For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం ధరించడానికి ఖచ్చితంగా పాటించాల్సిన 10 సులభ పద్దతులు..!

|

మీరు గర్భధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఒకదాని తర్వాత ఒకటి చాన్స్ మిస్స్ అవుతన్నట్లైతే మీరు నిరాశ చెందడం సహజం. చాలా మంది పెళ్ళైన కొద్ది రోజులకే చాలా ఫాస్ట్ గా గర్భం ధరిస్తారు. ఒకటి రెండు నెలల్లోనే గర్భం ధాల్చిడం జరుగుతుంది. అయితే ఒకటి రెండు సార్లు వరుసగా రుతు స్రావం జరిగినట్లేతే మీకు సైకలాజికల్ గా ఏదో సమస్య ఉన్నట్లు గమనించాలి. అందువల్లే మీరు తెలుసుకోవడానికి కొన్ని విషయాలను ఇక్కడ పొందుపరుస్తూ మీరు సులభంగా గర్భం ధరించడానికి అవసరమయ్యే చిట్కాలను మరియు సులభ పద్ధతులు కొన్ని ఉన్నాయి.

ఈ టూల్స్ మీరు త్వరగా గర్భ ధరించడానికి సహాయపడుతుంది. మరియు జీవన శైలిలో మార్పులను తీసుకొస్తుంది. ఉదాహరణకు: ఓవెలేషన్ స్ట్రిప్స్ మరియు ఓవొలేషన్ క్యాలెండరు అందుకు బాగా సహాయపడుతుంది. ఓవొలేషన్ స్ట్రిప్స్ గర్భధారణ పొందడానికి అండోత్సర్గం(అండం విడుదలయ్యే సమయాన్ని)అంటే మీరు గర్భధారణ పొందడానికి అనుకూలమైన సమయమని తెలుపుతుంది. మరియు జీవన శైలిలో కొన్ని మార్పుల వల్ల అంటే ఉదా: ధూమపానం వదిలివేయడం వల్ల కూడా గర్భధారణ వేగంగా జరగే అవకాశం ఎక్కువ.

అందువల్ల, కాంబినేషన్ ఆఫ్ టూల్స్, జీవనశైలిలో మార్ఫులు మరియు పాత తరహా వ్యూహాల(ఓల్డ్ ఫ్యాషన్డ్ ట్రిక్స్ )ను కలిపి ఫాలో అవ్వడం వల్ల మీరు త్వరగా గర్భం పొందుటకు సహాయపడుతుంది. మరి అందుకు కొన్ని విషయాలను మీకోసం..చూసి ఫాల్లో అవ్వండి..

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

బరువును కంట్రోల్లో ఉంచుకోవడం: మీరు గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బరువు తగ్గడం చాలా మేలు. అధిక బరువు ఉండటం వల్ల గర్భం ధరించే అవకాశాలు తక్కువ. అందుకు కొన్ని న్యూట్రీషియన్స్ ఫుడ్ తీసుకోవాలి.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

వ్యాయామం: కొన్ని వ్యాయామలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మీ కండరాలను వదులు చేస్తుంది. దాంతో మీ శరీరంలోని హార్మోనులు క్రమంగా పనిచేయడానికి సమతుల్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అయితే వ్యాయామాల్లో కూడా కఠినమైన లేదా బలమైన వాటికి దూరంగా ఉండాలి. లేదంటే ఆ ఒత్తిడి యూట్రస్(గర్భశయం) మీద ఎక్కువగా పడుతుంది. దాంతో గర్భధరించే అవకాశాలు తక్కువ కాబట్టి సులభ వ్యాయామాలు ఎంపిక చేసుకోండి.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

ఓవొలేషన్ క్యాలెండర్: ఓవొలేషన్(అండోత్సర్గం)అంటే అండం విడుదలయ్యే ఖచ్చితమైన సమయం. ఆ తేదీలలో మీరు ఖచ్చితంగా పార్ట్నర్ తో కలవాల్సిన సమయంగా లెక్కిస్తారు. ఇది గర్భం ధరించడానికి అనుకూలమైన సమయంగా భావిస్తారు. ఇది మీరు చివర రుతు చక్రం మొదలైన రోజు నుండి లెక్కిస్తారు. తర్వాత మీ రుతుక్రమ రోజులు 28రోజులకు లేదా 30 రోజులకా అని లెక్కిస్తారు.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

ఓవొలేషన్ స్ట్రిప్: ఓవొలేషన్ స్ట్రిప్ యోని మార్గంలో ప్రవేశపెట్టి గుర్తిస్తారు. ఈ స్ట్రిప్ రెడ్ కలర్ లో ఉంటే, మీరు అండోత్సర్గానికి రెడీగా ఉన్నట్లు తెలుపుతుంది. ఆ సమయం గర్భం ధరించడానికి చాలా ఉత్తమైన సమయంగా గుర్తించాలి. ఆ సమయంలో పార్ట్నర్ తో పాల్గొన్నట్లైతే గర్బం దాల్చే అవకాశాలు ఎక్కువ.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

ఓవొలేషన్ స్ట్రిప్: ఓవొలేషన్ స్ట్రిప్ యోని మార్గంలో ప్రవేశపెట్టి గుర్తిస్తారు. ఈ స్ట్రిప్ రెడ్ కలర్ లో ఉంటే, మీరు అండోత్సర్గానికి రెడీగా ఉన్నట్లు తెలుపుతుంది. ఆ సమయం గర్భం ధరించడానికి చాలా ఉత్తమైన సమయంగా గుర్తించాలి. ఆ సమయంలో పార్ట్నర్ తో పాల్గొన్నట్లైతే గర్బం దాల్చే అవకాశాలు ఎక్కువ.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

ధూమపానం నివారించాలి: పొగత్రాగడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్( అంటే గర్భసంచి బయట పిండం ఏర్పడుటకు)కారణం అవుతుంది మరియు మీలో సంతానోత్పత్తిని తగ్గిస్తుంది. కాబట్టి మీరు గర్భాధారణకు ప్రయత్నించాలనుకుంటే కనీసం 6-12నెలల ధూమపానం మానేయాలి.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

సంతాన్పోత్పత్తిని కలిగించే(ఫెర్టిలిటీ)ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం: కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మీలో సంతానోత్పత్తిని పెంచుతుంది. ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు వెన్న తీసిన డైరీ ప్రొడక్ట్స్(పాలు, పెరుగు) వంటివి మహిళలకు చాలా ఆరోగ్యకరమైన ఆహారం. ముఖ్యంగా గర్భధారణకోసం ప్రయత్నించే వారికి మరింత మేలు చేస్తాయి.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

పార్ట్నర్ స్పెర్మ్ కౌంట్: సంతానోత్పత్తి పెంచుకోవడానికి మీతో పాటు మీపార్ట్నర్ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. మీ భాగస్వామి యొక్క వీర్యకణాల సంఖ్య మరియు నాణ్యత సరిగా ఉన్నాయో లేదా తెలుసుకోవాలి. ముఖ్యంగా అతని జీవన శైలి ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి పొగ త్రాగకుండా నివారించాలి మరియు వ్యాయామాలు చాలా అవసరం.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

వెట్ డేస్: మీకు ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏటంటే కొన్ని రోజులు సర్వికల్ మ్యూకస్ (గర్భాశయ శ్లేష్మం కారణంగా)తడిగా అనుభూతి చెందుతారు. అంతే కాదు ఇది గర్భం కోసం ప్రయత్నించడానికి సరైన సమయం అని సూచిస్తుంది.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

ఒత్తిడి తగ్గించుకోవాలి: సంతానోత్పత్తికి బద్ద శత్రువు ఒత్తిడి ఒకటి. కాబట్టి మీరు గర్భంధరించాలనుకుంటున్నట్లేతే మీ ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి. ఒత్తిడి లేకుండా జీవించడానికి మెడిటేషన్ మరియు ఇతర రిలాక్షేషన్ పద్దతులను ప్రయత్నించి ఒత్తిడి లేకుండా గడపండి.

గర్భం ధరించడానికి 10 సులభ చిట్కాలు..!

అవసరమైన పరీక్షలు చేయించండి: పైన తెలపిన ఉపకరణాలు మరియు సాంకేతిక పద్దతుల వలన గర్భం ధరించలేకున్నట్లైతే.. డాక్టర్ ను తప్పని సరిగా కలవాలి. మరియు సంతానోత్పత్తికి ఇబ్బందులను కలిగి ఉండే అన్ని అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

English summary

10 Things To Help You Get Pregnant | గర్భం ధరించడానికి ఖచ్చితంగా పాటించాల్సిన 10 సులభ పద్దతులు..!

When you are trying to conceive and you have one missed chance after another, it is natural to get disappointed. Most couples expect to get pregnant fast; earliest is the first or second month of trying. However, seeing menstrual blood twice or thrice in row can have a psychological effect on you.
Story first published: Monday, May 27, 2013, 15:45 [IST]
Desktop Bottom Promotion