గర్భం త్వరగా రావాలంటే?

Posted By:
Subscribe to Boldsky

Foods For Fast Pregnancy!
సరైన ఆహారం శారీరకంగా ఫిట్ గాను, ఆరోగ్యంగాను వుంచుతుంది. అదే రకంగా మీరు ప్రెగ్నెంట్ అవ్వాలని భావిస్తూంటే అతి త్వరగా గర్భవతి అయ్యేటందుకుగాను కొన్ని ఆహారాలు సహకరిస్తాయి. అవేమిటో దిగువ ఇస్తున్నాం పరిశీలించండి.

- సహజమైన తాజా పండ్లు, కూరలు మీ ఆహారంలో చేర్చండి. కెమికల్స్ వుండే ప్యాకేజ్డ్ ఆహారాలు మానండి.
- ఫైబర్ అధికంగా వుండే ఆహారం సుఖ విరోచనం అయ్యేలా చేసి శరీరంలోని మలినాలను విసర్జిస్తుంది. కనుక గింజ ధానన్యాలు, బ్రౌన్ రైస్, అవిసె గింజలు, సంపూర్ణ గోధుమ బ్రెడ్, బీన్స్, ఓట్స్, పీ నట్స్ వంటివి ఆహారంలో చేర్చండి.
- బచ్చలికూర వంటి పచ్చని ఆకు కూరలు మహిళలకు చాలా మేలు చేస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటివి జననేంద్రియాలను ఆరోగ్యంగా వుంచుతాయి.
- ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే సోయా ఉత్పత్తులు, బీన్స్, గుడ్డు సొన, బంగాళ దుంప, గోధుమ పిండి, కేబేజి బీట్ రూట్, అరటిపండు, బ్రక్కోలి, మొలకెత్తిన విత్తనాల వంటివి తింటే మంచి ఫలితం వుంటుంది.
- కేరట్లు, బఠాణీలు, చిలకడదుంపలు, ద్రాక్ష వంటివి మహిళలకు పిరీయడ్స్ సక్రమంగా వచ్చేలా చేస్తాయి.
- మిరియాలు, జామపండు, బ్రక్కోలి, కాలీఫ్లవర్, ఆరెంజ్, స్ట్రాబెర్రీలు వంటివిటమిన్ సి అధికంగా వుండే ఆహారాలు త్వరగా గర్భవతిని చేస్తాయి.
- పాల ఉత్పత్తులు లో కాల్షియం వుండటమే కాదు ఫలదీకరణ కవసరమైన ఎఫ్ఎస్హెచ్ మరియు ఎల్ హెచ్ హార్మోన్లు వుంటాయి. చేపను కూడా మీ ఆహారంలో చేర్చండి.
- బాదంపప్పు, ఇతర డ్రై ఫ్రూట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వునిస్తాయి.

మరి గర్భం ధరించారనేందుకు మొదటగా ఎలా తెలుస్తుంది?

గర్భవతిగా వున్నపుడు నోరు వాసన వస్తుంది. ఖంగారు పడనవసరం లేదు. సాధారణంగా గర్భవతులందరకు ఈ సమస్య వుంటుంది. ఇది త్వరలోనే వికారంగా మారుతుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హార్మోన్లు విస్తృతంగా మార్పులు చెందుతాయి. ప్రత్యేకించి ప్రెగ్నెన్సీ కలిగించే ఈస్ట్రోజన్ ముక్కు రంధ్రాలలోవున్న ఫెరోమోన్ రీసెప్టర్స్ ను తెరుస్తుంది. దానితో అవి ఎంతో సున్నితమై స్పందించి బ్రెయిన్ కు సిగ్నల్స్ పంపుతుంది. బ్రెయిన్ కు సిగ్నల్ అందగానే కడుపులో కొన్ని రసాలు తయారై ఇక మీకు నోరు వికారంగా అవుతుంది.

వికారం తర్వాత వచ్చేది మార్నింగ్ సిక్ నెస్. ఘాటైన వాసన వచ్చే వెల్లుల్లి, ఉల్లిపాయ మొదలైనవి తినకుండా వుండటం మంచిది. దీనికి గాను గర్భవతి మంచి వాసనలు మాత్రమే వచ్చే ప్రదేశాలలో వుండాలి. మీకు నచ్చిన వాసనలేవైనా వుంటే, వాటి వాసన చూసి ఆనందించండి. మింట్, నిమ్మ, అల్లం లేదా ఇతర మూలికల వాసనలు ఆహ్లాదాన్నిస్తాయి. క్లీనింగ్ ఉత్పత్తులు, టాయ్ లెట్ ఉత్పత్తులవంటివి వారికి నచ్చిన వాసనలవి వాడకంలో వుంచాలి.

మార్నింగ్ సిక్ నెస్ వున్నపుడు ఆహారం తయారు చేయవద్దు. పదార్ధాల వాసనలకు మీరు సిక్ అయిపోయే అవకాశం వుంది. రెస్టరెంట్లు, కిరాణా షాపులు, మాంసం దుకాణాలు, కూరల దుకాణాలు, మొదలైనవి వీలైనంతవరకు వెధ్ళరాదు. ఇంటిలో మంచి గాలి వెలుతురు ప్రసరించేలా చూడండి. వంట వాసనలు లేకుండా జాగ్రత్త పడండి. పొగత్రాగేవారిపక్కన వుండరాదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, గర్భిణీ మహిళ ఉదయ వికారం, వాంతులు వంటివి రాకుండా జాగ్రత్తపడవచ్చు.

English summary

Foods For Fast Pregnancy! | ఏం తింటే గర్భం వస్తుంది?!

Avoiding places like restaurants, grocery shops, meat shops, vegetable shops etc might be a good idea. Be careful with the food: There are a few other easy steps that you could follow. Avoid cooking if you can during the time you suffer from morning sickness or avoid cooking food stuffs that make you unwell.
Story first published: Saturday, July 21, 2012, 14:45 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter