గర్భవతికి యాంటీబయోటిక్స్ సురక్షితమేనా?

Antibiotics Safe During Pregnancy Aid0181
గర్భవతికి యాంటీ బయోటిక్స్ మందులు సురక్షితమా? కాదా ? అనేది ఆమె శరీరాన్ని బట్టి, ప్రెగ్నెన్సీ సమయాన్ని బట్టి వుంటుంది. కొన్ని యాంటీబయోటిక్ లు గర్భవతి దశలో ఎపుడైనా వాడవచ్చు. కొన్ని బేబీకి హాని కలిగించేవిగాను మరి కొన్ని గర్భవతికి అనారోగ్యం కలిగించేవిగాను వుంటాయి.

గర్భవతి పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతూ వుంటే, బేబీఎదుగుదలకు హాని కలిగించినప్పటికి కొన్నియాంటీ బయోటెక్ మందులు వాడాల్సిందే. వాడకుంటే, ఆమె అనారోగ్యమే కాక, బిడ్డకు కూడా అనారోగ్యం కలిగే ప్రమాదముంది. అన్ని మందులవలెనే యాంటీ బయోటిక్స్ మందులకు కూడా వాటి డోసేజి, ఉపయోగించే విధానం, గర్భవతి దశ మొదలైనవి కూడా పరిశీలించాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో ఇన్ఫెక్షన్ తగ్గించటానికి ఏదైనా మందు వాడాల్సి వుంటే మీ వైద్యులు సూచించిన మందును ఇతర వైద్య నిపుణుల సంప్రదింపులతో సరైన నిర్ణయం తీసుకోండి. అయితే, గర్భవతిగా వున్నపుడు తీసుకోవలసిన విటమిన్ల వంటివి తప్పక తీసుకోండి.
Posted by:
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .