For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీకి అసౌకర్యం కలిగించే 7 సాధారణ సమస్యలు... నివారణ

|

గర్భాధారణ అనేది తల్లిదండ్రులకు ఇద్దరికీ ఒక అద్భుతమైన అనుభూతి. ముఖ్యంగా గర్భిణీకి. స్త్రీ గర్భం ధరిస్తే చాలా ఆనందం చెంది తన భావోద్వేగాలు చెప్పలేనంతగా ఉంటాయి. స్త్రీ గర్భం దాల్చడంతో శారీరకంగా చాలా మార్పులు సంతరించుకొంటాయి. ఫిజికల్ గా మార్పు చెందే ఈ మార్పులు చాలా సాధారణంగానే ఉంటాయి. గర్భిణీగా ఉన్నప్పుడు శరీరంలో ఎటువంటి మార్పులు ఏర్పడుతాయి అందరికీ తెలిసిన విషయమే. పొట్టలో బేబీ పెరిగే కొద్దిగా పొట్ట ముందుకు పెరుగుతూ ఉంటుంది. కొన్ని కారణాలుగా ఎమోషనల్ కు గురిఅవుతుంటారు. ఉదయం పూటా ఎక్కువ అలసట చెంది వేవిళ్ళు చేసుకోవడం ఇవన్నీ గర్భిణీలో సాధారణంగా కనిపించే మార్పులు.

అయితే ఇవన్నీ కామన్ గా వచ్చే మార్పులు. మరి గర్భిణీగా ఉన్నప్పుడు ఈ మార్పులతోనే కాకుండా మరొకొన్ని ఇతర మార్పులు గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టి అసౌంకర్యానికి గురిచేస్తాయి. అలాంటివి చాలా సాధారణమైటువంటి.. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ అనుభవం కలిగినటువంటి కొన్ని ప్రెగ్నెన్సీ ప్రాబ్లెమ్స్ ను మీరు తెలుసుకోవడానికి...కొన్ని

7 Embarrassing Pregnancy Problems

1. గ్యాస్ తో ఇబ్బంది పడటం: గర్భిణీగా ఉన్నప్పుడు ఎక్సెస్ గ్యాస్ తో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ లలో మార్పుల వల్ల జీర్ణవ్యవస్థ మందగించి తిన్న ఆహారం త్వరగా అరగనివ్వకుండా చేస్తుంది. దాంతో గర్భిణీ స్త్రీ చాలా ఇబ్బందికరంగా ఫీలవ్వడమే కాకుండా చాలా సార్లు కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఈ సమస్యను నిర్మూలించడానికి కొన్ని ఆహార నియమాలు పాటించాలి మరియు రెగ్యులర్ గా వ్యాయమం చేస్తే ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దాంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లెం నుండి బయట పడవచ్చు. మంచి ఆహారం తరచూ తీసుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉదా..కార్బొనేటెడ్ డ్రిక్స్, బీన్స్, కాలీఫ్లవర్, డ్రైఫ్రూట్స్, డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

2. అసంకల్పిత మూత్రవిసర్జన: ప్రెగ్నెసీ సమస్యల్లో ఇది కూడా ఒకటి. తరచూ మూత్ర విసర్జనకు పోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి గట్టిగా నవ్వినప్పుడు కానీ లేదా దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ యూరిన్ లీక్ అయ్యి గర్భిణీ అసౌకర్యానికి గురిచేస్తుంది. యూరినరీ లీకేజ్ ప్రాబ్లెం కొద్దిగా ఉంటే పర్వాలేదు ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు తగ్గ కేర్ తీసుకోవాలి. లోపల ధరించే ప్యాటీలు మందగా ఉన్న కాటన్ తో తయారు చేసినవైత సౌకర్యంగాను సురక్షితంగాను ఉంటాయి.

3. దుర్వాసన కలిగిఉండటం లేదా ఫీల్ అవ్వడం:గర్భిణీగా ఉన్నప్పుడు వాసన పీల్చడం చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడ కొన్ని వాసనలు చూడగానే ఇష్టం లేక చాలా ఇబ్బందిగా ఫీలవ్వల్సి ఉంటుంది. మరికొంత మందికి బాడీ ఫెర్ఫ్యూమ్స్ అస్సలు ఇష్టం ఉండదు. మరికొందరిక పౌల్టీ ఫామ్ ఫుడ్స్, సీ ఫుడ్స్ అస్సలు ఇష్టపడరు. ఒక్కొ సందర్భంలో యోని స్రావాల నుండి కూడా దుర్వాసన పట్టని వారు డాక్టర్ కు చూపించి యాంటీ ఫంగల్ మెడిసిన్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

4. హెయిర్ గ్రోత్: గర్భిణీగా ఉన్నప్పుడు అవాంచిత రోవాలు ఇబ్బంది పెడుతాయి. కొన్ని హార్మోనులలోని మార్పుల వల్ల అవాంచిత ప్రదేశాలు ముఖం, బ్రెస్ట్, ఉదరం ముందు బాగం వెనక భాగాల్లో కూడా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అయితే డాక్టర్ లు లేజర్ ట్రీట్ మెంట్ తో గర్భాధారణ సమయం చర్మ ఇన్ఫెక్షన్ కు గురిఅవుతుందని చెబుతుంటారు. కాబట్టి అందుకు మంచి మార్గం వాక్సింగ్ లేదా ట్వీజింగ్ చేసుకోవచ్చు.

5. మెటిమలు మచ్చలు: గర్భాధరణ జరిగిన మూడవ నెలలో కొన్ని అదనపు హార్మోన్ల కారణంగా బ్లాక్ హెడ్స్, మొటిమలుచ చర్మంలో ఇన్ఫెక్షన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.అందుకు డాక్టర్ సలహా మేరకు మొటిమలను మెడికేటెడ్ ఫేష్ వాష్ లను ఉపయోగించి దూరం చేసుకోవచ్చు.

6. హెమరాయిడ్స్: గర్భిణీ స్త్రీలు హెమరాయిడ్స తో ఇబ్బంది పడాల్సి వస్తుంది. హెమరాయిడ్స్ ను సరైన ఆహారం తీసుకోవడం వల్ల తగ్గించవచ్చు. ఆహారంలో ముఖ్యంగా ఫైబర్ కంటెంటె ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

7. సంబంధభాందవ్యాల సమస్యలు: గర్భం దాల్చిన స్త్రీలలో శారీరకంగా చాలా మార్పులు చోటు చేసుకుంటుంది. బరువు పెరుగుతుంది. దాంతో కొన్ని సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు మీ జీవిత భాగస్వామికి తెలిజేసి. మీరు సౌకర్యంగా ఉన్నప్పుడు సన్నిహితంగా ఉండండి.

ఇవన్నీ గర్భం దాల్చిన ప్రతి స్త్రీ ఏదో ఒక సందర్భంలో అనుభం కలిగి ఉంటుంది. కాబట్టి జీవన శైలి మార్చుకోవడం.. ఆహారపు అవాట్ల మార్పులతో వీటిని నుండి బయటపడవచ్చు...

English summary

7 Embarrassing Pregnancy Problems | గర్భిణీకి అసౌకర్యం కలిగించే సాధారణ సమస్యలు...

Pregnancy is an incredible journey for both the parents, especially for a pregnant mother. Pregnancy brings joy, hope and boosts our emotions. During pregnancy a woman undergoes various changes starting from physical, physiological to physiological and these changes are entirely normal. We are all aware of common pregnancy symptoms like baby bump, feeling emotional, getting exhausted and morning sickness.
Desktop Bottom Promotion