For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వాడకూడని 10 డ్రగ్స్

By Super
|

గర్భిణీ స్త్రీలు వేసుకొనే ప్రతి మందును సరిగ్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే వాటి ప్రభావం తల్లి మీదే కాక శిశువు మీద కూడా ఉంటుంది. మాగ్ నివేదక ప్రకారం గర్భధారణ సమయంలో వాడకూడని 10 డ్రగ్స్ గురించి తెలుసుకుందాము.

1. నొప్పి నివారిణీ మందులు:

ఉపశమన మందులు లేదా ఇబూప్రోఫెన్ మరియు ఆస్పిరిన్ వంటి నొప్పిని హరించే మందులను వాడటం వల్ల పిండం అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది. అందువల్ల తలనొప్పి కలిగి ఉంటే సహజ వైద్యం ఉపయోగించడడం ఉత్తమం.

2. యాంటి ఫంగల్ మందులు:

శిలీంధ్రాలు గర్భిణీ స్త్రీలు అనుభవిస్తున్న సాధారణ సమస్యలలో ఒకటి. కానీ నిర్లక్ష్యంగా డాక్టర్ అనుమతి లేకుండా యాంటి ఫంగల్ మందులు వాడకూడదు.

3. మొటిమల మందులు:

గర్భధారణ సమయంలో దేహంలో కొన్ని హార్మోనల్ మార్పుల వల్ల మోటిమలు రావచ్చు. కానీ మోటిమలను వదిలించుకోవటం కోసం మందులను తీసుకోకూడదు. మోటిమలు వాటికీ అవ్వే తగ్గిపోతాయి.

Drugs

4. జ్వరం మందులు:

సాధారణంగా గర్భం సమయంలో జ్వరానికి వాడే పారాసెటమాల్ కలిగి ఉన్నమందులను నిషేదించారు. పారాసెటమాల్ ను అధిక మోతాదులో తీసుకొంటే గర్భం మొదటి త్రైమాసికంలో పిండం యొక్క అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది.

5. యాంటి డిప్రేసన్ట్స్ మందులు :

గర్భధారణ సమయంలో యాంటిడిప్రేసన్ట్స్ వాడుట వల్ల పుట్టుకలో వచ్చే లోపాల ప్రమాదాన్ని మరింత పెంచుతాయి. ఒత్తిడి ఉపశమనానికి మంచి యోగ లేదా ధ్యానం చేయండి.

6. యాంటి అలెర్జీ మందులు :

యాంటీ ఫంగల్, యాంటీ అలెర్జీ మందులు ఎక్కువగా వాడకూడదు. ఒక సహజ మార్గంలో అలెర్జీ సమస్యలు అధిగమించాలి. ఉదాహరణకు దుమ్ము నుండి దూరంగా ఉండి జాగ్రత్తగా హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి.

7. యాంటీబయాటిక్స్:

దాదాపు అన్ని యాంటీబయాటిక్స్ గర్భిణి స్త్రీలు వాడటానికి అనుమతి లేదు. కానీ ఇతర మార్గం ఉంటే చికిత్సకు మరొక మార్గం కనుగొనేందుకు వైద్యుడుని సంప్రదించండి.

8. యాంటి మోషన్ అనారోగ్య మందులు:

గర్భిణి స్త్రీలు యాంటి మోషన్ అనారోగ్య మందులు వాడటానికి అనుమతి లేదు. దాని చెడు ప్రభావం శిశువు మీద పడుతుంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు అనుభవంతో ఇతర మార్గాలను కనుగొనండి.

9. స్లీపింగ్ మాత్రలు:

గర్భిణి స్త్రీలు ఎట్టి పరిస్థితి లోను స్లీపింగ్ మాత్రలు వాడకూడదు. దీని ప్రభావం శిశువు మీద పడుతుంది. కానీ తప్పనిసరి పరిస్థితి లో వేసుకోవలసి వస్తే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి.

10. మూలికలు:

సహజ మొక్కలు మరియు నేచర్ నుండి వచ్చే ఔషధ మూలికలను గర్భిణి స్త్రీలు వాడకూడదు. ఉదాహరణకు కలబంద వేరా,జిన్సెంగ్ మరియు రోజ్మేరీ వంటి వాటిని వాడకూడదు. గర్భవతిగా ఉన్న సమయంలో ఈ విధంగా వాడకూడని మందులను వాడకూడదు.

English summary

10 Drugs that should be avoided during pregnancy

Everything that is consumed by pregnant women need to be considered properly. Like drugs, because it influence not only on the mother but also the baby. Consider the drugs that should be avoided during pregnancy, as reported by Mag for Women below.
Desktop Bottom Promotion