For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెలివరీ తర్వాత సాగిన చర్మాన్ని ఎలా నివారించాలి ?

బేబీ పుట్టిన తర్వాత మీ జీవితం నార్మల్ అవుతుంది. కానీ.. మీ చర్మం సాగుతోందని గమనించారా ? బెల్లీ చుట్టూ చర్మం సాగినట్టు గుర్తించారా ? చివరి తొమ్మిది నెలల్లో మీ బెల్లీ మీ చర్మం చాలా సాగుతుంది.

By Swathi
|

జీవితంలో తల్లి కావడం కంటే.. మరో గొప్ప ఫీలింగ్ ఉండదు. తల్లికావడం అనేది పెయిన్, గెయిన్ తో కూడినది. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, కష్టాలు, ఇబ్బందులు పడితేనే పొందగలిగేది.

బేబీ పుట్టిన తర్వాత మీ జీవితం నార్మల్ అవుతుంది. కానీ.. మీ చర్మం సాగుతోందని గమనించారా ? బెల్లీ చుట్టూ చర్మం సాగినట్టు గుర్తించారా ? చివరి తొమ్మిది నెలల్లో మీ బెల్లీ మీ చర్మం చాలా సాగుతుంది. బేబీ పుట్టిన తర్వాత అది సన్నగా, సాధారణ స్థితికి వస్తుంది.

saggy skin

సాగిన చర్మం ఎలాస్టిసిటీని కోల్పోతుంది. దీనివల్ల మహిళలు సాధారణ వయసు కంటే.. పెద్దగా కనిపిస్తారు. ఇదంతా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. తొమ్మిది నెలల ప్రెగ్నన్సీలో వచ్చే ఈ హార్మోనల్ చేంజెస్ యే దీనికి కారణం.

ఒకవేళ బేబీ పుట్టిన తర్వాత మీ చర్మం సాగుతోందని మీరు భావిస్తే.. కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే.. మీ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఎక్కువగా నీళ్లు తాగడం

ఎక్కువగా నీళ్లు తాగడం

మీ శరీరానికి, చర్మానికి నీళ్లు చాలా ముఖ్యం. సాగిన చర్మాన్ని నివారించడానికి నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపి.. చర్మం టైట్ గా మారడానికి సహాయపడుతుంది.

ఎక్కువ ప్రొటీన్స్

ఎక్కువ ప్రొటీన్స్

ఎక్కువ ప్రొటీన్స్ తీసుకోవడం కండరాలకు మంచిది. దీనివల్ల చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. ప్రొటీన్స్ లో కొల్లాజెన్ ఉంటుంది. అది చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది.

ఎక్స్ ఫోలియేషన్

ఎక్స్ ఫోలియేషన్

చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా అవసరం. డెలివరీ తర్వాత బెల్లీ, బ్రెస్ట్ స్కిన్ సాగుతుంది. ఎక్స్ ఫోలియేషన్ ద్వారా దీన్ని నివారించవచ్చు. స్క్రబ్ చేయడం వల్ల.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడి.. చర్మం సాగకుండా అడ్డుకుంటుంది.

ఎక్సర్ సైజ్

ఎక్సర్ సైజ్

నిర్జీవమైన, సాగిన చర్మాన్ని వ్యాయామంతో నివారించవచ్చు. యోగా, వాకింగ్ వంటి వ్యాయామాలతో గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. 30 నిమిషాల యోగా లేదా బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ లు చేస్తే.. చర్మం బిగుతుగా మారుతుంది.

బ్రెస్ట్ ఫీడింగ్

బ్రెస్ట్ ఫీడింగ్

చాలామంది మహిళలలు సాగింగ్ స్కిన్ పొందడానికి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడమే. కానీ.. బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల చర్మం సాగకుండా, నిర్జీవంగా మారకుండా ఉంటుంది.

మసాజ్

మసాజ్

విటమిన్ ఈ, సి, కే ఉండే బాడీ క్రీమ్ ఉపయోగించి.. సాగిన చర్మాన్ని నివారించవచ్చు. ఏదో ఒక క్రీమ్ తీసుకుని.. బెల్లీపై మసాజ్ చేస్తే.. సాగిన చర్మాన్ని నివారించవచ్చు.

English summary

How To Treat Sagging Skin After Delivery

How To Treat Sagging Skin After Delivery. Sagging skin after delivery is what most women look to get rid of, here are ways that can help you do it easily, take a look.
Story first published: Friday, November 4, 2016, 16:18 [IST]
Desktop Bottom Promotion