడ్స్

సిట్రస్ ఫుడ్స్

డెలివరీ తర్వాత తల్లులకు విటమిన్ సి ఎక్కువగా కావాలి. ఎందుకంటే.. ఆహారాల తర్వాత విటమిన్ సి ఐరన్ ని గ్రహిస్తుంది. నిమ్మరసం, ఆరంజ్, బత్తాయి వంటివి డైట్ లో చేర్చుకోవడం మంచిది.

చిక్కుళ్లు లేదా బఠాణీలు

చిక్కుళ్లు లేదా బఠాణీలు

మీరు వెజిటేరియన్ డైట్ ఫాలో అవుతున్నారంటే.. చిక్కుళ్లు చేర్చుకోవడం మంచిది. ఫైబర్, ప్రొటీన్స్ ఎక్కువగా పొందడానికి ఇవి చక్కటి ఆప్షన్. ఫైబర్ ఎక్కువగా అందడం వల్ల.. డెజెస్టివ్ ట్రాక్ హెల్తీగా ఉంటుంది.

నట్స్

నట్స్

నట్స్ ని డైట్ లో చేర్చుకోవడం ఎప్పుడూ హెల్తీనే. ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు.. డెలివరీ తర్వాత కూడా.. నట్స్ కంపల్సరీ చేర్చుకోవాలి. ఎనర్జీ అందించడానికి, పోషకాలు పొందడానికి గుప్పెడు నట్స్ తినడం మంచిది. బాదాం, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ని డైట్ లో చేర్చుకుంటే మంచిది. అయితే సాల్ట్ తో కూడిన జీడిపప్పు, పిస్తా తినకూడదు.

ప్రొటీన్ రిచ్ ఫుడ్స్

ప్రొటీన్ రిచ్ ఫుడ్స్

ఫిష్, చికెన్, ఎగ్స్.. ని కంపల్సరీ డైట్ లో చేర్చుకోవాలి. బ్రెస్ట్ మిల్క్ పెంచడమే కాకుండా.. ఎక్స్ ట్రా క్యాలరీలు కరిగించడానికి కూడా సహాయపడతాయి. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల.. బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ కి సహాయపడతాయి.

లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్

లో ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్

బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో డైరీ ప్రొడక్ట్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి క్యాల్షియంను పెంచుతాయి. మజ్జిగ, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల హైడ్రేటెడ్ గా ఉంటారు. అంతేకాదు.. ఇవి అలసట తగ్గించి, ఎక్స్ ట్రా ఫ్యాట్ త్వరగా కరిగించడానికి సహాయపడతాయి.

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ లో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల.. యాంటీ ఆక్సిడెంట్స్ కావాల్సిన పరిమాణంలో పొందవచ్చు. ఒకవేళ బ్లూబెర్రీస్ తీసుకోవడం కష్టమనిపిస్తే.. ఉసిరి, స్ట్రాబెర్రీస్, ఆరంజ్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు.

గ్రీన్ వెజిటబుల్స్

గ్రీన్ వెజిటబుల్స్

గ్రీన్ వెజిటబుల్స్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పాలకూర, బీన్స్, మెంతి ఆకు వంటి రకరకాల ఆకు కూరలు, కూరగాయలను డైట్ లో చేర్చుకోవడం వల్ల డెలివరీ తర్వాత కూడా హెల్తీగా, యాక్టివ్ గా ఉంటారు.

నువ్వులు

నువ్వులు

తెల్ల, నల్ల నువ్వులు రెండింటిలోనూ క్యాల్షియం, ఐరన్, కాపర్,మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు శరీరానికి కావాల్సిన మినరల్స్ అందుతాయి. అలాగే బోవెల్ మూమెంట్స్ సరిగా ఉండటానికి సహాయపడతాయి.

English summary

Foods new moms should eat after delivery

Foods new moms should eat after delivery. When breastfeeding, you need to watch what you eat and eat healthy. Not just for the baby, but for yourself too.
Story first published: Thursday, June 9, 2016, 10:59 [IST]
Desktop Bottom Promotion