For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎమోషనల్ గర్భిణీకి సపోర్ట్ గా ఉండటం ఎలా

By Lakshmi Perumalla
|

ప్రతి భర్త కేవలం భాగస్వామిగా మాత్రమే పరిమితం కాకుండా తన భార్య గర్భధారణ సమయంలో మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది. మీ భాగస్వామి ఒంటరిగా గర్భం యొక్క మొత్తం బారంను మోస్తుంది. కనీసం మీరు గర్భధారణ సమయంలో సాధ్యమైనంత వరకు ఆమెకు మద్దతుగా ఉండాలి. మీ భాగస్వామి మీ నుండి ముఖ్యమైన భావోద్వేగ మద్దతును ఆశిస్తుంది.

గర్భధారణ సమయంలో మానసికంగా ఆమెకు అందుబాటు మరియు మద్దతుగా ఉండటం వలన ఒక మంచి మార్గంలో గర్భం ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. మీ భాగస్వామికి గర్భం సమయంలో భావోద్వేగ మద్దతు అందించడం ద్వారా మీరు ఆమె పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నారో తెలుస్తుంది. అంతేకాక మీ మధ్య బంధం బలోపేతం అవటానికి సహాయపడుతుంది. భాగస్వామి యొక్క భావోద్వేగ మద్దతు పొందుట వలన తల్లి సురక్షితం మరియు లోపల బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది. ఆమె సునిశితంగా మరియు సంరక్షణ మరియు ప్రేమతో పరిస్థితులను ఎదుర్కొవటం ముఖ్యం.

గర్భధారణ సమయంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఈ సమయంలో మీ భావోద్వేగ మద్దతు మరింత కీలకం అని చెప్పవచ్చు. దాని వలన ఆమె భావాలు సంతులనం మరియు అస్థిర మానసిక కల్లోలం లేకుండా ఒక ప్రశాంతత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. గర్భం ఒత్తిడి ఎక్కువగా ఇవ్వడం వలన మోస్తున్న తల్లి కొన్ని ఇబ్బందులు పడుతుంది. ఈ ఒత్తిడి ప్రతికూలంగా గర్భవతుల్లో విడుదల చేసిన ఒత్తిడి హార్మోన్ల వలన పుట్టిన తరువాత ఒత్తిడి వారి పిల్లల మీద మరింత రియాక్టివ్ చేయవచ్చు. కానీ తల్లి మాత్రం ప్రభావితం కాదు.

Be An Emotional Support During Pregnancy


1. కమ్యూనికేషన్
గర్భధారణ సమయంలో మానసికంగా మద్దతుగా ఉండటానికి మీరు ఎప్పుడూ కంటే ఇప్పుడు ఎక్కువగా ఆమెను కమ్యూనికేట్ చేయటం మొదలు పెట్టాలి. ఒక సన్నిహిత స్థాయిలో ఆమెతో బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఆమె గర్భం వివిధ దశల ద్వారా ఏమి జరుగుతుందో మరియు ఆమె మీ నుండి ఏమి ఆశిస్తుందో తెలుసుకొని మద్దతు అందించడానికి ప్రయత్నించండి. తన భావోద్వేగాల గురించి ఎక్కువ వ్యక్తీకరించే అవకాశం ఉంటుంది.

2. బిడ్డతో మాట్లాడటం
ఇది చాలా మందికి క్రేజీగా అనిపిస్తోంది. కానీ ఆమె కడుపు ద్వారా బిడ్డతో మాట్లాడటం వలన మీ భాగస్వామి మరియు బిడ్డ మీద చాలా సానుకూల ప్రభావం ఉంటుంది. మీ ముగ్గురి మధ్య మరింత సన్నిహిత బంధం ఏర్పడుతుంది. మీరు తల్లి మరియు బిడ్డ ఇద్దరి మీద సంరక్షణ ఉంటుంది.

3. క్రమం తప్పకుండా ఆమెకు భరోసా ఇవ్వాలి
చాల మంది తల్లులకు పిల్లలు పుట్టే ఈ సమయంలో అనేక ఆలోచనలు వస్తు ఉంటాయి. మీరు ఆమె కోసం దగ్గర ఉండి అన్ని విషయాల మీద క్రమం తప్పకుండా ఆమెకు భరోసా కల్గించాలి. తద్వారా తల్లి మరియు లోపల బిడ్డ మీద ఒక తరంగాల ప్రభావం ఉంటుంది.మీరు తరచుగా ఆమెకు మంచి అనుభూతి కలిగించటం మరియు మంచి మాటలు చెప్పటం చేయాలి.

4. కలిసి ఎక్కువ సమయం గడుపుట
సాధారణ సమయాల్లో,మీ స్నేహితులతో సమావేశంలో లేదా ఒక పోకర్ రాత్రి కోసం వెళ్ళటం ఆమోదయోగ్యమైనప్పటికీ,గర్భధారణ సమయంలో మొత్తం పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఆమె 'ఫన్' పనులను ఎక్కువ సమయం కేటాయించటం ముఖ్యం. క్రమం తప్పకుండా ఆమె తో సినిమాలు లేదా TV చూడటం వలన ఆమెకు అనుకూల సంకేతాలు పంపడంలో సహాయపడుతుంది.

5. సెన్సిటివ్ మరియు ప్రశాంతంగా ఉండుట
గర్భధారణ సమయంలో మీ భాగస్వామిలో హార్మోన్లు హెచ్చుతగ్గులు ఉంటాయి. అందువలన ఆమె సాదారణంగా కనిపించిన కొన్ని సార్లు మాత్రం ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. దూకుడు లేదా భావోద్వేగం లేకుండా సెన్సిటివ్ మరియు ప్రశాంతంగా పరిస్థితిని పరిష్కరించాలి.

English summary

Be An Emotional Support During Pregnancy

Knowing what to expect when you are expecting is not confined to just the female partner in a relationship. As a man, you have to step up and stand up to the occasion by being supportive during the pregnancy phase.
Story first published: Tuesday, December 10, 2013, 17:47 [IST]
Desktop Bottom Promotion