For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మొదటి మూడు నెలల్లో గర్భస్రావం(అబార్షన్)నివారించే చిట్కాలు...

|

మహిళలకు గర్భం ధరించడం ప్రకృతి ప్రసాధించిన ఓ వరం. అందువల్లే ఆ గర్భం మిస్ కరేజ్ (గర్భస్రావం)కాకుండా కాపాడుకునే బాధ్యత మనలో ఉంది. దాంతో అది ఒక శాపంగా మారకుండా ఉంటుంది. ఈ రోజుల్లో మన ఉరుకుల పరుగుల జీవితంలో, మానసిక ఒత్తిడి గర్భస్రావానికి (అబార్షన్ )కు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. మరీ ముఖ్యంగా గతంలోలాగా స్త్రీలు గర్భం ధరించిన తర్వాత ఇంటి పట్టున ఉండటం చాలా అరుదైపోయింది. మానసిక, శారీరక విశ్రాంతి పొందడం ఖరువైంది. గర్భం ధరించిన తర్వాత బయటకు వెళ్ళడం వల్ల అనేక ప్రమాదాలను తెచ్చిపెట్టుకొంటున్నారు.

గర్భస్రావాలు ఎక్కువగా మొదటి త్రైమాసికం(మొదటి మూడు నెల)ల్లో జరగడం సర్వ సాధారణం. అందుకు కారణం మొదటి మూడు నెలల్లో గర్భంలో పిండం ఎదుగుదల లోపించడం. మానసి ఒత్తిడి, పౌష్టికాహారలోపం, హార్మోనుల అసమతుల్యత. కారణం ఏదైనా కావచ్చు.మొదటి మూడు నెలల్లో గర్భస్రావాన్ని నిరోధించడానికి ప్రయత్నించాలి. అందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటి మూడు నెల్లో గర్భస్రావం జరగకుండా ఉండేందుకు తీసుకోవల్సి అతి సులభ చిట్కాలు చూడండి..

Avoid Miscarriage In The First Trimester

1. చీజ్ తినకూడదు: గర్భం ధరించిన మొదటి మూడునెలల్లో తెల్లని చీజ్(జున్ను)తీసుకోవడం చాలా ప్రమాధకరం. మొదటి మూడు నెలల్లో ఈ ఆహారానికి దూరంగా ఉండాలి. ఇది గర్భిణీలకు ఒక తీవ్రమైన విషాహార కారణంగా తక్షణమే గర్భస్రావానికి దారితీస్తుంది. కాబట్టి గర్భస్రావాలు తప్పించడానికి వైట్ జున్ను తినకపోవడమే మంచిది.

2. రఫ్ ట్రావెలింగ్(దూర ప్రయాణాలు): గర్భం ధరించిన తర్వాత ప్రయాణం చేయాల్సి వస్తే చాలా సురక్షితమైన ప్రయాణం చేయాలి. ప్రత్యేకంగా మొదిటి త్త్రెమాసికంలో పిండం అవరోధాలను ఎదుర్కొనేంత బలంగా ఉండదు కాబట్టి చాలా దూర ప్రయాణాలు, మరియు రోడ్లు ఎగుదిగుడు ఉన్న ప్రదేశాల్లో ప్రయాణం చేయడం సురక్షితం కాదు. అలాంటి ప్రయాణాలను సాధ్యమైనంత వరకూ నివారించండి. ఇంకా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించడం కూడా ప్రమాధకరమే.

3. నిల్వ ఆహారాలు: ఏదైనా నిల్వ చేసిన ఆహారాలను ఈ మొదటి త్రైమాసికం(గర్భం ధరించిన మూడునెలల్లో)లో తీసుకోవడం వల్ల గర్భస్రావానికి కారణం కావచ్చు. ఉదా: నిల్వ చేసిన మాంసం, కార్టూన్ జ్యూసులు మొదలగునవి. కాబట్టి గర్భం సేఫ్ గా ఉండాలంటే తాజాగా వండిన ఆహారాలు, తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వండి.

4. కెఫిన్ అధికంగా ఉండే డ్రింక్స్: మొదిటి టైమిస్టర్(మొదటి మూడు నెలల్లో)కొన్ని సార్లు మీరు గర్భం ధరించారన్న విషయం కూడా మీరు తెలుసుకోలేరు. అటువంటి సమయంలో కెఫిన్ అధికంగా ఉండే కెఫిన్ డ్రింక్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గర్భస్రావం జరిగే ప్రమాధం ఎక్కువ. కాబట్టి కాఫీ తీసుకోవడాన్ని మానుకొని గర్భస్రావాన్ని అరికట్టండి.

5. స్ట్రెస్ హార్మోన్స్(ఒత్తిడికి గురి అయ్యే హార్మోన్స్): గర్భం ధరించిన మొదటి మూడు నెలల్లో శరీరంలో అనేక మార్పులకు చోటు చేసుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఒత్తిడికి గురి అవుతారో, అప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఈ స్ట్రెస్ హార్మోన్స్ మీ గర్భాశయాన్ని సంకోచాలకు దారితీసి పిండం స్థానభ్రంశము చెందుటను ప్రారంభిస్తుంది. కాబట్టి, చాలా వరకూ మీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మొదటి త్రైమాసికంలో (మొదటి మూడు నెలల్లో)గర్భస్రావాలు నివారించడానికి ఇవి చక్కటి మార్గాలు.

English summary

Avoid Miscarriage In The First Trimester | మొదటి 3 నెలల్లో అబార్షన్ జరగకుండా నివారించే చిట్కాలు


 Pregnancy is a huge blessing of Nature. That is why it is important to avoid miscarriages so that the blessing does not turn into a curse. These days, our stressful lives and unhealthy lifestyles have increased miscarriages. Moreover, women no longer stay at home during their pregnancy; they go out to work and are thus exposed to many more dangers.
Story first published: Friday, March 29, 2013, 9:09 [IST]
Desktop Bottom Promotion