For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భనిరోధక స్పాంజ్ గురించి మీకు తెలుసా...?

|

బర్త్ కంట్రలో మరయు గర్భనిరోధక మార్గాలు ఇప్పుడు మనకు వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి. గర్భనిరోధకతను పాటించడానిక అనేక రకాలైన ఔషధాలు ప్రస్తుత మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. ఉదాహరణకు గర్భనిరోధక మాత్రలు, కండోమ్స్, కాపర్ టీ, వంటి అనేక మార్గాలున్నాయి. అయితే వాటికి ఫుల్ ఫ్రూఫ్ లేవు. కాబట్టి వాటి గురించి పూర్తిగా తెలుసుకొన్నాకే వాటిని ఉపయోగించడం మంచిది. అయితే కొన్ని సందర్భాల్లో గర్భనిరోధక మాత్రల వల్ల వ్యతిరేక పరిణామాలు ఏర్పడే అవకాశం వుంది. కండోమ్ చిరిగిపోతే గర్భందాల్చే అవకాశం ఉంది. కొన్ని గర్భనిరోధక మాత్రలు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గర్భ నిరోధక వస్తువుల నుండి కొన్ని ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు రెండూ ఉన్నాయి.

మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ మీకు పిల్లలు అవసరం లేదనుకుంటే, సురక్షితమైన గర్భ నిరోధక మార్గం కావాలనుకుంటే.. అందుకు గర్భ నిరోధక స్పాంజ్ ను ఉపయోగించవచ్చు. ఈ గర్భనిరోధక స్పాంజ్ బర్త్ కంట్రోల్ పద్దతి లాంటిదే. గర్భనిరోధకానికి పిల్స్ తీసుకొనేముందు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఇది కాంట్రాసెప్పిటివ్ డివైజ్ లాంటిది మరియు టాబ్లెట్.

మరి సరైన గర్భనిరోధకత పాటించడానికి కాంట్రాసెప్టివ్ స్పాంజ్ ఏవిధంగా ఉపయోగపడుతుందో చూద్దాం....

1. దీన్ని ఫామ్ ప్లాస్టిక్ తో తయారు చేయబడి ఉంటుంది. కాపటి టీ మెటల్ తో తయారు చేసిన పిల్స్. వీటిని వేయించుకొంటే కొందరికి ఇన్పెక్షన్ మరియు క్యాన్సర్ వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ప్లాస్టిక్ తో తయారు చేసిన కాంట్రాసెప్టివ్ స్పాంజ్ ప్రాధాన్యత కల్పించండి.

2. స్పాంజ్ ను ఉపయోగించడం వల్ల గర్భం రాకుండా సహయపడటమే కాకుండా, యూట్రస్ ను హానీ కలిగించకుండా వీర్యకణాలను నాశనం చేస్తుంది.

7 Reasons To Use A Contraceptive Sponge

3. కాపర్ టీ, మరియు ఇతర గర్భనిరోధక పద్దతుల్లో డాక్టర్ పర్యవేక్షణ అవసరం అవుతుంది. కానీ ఈ కాంట్రాసెప్టివ్ స్పాంజ్ ను తామే స్వయంగా ఉపయోగించవచ్చు.

4. ఈ కాంట్రాసెప్టివ్ స్పాంజ్ రెండు పద్దతుల్లో రక్షణ కల్పిస్తుంది. ఒకటి ఇది భౌతికంగా గర్భాశయంలోనికి స్పెర్మ్ చేరనివ్వకుండా ఒక కవచంలా పనిచేస్తుంది. రెండవది వీర్యకణాలను నాశనం చేస్తుంది.

5. దీన్ని ఉపయోగించడం కూడా సులభమే: ఫీమేల్ కండోమ్ ను సరిగ్గా ఉంచడం మరియు సర్దుబాటు చేయడం వంటివి పాటించాలి. అయితే ఈ కాంట్రాసెప్టివ్ స్పాంజ్ ను ఒక సారి అమర్చుకొంటే సరిపోతుంది. ఇది అలా.. ఇలా జరిగిపోవడం వంటివి జరగకుండా ఉండేదుకు మెటల్ నాబ్స్ ను అమర్చబడి ఉంటుంది.

6. పిల్లలు కానీ మహిళలకు ఇది మంచిది. ఇది గర్భనిరోధానికి బాగా సహాయపడుతుంది. అదే పిల్లలు గల మహిళలైతే స్పాంజ్ ఉపయోగించడం కంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ తీసుకోవచ్చు.

7. దీన్ని ఉపయోగించి తిరిగి పారవేయవచ్చు. ఈ స్పాంజ్ తిరిగి ఉపయోగించడానికి పనికి రాదు. కాబట్టి ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువే.

English summary

7 Reasons To Use A Contraceptive Sponge | సైడ్ ఎఫెక్ట్స్ లేని గర్భనిరోధక స్పాంజ్...!

Several ways of birth control or contraception are available to us, but none are foolproof. However, you need to use birth control if you are not planning a pregnancy now. We all have our own preferences when it comes to choosing a contraceptive method. So if you have not found your most suitable contraceptive yet, here is some food for thought.
Story first published: Monday, February 4, 2013, 14:50 [IST]
Desktop Bottom Promotion