For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రుతుక్రమం ఆలస్యానికి గల 10 ముఖ్య కారణాలు?

By Super
|

సాధారణంగా మహిళలు కొన్ని విషయాల్లో చాలా భయాందోళనలు చెందుతుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా పురుషుల కంటే స్త్రీలలోనే అధిక సమస్యలు ఉంటాయి. స్త్రీల సమస్యల్లో ముఖ్యంగా రుతుక్రమం. కొంత మంది స్త్రీలలో రుతుచక్రం సక్రమంగా ప్రతి నెలా నడుస్తుంటుంది. కానీ, కొంత మంది స్త్రీలలో మాత్రం రుతుచక్రంలో తేడాలుంటాయి. అవి వారి శరీర తత్వం, లేదా వారి ఆరోగ్య స్థితిగతుల, లేదా, ఆహారం, ఒత్తిడి, వాతావరణం మీద కూడా ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా స్త్రీలలో బాధించే రుతుక్రమ సమస్యల్లో గర్భాధారణకు ప్రయత్నించే వారిలో రుతుక్రమంలో తేడాలొస్తే సాధారణంగా గ్రహిస్తారు. కానీ, కొంత మంది మహిళల్లో రుతుక్రమం టైం కు రాలేదంటే, చాలా ఆందోళన చెందుతుంటారు. ప్రెగ్నెన్సీకి మాత్రమే పీరియడ్స్ లో ఆలస్యం జరగుతుంది. అలాకాకుండా పెళ్ళికానీ వారిలో లేదా కొంత మంది పెళ్ళైన మహిళల్లో కూడా పీరియడ్స్ లేట్ గా అవ్వడానికి కొన్ని సాధారణ కారణాలున్నాయి. అవేంటో క్రింది విధంగా ఉన్నాయి, పరిశీలించండి.

ఒత్తిడి:

ఒత్తిడి:

ఒత్తిడి అనేది మనజీవితంలో చాలా విషయాల్లో ప్రభావం చూపుతుంది. పీరియడ్స్ తో సహా. కొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువ ఒత్తిడికి గురియైనప్పుడు మన శరీరంలోని హార్మోన్ లెవల్స్ (GnRH) తగ్గిపోతాయి. దాంతో సరైన సమయంకు ఓవెలేషన్ జరగదు. దాంతో సరైన టైంకు రుతుక్రమం రాదు. అందుకు డాక్టర ను సంప్రదించండం లేదా విశ్రాంతి తీసుకోవడం, తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తిరిగి రెగ్యులర్ షెడ్యూల్స్ పొందడానికి సహాయపడుతుంది. ఇలా జరగడానిక కొన్ని నెలలు లేదా ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు .

జబ్బు పడటం:

జబ్బు పడటం:

ఒక ఆకస్మిక, చిన్న అనారోగ్యపాలవ్వడం లేదా సుదీర్ఘ అనారోగ్యం మీ పీరియడ్స్ కు ఆలస్యం కలిగిస్తాయి. ఇది సాధారణంగా తాత్కాలికం. ఒక వేళ మీ పీరియడ్స్ ఆలస్యం అవ్వడానికి ఇదే కారణం అని భావిస్తే, మీ ఫ్యామీలి డాక్టర్ ను సంప్రధించి తిరిగి మీరు రెగ్యులర్ పీరియడ్ ఎప్పుడు పొందగలరో అడిగి తెలుసుకోండి.

షెడ్యూల్ లో మార్చండి

షెడ్యూల్ లో మార్చండి

మీ షెడ్యూల్స్ తరచూ మారుతుంటే , ఖచ్చితంగా మీ శరీరంలో మార్పలు జరుగుతాయి. ముఖ్యంగా మీరు క్రమం తప్పకుండా రాత్రి షిఫ్ట్లు పనివేళలు ఉన్నప్పుడు తర్వాత కొద్దిరోజులు క్రమంగా పగలు పనిచేయడం ఇలా మార్పలు చేసుకోవడం వల్ల మీ రెగ్యులర్ రుతుచక్రంలో మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి మీరు ఏదో ఒక సమయానికి మాత్రం అలవాటు పడాలి. పర్మనెంట్ గా పనివేళలు మార్చడం వల్ల మీ పిరియడ్స్ తిరిగి క్రమంగా వచ్చేస్తాయి.

మందులు మార్పిడి:

మందులు మార్పిడి:

బహుశా మీరు ఒక కొత్త మందులు ప్రయత్నిస్తున్నట్లైతే , అవి మీ పిరియడ్స్ ను ఆలస్యంగా లేదా పీరియడ్ రాకపోవడానికి కారణం అవుతుంది. ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి మీ డాక్టర్ తో సంప్రధించడం చాలా అవసరం. ఇది గర్భాధారణలో కొన్ని పద్ధతులు సర్వ సాధారణం. మీరు మందులు మార్చుకుంటే, అవి, మీ రుతుక్రమంలో ఎటువంటి సైడ్ ఎపెక్ట్స్ కలిగిస్తాయో అడిగి తెలుసుకోవడా మంచిది.

అధిక బరువు:

అధిక బరువు:

అధిక బరువు ఉండటం వల్ల హార్మోనుల సమస్యలు తలెత్తుతాయి. దాంతో మీరు రుతుక్రమంలో మార్పలు చోటుచేసుకుంటాయి. లేదా మీ రుతుక్రమాన్ని ఆపుచేస్తాయి. కొంత బరువును కోల్పోవడం వల్ల చాలా మంది మహిళలల్లో తిరిగి సాధారణ రుతుక్రమం రావడం జరుగుతుంది. మరియు సంతానోత్పత్తిని కూడా పొందగలుగుతారు.

బరువు తక్కువగా ఉండటం:

బరువు తక్కువగా ఉండటం:

మీరు తగినంత శరీరంలో తగినంత కొవ్వు లేకపోతే మీలో సాధారణ రుతుక్రమం ఉండదు, కొన్నిసార్లు మీలో పీరియడ్స్ పూర్తిగి ఆగిపోవడానికి కారణం అవుతుంది. దీన్నిరుతుక్రమ లేమి అంటారు. సాధారణంగా ఒక బరువు పెరుగుట వల మీరు తిరిగి మీ పీరియడ్స్ ను క్రమంగా పొందడానికి సహాయపడుతుంది. ఇటువంటి సమస్యలు ఎక్కువగా వర్క్ అవుట్స్ (వ్యాయామాలు చేసే వారిలో)లేదా ప్రొఫెషనల్ అథ్లెట్లు మహిళలల్లో ఈ సమస్యకు కారణం కావచ్చు.

తప్పుగా లెకించడం:

తప్పుగా లెకించడం:

ఋతు చక్రం ఒక మహిళ నుండి మరో మహిళకు మారుతుంటుంది.సాధారణంగా ప్రతి యొక్క మహిళలో సగటు ఋతు చక్రం 28 రోజులు ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో రుతుక్రమ రోజులను తప్పుగా లెకించడం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యంగా వచ్చిందని భావించి ఆందోళన చెందుతుంటారు. అయితే అది ఏమాత్రం నిజం కాదు. మీలో సరైన రుతుచక్రాలను కలిగి ఉండనట్లైతే, కానీ మీరు మీలో ఓవొలేషన్ ఎప్పుడని తెలుసుకోవాలి. అది మీరు పీరియడ్స్ పొందిన రెండు వారాలకు ఓవెలేషన్ జరుగుతుంది . దాంతో మీ పీరియడ్స్ ను లెకించుకోవడం సులభం అవుతుంది.

పెరి మోనోపాజ్ (పెరీ-రుతువిరతి):

పెరి మోనోపాజ్ (పెరీ-రుతువిరతి):

పెరీ-రుతువిరతి మీరు ఒక పునరుత్పత్తి వయసు నుండి ఒక కాని పునరుత్పత్తి వయస్సు బదిలీ అయ్యే కాలం. మీ పీరియడ్స్ చాలా తేలికైనవిగా లేదా ఎక్కువగా మరింత తరచుగా లేదా తక్కువ సార్లు ఉండవచ్చు. కానీ సాధారణం మాత్ర ఎప్పుడూ జరగదు. దాంతో మీరు గర్భవతి పొందుటకు అనుకూలించదు., కాబట్టి కొంత సమయం మీరు మరింత సమయం ఆరోగ్యంగా కొనసాగించడానికి బర్త్ కంట్రోల్ పిల్స్ ను వాడటం మంచిది.

మోనోపాజ్(రుతువిరతి):

మోనోపాజ్(రుతువిరతి):

మీరు మీ జీవితంలో ఒక స్టేజ్ కు(ఒక వయస్సుకు)చేరుకున్నాక మీలో ఓవొలేషన్ లేదా రుతుక్రమం జరగదు. రుతువిరతి ఒక సహజ జీవితం లేదా చాలా మంది హిస్టరెక్టమీ లేదా కీమోథెరఫీ రసాయన శస్త్రచికిత్సలు జరుపుకుంటారు.

గర్భము:

గర్భము:

చివరిగా! అవును మీ పీరియడ్స్ తప్పినట్లైతే, మీరు గర్భం పొందిఉండవచ్చు.! ఒక సాధారణ గర్భం పరీక్ష ద్వారా సాధారణంగా మీరు గర్భం పొందారు లేదా అని విషయాన్ని తెలుసుకోవడాని సహాయపడుతుంది. అందుకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేదా బ్లడ్ టెస్ట్ హార్మోనల్ హెచ్ సిజిని పరీక్షించుకోవచ్చు.

తదుపరి ఏమి చేయాలి?

తదుపరి ఏమి చేయాలి?

మీరు గర్భం పొందినట్లైతే మీ ఫ్యామిలీ డాక్టర్ కు సంప్రదించాలి. ఇది మీరు సరైన మార్గంలో గర్భం పూర్తి అవ్వడానికి సహాయపడుతుంది.

మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు నెగటివ్ అని వస్తే, మరో వారం వేచి చూడాలి. లేదా మరో మారు టేస్ట్ చేసి చూడాలి . ఒక వేళ రెండోసారి పరీక్షించినప్పుడు కూడా నెగటివ్ అని వస్తే, మరి మీకు పీరియడ్ ఆలస్యం ఎందుకైయిందో కనుక్కోవడానికి ఇది ఒక మంచి సమయం, వెంటనే డాక్టర్ ను సంప్రదించి ఫిసికల్ గా పరిక్షించుకోండి. ఒక్కోసారి వారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు లేదా మందులను ప్రిస్ర్కైబ్ చేస్తారు .

English summary

10 Reasons Your Period is Late

Nothing strikes fear into the heart of any woman like a missed period, unless she is trying to get pregnant. Am I pregnant? Pregnancy is the first thing that we think of when our period is delayed.
Desktop Bottom Promotion