For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణి స్త్రీకి పిలేట్స్( వ్యాయామాలు) వల్ల కలిగే లాభాలు..!

By Super
|

గర్భం దాల్చిన తరువాత పిలేట్స్ అనేవి సురక్షితమైన వ్యాయామాలు. గర్భం దాల్చిన తరువాత మొదలయ్యే అలసట, ఆయాసం, కాళ్ళ వాపు, నడుం నొప్పి వంటి సమస్యల నుండి ఈ వ్యాయామాలు ఉపశమనాన్ని ఇస్తాయి.

బాడీ బిల్డింగ్ పద్దతులైన ఈ పిలేట్స్ పొత్తి కడుపుకి బలాన్నిస్తాయి. అలాగే శ్వాస కోశ కి సంబంధిచిన వ్యాయామాలు కూడా ఇవి. గర్బం దాల్చిన తరువాత తమ శక్తి ని బట్టి ఈ పిలేట్స్ ని చెయ్యాల్సిన సమయం నిర్దేశించుకోవాలి.

గర్భిణిలలో ఈ పిలేట్స్ వల్ల కలిగే లాభాలు:

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

బరువుని అదుపులో ఉంచుట: గర్భిణీలు ఆహారం లో డైటింగ్ ని పాటించకూడదు. అయినా అధిక బరువు ని అదుపులో పెట్టుకునేందుకు కొన్ని నియమాలు పాటించాలి. ఈ పిలేట్స్ గర్భం దాల్చిన తరువాత బరువుని అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

అలసటని అధిగమించడం: కొన్ని కదలికలు కలిగిన పిలేట్స్ శక్తిని సామర్ధ్యాన్ని పెంపొందించడం లో తోడ్పడతాయి. అలసటని అధిగమించడానికి గర్భిణీ స్త్రీలకు సామర్ధ్యం అవసరం.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

అనారోగ్య సిరలను బాగు చెయ్యడానికి, కాళ్ళ నొప్పులు మరియు వాపులు నివారించడానికి: పిలేట్స్ ని సాధన చేస్తున్నప్పుడు కాళ్ళ కదలికలు రక్త ప్రసరణని మెరుగు పరుస్తాయి. అత్యధిక కండరాల్ని మరియు మడమ వద్ద కండరాలకి ఈ పిలేట్స్ మంచి వ్యాయామం. రక్త ప్రసరణ సజావుగా జరగడం వల్ల కాళ్ళ నొప్పి మరియు వాపు తగ్గుతాయి.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

మీ భంగిమని గమనించండి: గర్భం దాల్చిన తరువాత శరీర భంగిమ సహజంగానే మారుతుంది. పెద్దదైన పొత్తికడుపు యొక్క భారం శరీరం పై పడుతుంది. ఈ మార్పులు కండరాలు మరియు కీళ్ళ పై ఎక్కువ ఒత్తిడి కలిగిస్తాయి. శరీరంలోని భంగిమల మార్పుపై ఈ పిలేట్స్ వ్యాయామం ప్రభావం ఉంటుంది. శరీరం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఈ వ్యాయామం చెయ్యవచ్చు.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

మునుపటి శరీరాకృతిని త్వరగా తిరిగి పొందవచ్చు: కొంత మంది స్త్రీలు గర్భం దాల్చడం వల్ల లావుగా కనపడడానికి ఇష్టపడరు. ఈ సమస్యని పిలేట్స్ తో అధిగమించవచ్చు. గర్భం శరీరం లో ని కండరాల్ని విశ్రాంతి కి గురి చేస్తుంది. అందువల్ల ఈ సమయంలో కండరాల పని తీరుని గమనించాలి. తద్వారా, గర్భం దాల్చడానికి ముందున్న మీ శరీర ఆకృతిని వెంటనే మీరు పొందవచ్చు.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

బాధ లేకుండా: మీ పాపాయి ఎదుగుదల వల్ల పొట్ట పెద్దదిగా మారుతుంది. తద్వారా మీ నడుము పెద్దదిగా మారుతుంది. పొత్తికడుపు కండరాలకి సామర్ధ్యాన్ని పెంచే ఈ పిలేట్స్ నడుం వెనుక భాగం పై ఒత్తిడి ని తగ్గించడం లో తోడ్పడతాయి.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

ఆనందంగా ఉంచడం: గర్భం దాల్చిన తరువాత కొన్ని సార్లు ఉపిరి పీల్చడం కష్టతరం. రోజు వారి పనులు వంటివి ఈ సమస్యల వల్ల ఇబ్బందికి గురి అవుతాయి. పిలేట్స్ వల్ల లింబ్స్ ఆక్టివ్ అవుతాయి. పిలేట్స్ వల్ల శరీరంలోని సామర్ధ్యం మెరుగుపడుతుంది. తద్వారా గర్భధారణ సమయం మొత్తం మీరు ఆరోగ్యం గా ఉంటారు.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

తగినంత నిద్ర: మూడవ త్రైమాసికం గర్భిణి స్త్రీలు సరైన నిద్ర పోయే భంగిమని పాటించాలి. ఈ పిలేట్స్ వ్యాయామం వల్ల శ్వాస కోశ ఇబ్బందులు తగ్గి రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. తద్వారా మీరు ఏంతో రిలాక్స్డ్ గా ఉంటారు. తగినంత నిద్ర లభిస్తుంది.

గర్భిణీలకు సురక్షితమైన వ్యాయామాలు..!

ప్రవాసం తరువాత ఒత్తిడి తగ్గించడం: గర్భిణీ స్త్రీల సామర్ధ్యం తిరిగి ప్రసవం తరువాత పరీక్ష కి గురి అవుతుంది. తొమ్మిది నెలల గర్భం ఒక వైపు ప్రసవం తరువాత ఒక వైపు. ఫీట్ నెస్ ని మైంటైన్ చెయ్యకపోతే ప్రసవం తరువాత తల్లి విపరీతమైన అలసట కి గురి అవుతుంది. కదలికలు కలిగిన పిలేట్స్ వల్ల శరీరం చురుకుగా మారుతుంది. ప్రసవానంతరం శరీరం ఆరోగ్యంగా ఉండడానికి మీరు మానసికంగా అలాగే శారీరకంగా తయారయి ఉండాలి.

English summary

9 Benefits of Pilates for Pregnant Women | గర్భిణి స్త్రీకి పిలేట్స్( వ్యాయామాలు) వల్ల కలిగే లాభాలు..!

Pilates can be a safe alternative exercise during pregnancy, in order pregnant women are always active and overcome some of the complaints during pregnancy such as fatigue, leg swelling, or pain in the waist, to the body easily tired.
Desktop Bottom Promotion