For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణ మీద తప్పుడు అపోహలు-వాస్తవికతలు

By Super
|

ఇది చేయండి. అది చేయకండి. గర్భధారణకు సంబంధించి ఇచ్చే అన్ని సలహాలలో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో - లేదా ఎవరి మాట వినాలో తెల్సుకోవడం కష్టం. కాని ప్రతి ఒక్కరిలో గర్భధారణ ఒకే రకంగా ఉండదనేది గుర్తుపెట్టుకోండి.

అందువల్ల అన్నింటికీ మించి మీ డాక్టర్ చెప్పే విషయాలను అనుసరించండి. ఇక్కడ కొత్తగా ఇంటికి అతిధి రాబోతున్నప్పుడు మీరు తరచుగా వినే కొన్ని విషయాలు ఉన్నాయి.

మూఢనమ్మక౦ 1 :

మూఢనమ్మక౦ 1 :

గర్భధారణకు సంబంధించిన సాధారణ మూఢనమ్మకాలలో ఇది అతి సాధారణమైంది. ఒక మహిళ గర్భం ఎత్తుగా ఉంటే పాప, తక్కువగా ఉంటే బాబు పుట్టే సంభావన ఉంటుందనేది ఒక నమ్మకం.

వాస్తవం: కాని ఒక మహిళ కండరాల పరిమాణ౦, ఆకారం, పిండం స్థితి, ఆకృతి, పొట్ట చుట్టూ చేరిన కొవ్వు పరిమాణం, ఇవన్నీ గర్భధారణలో ఉన్న పొట్ట పరిమాణ౦, ఆకారానికి సంబంధించి తగిన పాత్రను పోషిస్తాయి.

మూఢనమ్మకం 2 :

మూఢనమ్మకం 2 :

మరింతగా ఉప్పగా ఆహారం తీసుకోవడం అంటే మీకు బాబు కల్గుతాడని అర్ధం. అదే తీపి తినాలనిపిస్తే పాప పుట్టడాన్ని సూచిస్తుంది.

వాస్తవం: బిడ్డ లింగాన్ని నిర్ధారించడం అనేది మనం తినే ఆహారంపై ఆధారపడిలేదని పరిశోధనలు తెల్పుతున్నాయి.

మూఢనమ్మక౦ 3:

మూఢనమ్మక౦ 3:

బిడ్డ లింగాన్ని అంచనా వేయడానికి ఒక తీగలో రింగును ఎక్కించి గర్భం చుట్టూ పట్టుకోండి. అది వెనక్కి, ముందుకు కదిలితే మగ బిడ్డ, గుండ్రంగా తిరిగితే ఆడబిడ్డ అని అర్ధం.

వాస్తవం: దీనిలో ఎటువంటి నిజం లేనందువల్ల, కాసేపు నవ్వు కోవడానికి ఈ పని చేయవచ్చు.

మూఢనమ్మక౦ 4:

మూఢనమ్మక౦ 4:

గర్భధారణలో ఉన్నప్పుడు మీకు ఛాతిలో మంటగా ఉంటే, మీ బిడ్డ ఒత్తైన జుట్టుతో పుడుతుందని అర్ధం. ఛాతిలో మంట అనేది గర్భవతి మహిళలలో ఒక సాధారణ సమస్య. దీనికి మీ బిడ్డ జుట్టు పరిమాణంతో ఎటువంటి సంబంధం లేదు.

వాస్తవం: ఛాతిలో ఎంతో మంట ఉండే మహిళలు కూడా జుట్టు బొత్తిగా లేని బిడ్డలను స్వాగతించారు.

మూఢనమ్మక౦ 5:

మూఢనమ్మక౦ 5:

మీ అమ్మకు గర్భధారణ, ప్రసవం తెలికైతే మీకు కూడా అంతే.

వాస్తవం: మీ గర్భధారణ, ప్రసవం తేలికగా లేదా కష్టంగా ఉంటుందా అనే విషయాన్ని అంచనా వేయడంలో అనువంశిక కారణాలకు ఏ విధమైన సంబంధం లేదు. పైగా, బిడ్డ పరిమాణం, స్థితి, మీ ఆహారపు అలవాట్లు, జీవనశైలి దీనిని నిర్ధారిస్తాయి.

మూఢనమ్మక౦ 6:

మూఢనమ్మక౦ 6:

నిద్రపోవడం లేదా వెల్లకిలా పడుకోవడం మీ బిడ్డకు హాని కల్గిస్తుంది.

వాస్తవం: ఈ స్థితిలో మీరు పడుకొంటే మీ బిడ్డకు హాని కల్గదనుకొంటే, పక్కకు తిర్గి పడుకోవడం మీకు మంచిది. ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం వలన మీ గర్భాశయానికి, మాయకు రక్త సరఫరా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మూఢనమ్మక౦ 7:

మూఢనమ్మక౦ 7:

శృంగారంలో పాల్గొనడం బిడ్డకు హాని చేస్తుంది

వాస్తవం: మీ బిడ్డను సంరక్షించడానికి చర్మపు ఏడు పొరలు, అమ్నియోటిక్ సంచికి ఉన్న గర్భపు గోడ ఉన్నాయి. మీ గర్భాశయ ద్వారం, గర్భాశయంలోనికి ఏది రాకుండా అడ్డుపడటానికి వీలుగా సాగి, గట్టిపడి ఉంటుంది. ఇది అంటువ్యాధుల నుండి కాపాడటానికి మ్యూకస్ ను కూడా స్రవిస్తుంటుంది. శృంగారంలో పాల్గొనడం వలన మీ బిడ్డను తాకదు లేదా ఎటువంటి హాని జరగదు. శృంగారానికి దూరంగా ఉండండి అని మీ డాక్టర్ చెప్పకపోతే, ఎటువంటి భయం లేకుండా ముందుకు సాగవచ్చు.

మూఢనమ్మక౦ 8:

మూఢనమ్మక౦ 8:

మొదటి బిడ్డ ఎల్లప్పుడు ఆలస్యంగా పుడ్తుంది.

వాస్తవం: ఇది చాల వరకు వాస్తవమే ఎందుకంటే దాదాపు 60 శాతం మంది బిడ్డలు గడవు తేది తర్వాత పుడతారు. 5 శాతం మంది గడువు తేదీన, 35 శాతం గడువు తేది తర్వాత పుడతారు. నిజానికి మీ ఋతుచక్రం బిడ్డ పుట్టే సమయాన్ని నిర్ధారిస్తుంది. అది చిన్నదైతే, మీకు త్వరగా ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువ. మీ చక్రం దీర్ఘంగా ఉన్నట్లైతే, మీ బిడ్డ ఆలస్యంగా పుడ్తుంది. కాని మీ చక్రం 28 రోజులు ఉంటే, గడువు తేదీకే మీ బిడ్డ జన్మించవచ్చు.

మూఢనమ్మక౦ 9:

మూఢనమ్మక౦ 9:

చివరి మూడు నెలల కాలంలో మీరు విమానప్రయాణం చేయరాదు.

వాస్తవం: తిరిగి తప్పు. మీరు ఎప్పుడనుకొంటే అప్పుడు విమానంలో వెళ్ళవచ్చు. కొన్ని విమానసంస్థలు మీరు చివరి మూడు నెలలలో ఉంటే మిమ్మల్ని విమానంలో ఎక్కనివ్వరు. అయితే ఒక వేళ మీకు పురిటినొప్పులు మొదలై, విమానాన్ని బలవంతంగా దింపవలసి వస్తుందని లేదా సీట్లు పాడువుతాయన్న భయం.

మూఢనమ్మక౦ 10:

మూఢనమ్మక౦ 10:

గర్భవతిగా ఉన్నప్పుడు వేడినీటి స్నానం చేయరాదు.

వాస్తవం: నిజంగా వాస్తవం. మీ శరీర ఉష్ణోగ్రతను 102 డిగ్రీల కంటే ఎక్కువగా పెంచే ఆవిరిస్నానాలు, వేడినీటి టబ్బులలో లేదా ఎటువంటి ఇతర విషయాల నుండి దూరంగా ఉండండి.

English summary

10 Common pregnancy myths busted

Do this. Don't do that. With all the pregnancy advice out there, it's hard to know what to believe -- or whom to believe.
Desktop Bottom Promotion