సాధారణంగా ఎవరైనా గర్భం దాల్చారని తెలిసిన వెంటనే, ఆమెకు చాలా సలహాలు అందుతుంటాయిప. అమ్మలు, అమ్మలు, ఇరుగు పొరుగువారు, డాక్టర్స్ ఇలా ఒక్కరేంటీ అందరి దగ్గర నుండి కావల్సినన్ని సలహాలు ఇస్తుంటారు. అందులో సగానికి సగం నిజాలు, వారి వారి అనుభవాలను ఇలా ఇతర గర్భీణీ స్త్రీలకు సలహాల రూపంలో ఇస్తుంటారు. అంతే కాకుండా మొదటి సారి గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి సందేహాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
గర్భం దాల్చిన వెంటనే ఆ స్త్రీ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. పుట్టబోయే బిడ్డ ఎలాంటి డెఫిషియన్సీకి లోనుకాకుండా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో వారు నిర్దేశించిన సమయాలలో తనిఖీలు చేయించుకుంటూ ఉండాలి. తల్లి గర్భం సురక్షితమైనదే అయినప్పటికీ కడుపులో బిడ్డ ఉన్నప్పుడు అటువంటి స్త్రీలు చేయకూడని కొన్ని పనుల గురించి మన దేశంలో చాలామందికి పూర్తి అవగాహన లేదనే చెప్పాలి. కాబట్టి మేము అందిస్తున్న ఈ చిన్న చిట్కాలన్నీ గర్భిణీ స్త్రీకి సంబంధించినవే.
గర్భిణీ స్త్రీలలో అనేక హార్మోను మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ధైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోండి ... థైరాయిడ్ పనిలో ఎచ్చు తగ్గులు వలన చెమటలు పట్టె ఆస్కారము ఉన్నది. గర్భిణీగా ఉన్నప్పుడు థైరాయిడ్ సమస్యవల్ల గర్భస్రావం జరగవచ్చు. లేదా కడుపులో శిశువు పెరుగుదలను అడ్డుకొంటుంది. కాబట్టి మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఒక సారి థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.







































