For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ జరగడానికి కారణం అయ్యే 8 సిల్లీ మిస్టేక్స్!

|

గర్భధారణ పొందడం అనేది దేవుడు ప్రసాధించిన ఒక వరం. మరియు ప్రతి ఒక్క మహిళ ఈ వరాన్నివృథా చేసుకోవాలనుకోరు. కానీ కొంత మంది మహిళలు చేసే చిన్న చిన్న అజాగ్రత్తలు, తప్పుల వల్ల ఈ వరాన్ని చేజేతులా పోగొట్టుకుంటారు. మహిళ గర్భం పొందిన వెంటనే, ఆమె జీవన శైలిలో కొన్ని అవసరమైన మార్పులను చేసుకోవాలి. తరచుగా ఈ జీవనశైలిలో మార్పులు చేయడంలో ఆలస్యం చేయడం లేదా అయిష్టత వల్ల గర్భస్రావాలు ప్రోత్సహించవచ్చు. చాలా మంది వైద్యులు మహిళ గర్భధారణ సమంయలో ఒక ‘సాధారణ' జీవితాన్ని గడపడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చాలా మంది వైద్యులు సలహాలిస్తుంటారు.

తెలిసితెలిసి ఎవ్వరూ గర్భస్రావాన్ని కోరుకోరు. అయితే, మిమ్మల్ని మీరు సురక్షింతంగా ఉంచుకోవడంలో కొద్ది అజాగ్రత్తగా ఉండటం వల్ల గర్భస్రావం అవ్వడానికి కారణం కావచ్చు. ముఖ్యంగా గర్భం ధరించిన మొదటి దశలో, చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భస్రావానికి కారణం అయ్యే వాటన్నింటికి దూరంగా ఉండాలి. గర్భస్రావం కాకుండా ఉంటే గర్భం ధరించిన మొదటి దశలో(మొదటి మూడు నెలల్లో)జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో గర్భస్రావం అవ్వడానికి కారణం అయ్యే కొన్ని సిల్లీ మిస్టేక్స్ క్రింది విధంగా ఉన్నాయి. వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోండి...

8 Mistakes That Promote Miscarriage
చెడు ఆహారాలను తీసుకోవడం: స్త్రీ గర్భాధారణ సమయంలో బొప్పాయి మరియు అనాస(పైనాపిల్ )పండ్లను తినడాకి బదులుగా, మంచి శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. డాక్టర్ల సలహా ప్రకారం వారి సూచించే పండ్లను తీసుకోవడం వల్ల గర్భస్రావం జరగకుండా సహాయపడుతాయి. కానీ, కుల్లిపోయిన మరియు అనారోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల లూజ్ మోషన్ అయ్యి, గర్భస్రావానికి కారణం కావచ్చు.

అసురక్షితమైన ప్రయాణాలు: మన ఇండియాలో రోడ్లు చెప్పలేనంత చెడు ఉంటాయి, కాబట్టి, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోండి. గర్భాధారణ సమయంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో ప్రయాణించడం మానుకోండి. దీనికి చాలా సింపుల్ కారణం కూడా ఉంది. ఏంటంటే, రోడ్లమీద ఎగుడుదిగుడు గుంతలు లేదా రోడ్ డివైడర్స్, లేదా స్పీడ్ బ్రేక్ వల్ల కూడా గర్భస్రావానికి కారణం కావచ్చు. కాబట్టి, గర్భం ధరించిన మొదటి మూడు నెలలో సురక్షిత ప్రయాణాన్ని ఎంపిక చేసుకోండం ఉత్తమం.

తగినంత విశ్రాంతిని తీసుకోకపోవడం: గర్భం పొందిన ప్రతి మహిళ రోజులో 8గంట నిద్ర, మరియు 2గంటల విశ్రాంతి చాలా అవసరం. గర్భం పొందిన మొదటి దశలో మీ శరీరానికి తగినంత విశ్రాంతి కల్పించకపోతే, మీరు గర్భం పొందడంలో మీరు బలంగా లేరని తెలిసిపోతుంది. దాంతో గర్భస్రావం జరగడానికి అవకాశం ఉంది.

అనిశ్చిత చర్యలు: కొన్ని సార్లు, అనిశ్చిత భౌతిక కార్యకలాపాల వల్ల గర్భస్రావానికి కారణం కావచ్చు. ఉదాహరణకు: గుర్రపు స్వారీ, స్కేటింగి, ఇతర సాహస క్రీడలు గర్భధారణ సమయంలో నిలిపివేయాలి. అలాగే జారడం లేదా నీటి పార్కులలో ఇతర సవారీలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే గర్భస్రావం అవ్వడానికి కారణం అవ్వొచ్చు.

ఒత్తిడి: ఒత్తిడి అనేది ఒక సైలెంట్ కిల్లర్. గర్బధారణ సమయంలో, స్ట్రెస్ హార్మోనులు చాలా ప్రమాదకరమైనవిగా ఉంటాయి. ఎందుకంటే గర్భాధారణ సమయంలో అధిక ఒత్తిడికి గురైతే, గర్భాశయంలోని గర్భాశయ కండరాలు క్రాప్స్(తిమ్మర్లెకు)కారణం అవుతుంది. ఈ క్రాప్స్ వల్ల గర్భాధారన ప్రారంభంలోనే గర్భస్రావం అవ్వాడానికి పోత్సహిస్తుంది .

ధూమపానం మరియు మద్యం: మీరు రెగ్యులర్ స్మోకర్ ఐతే, అది వెంటనే విడిచి పెట్టడానికి కొంత కష్టమే. కానీ నికోటిన్ మరియు ఆల్కహాల్ రెండూ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మరియు ప్లాసెంటా(గర్భశయంలోని మావి) అంతటా రక్తప్రవాహంను అడ్డుకుంటుంది. దాంతో సులభంగా గర్భస్రావానికి దారి తీయవచ్చు.

కొన్ని మందులు: సాధారణంగా ఉపయోగించే ఆస్ప్రిన్ వంటి మందుల గర్భస్రావాన్ని ప్రోత్సహించవచ్చు. ఎలాంటి ఉత్ప్రేరకాలను మీ గర్భం పొందిన శరీరంలోనికి వెళ్ళకుండా జాగ్రత్తపాటించాలి. ఈ మందులు తీసుకోవడం వల్ల గర్భస్రావానికి కారణం కాకపోవచ్చు, కానీ ఇవి ఖచ్చితంగా ఆ ప్రమాదాన్ని పెంచవచ్చు.

అవగాహనలేని వ్యాయామం: గర్భంస్రావాన్ని నివారించేందుకు సురక్షితమైన వ్యాయామాలు ఉండాలి. కానీ, గర్భధారణ సమయంలో అన్ని వ్యాయామాలు సురక్షితం కాదు. గర్భాధారణ సమయంలో స్పిట్ల్స్ లేదా ఆబ్డామినల్ క్రంచెస్ ను చేయకూడదు. లేదా గర్భం పొందిన ప్రారంభ దశలో వ్యాయామాలు చేయకపోవడమే సురక్షితం.

కాబట్టి, ఈ చిన్న చిన్న సాధారణ తప్పుల వల్లే గర్భస్రావాలు జరగడానికి కారణం కావచ్చు. గర్భస్రావాలు జరగడానికి ఇలాంటి కారణాలు మీకేమైనా తెలుసా?

English summary

8 Mistakes That Promote Miscarriage

Being pregnant is a huge gift and no woman really wants to waste this blessing by making careless mistakes. As soon as you get pregnant, you are supposed to make some necessary lifestyle changes. Often a delay or reluctance in making these lifestyle changes can promote miscarriages.
Story first published: Thursday, July 18, 2013, 13:01 [IST]
Desktop Bottom Promotion