For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు అత్యంత ప్రయోజకారిని..ఫోలిక్ యాసిడ్

|

Benefits of Folic acid on Pregnant Women...
గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ ఆమ్లం వల్ల ప్రయోజనాలుఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు ఒక సూపర్ హీరో వంటిది,ఎందుకంటే బిడ్డ యొక్క మెదడు మరియు వెన్నెముక మరియు పుట్టుకలో వచ్చే లోపాలను నిరోధిస్తుంది.దీనిలో B విటమిన్,బలవర్థకమైన తృణధాన్యాలు ఉంటాయి.ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, మరియు మీ శిశువు యొక్క నాడీ నాళిక అభివృద్ధికి సహాయపడుతుంది.ఒక చీలి పెదవి మరియు అంగిలితో పుట్టిన శిశువులకు జన్మనిచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సాధారణంగా మీరు గర్భం ధరించటానికి ప్లాన్ వేసుకుంటే దానికి ఒక సంవత్సరం ముందు నుంచి ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను వాడితే నెలలు నిండకుండా పుట్టే పిల్లల శాతం 60%శాతానికి పైగా రిస్క్ తగ్గుతుంది. ఒకవేళ గర్భధారణ ఆకస్మికంగా ఉంటే మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే ఫోలిక్ ఆమ్లం మాత్రలను ప్రారంభించండి.గర్భధారణ యొక్క మొదటి 12 వారాల ఫోలిక్ ఆమ్లం మాత్రలు తీసుకోవాలి.ఫోలిక్ ఆమ్లం B విటమిన్ యొక్క ఒక రూపం.ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల గర్భస్రావం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మరియు పిల్లలు నాడీ ట్యూబ్ డిజార్డర్ ప్రతి 1000 మందిలో ఒకరికి వచ్చేఅవకాశం ఉంది.

1.పుట్టుకతో వచ్చే లోపాలు గర్భం యొక్క మొదటి 3-4 వారాలలో సంభవిస్తాయి. మీ బిడ్డ యొక్క మెదడు మరియు వెన్నెముక అభివృద్ధి చెందే ఆ తొలి దశలలో మీరు తప్పనిసరిగా ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను తీసుకోవాలి.

2.పాలకూర వంటి కూరగాయలు, మొలకలు, బ్రోకలీ, ఆకుపచ్చ బీన్స్, మరియు బంగాళాదుంప లలో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది.

3. మీరు గర్భవతి ఉన్నప్పుడు ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను మరియు అదనంగా మీరు ఫోలిక్ ఆమ్లం అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

4. కణ విభజన మరియు పిండం అభివృద్ధి కి ఫోలిక్ ఆమ్లం బాగా ఉపయోగపడుతుంది.

5. ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల నెలలు నిండకుండా పిల్లలు పుట్టటం మరియు తక్కువ బరువు గల పిల్లలు పుట్టటం జరుగుతుంది.

6. ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

7. అల్జీమర్స్ వ్యాధి, గుండెపోటు, స్ట్రోక్ మరియు క్యాన్సర్ వంటి ప్రమాదాలు తగ్గిస్తుంది.

8. ఫోలిక్ ఆమ్లం డియోక్సిరిబౌన్స్లెయిక్ యాసిడ్ (DNA) ఉత్పత్తికి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

9. ఇది శిశువుకు గుండె లోపాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

10. ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల గర్భస్రావం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

11. ఫోలిక్ ఆమ్లం లేకపోవడం వల్ల పిండం యొక్క అభివృద్ధి మరియు కణ విభజన బలహీనపడవచ్చు.

12. గర్భధారణ సమయంలో ఫోలిక్ ఆమ్లం యొక్క రక్షక ప్రభావం వల్ల నాడీ సంబంధ నాళిక లోపాలను నివారించవచ్చు.

13. బిడ్డ యొక్క మెదడు మరియు వెన్నెముక మరియు పుట్టుకలో వచ్చే లోపాలను నిరోధిస్తుంది.లింబ్ లోపాలు మరియు మూత్ర నాళాలు క్రమరాహిత్యాలు రిస్క్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

14. ఫోలిక్ ఆమ్లం B9 విటమిన్ యొక్క ఒక రూపం.

ఫోలిక్ ఆమ్లం ఉన్న ఆహార పదార్దాలు

తృణధాన్యాలు

కాయధాన్యాలు

ఆకుకూర, తోటకూర

బచ్చలికూర

బ్లాక్ బీన్స్

పీనట్స్

ఆరెంజ్ జ్యూస్

రొట్టెలు మరియు పాస్తా

పాలకూర

మొలకలు

బంగాళాదుంప

బ్రోకలీ .......మొదలైనవి


గర్భధారణ సమయంలో ప్రతి రోజు తీసుకోవలసిన ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్

గర్భం ప్రయత్నిస్తున్న సమయంలో: 400 MCG

గర్భధారణ యొక్క మొదటి మూడు నెలలు: 400 MCG

గర్భధారణ యొక్క నాలుగు నుంచి తొమ్మిది నెలలు: 600 MCG

బిడ్డకు పాలు ఇచ్చు సమయంలో : 500 MCG

English summary

Benefits of Folic acid on Pregnant Women... | గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ యాసిడ్ ప్రయోజనాలు

Folic acid pregnancy has been researched about. Importance folic acid during pregnancy is that it will help you increase your appetite. Some pregnant mothers do not eat much as they feel nausea all the time but presence of folic acid can improve hunger issues
Story first published:Friday, January 11, 2013, 12:04 [IST]
Desktop Bottom Promotion