For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు వచ్చే తలనొప్పికి ప్రధాన కారణాలు..నివారణ.!

|

శరీరంలో నొప్పులు మురియు అలసటకు గురిచేసేది గర్భధారణ సమయం. తలనొప్పి అనేది గర్భాధారణ సమయంలో వచ్చే అతి సాధారణమైన నొప్పి. గర్భధారణ సమయంలో తలనొప్పితో చాలా ఇబ్బంది పడవల్సి వస్తుంది. గర్భధారణ సమయంలో వచ్చే తల, మొడనొప్పి అంత తీవ్రమైనవి కాకపోవచ్చు. అయితే ఇవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పనిచేసే(ఉద్యోగస్తులు)అయితే, అటువంటి వారిలో వచ్చే తలనొప్పి ఖచ్చితంగా సమస్యాత్మకంగా ఉంటుంది.

గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పి నివారణ కోసం మాత్రలు తీసుకోవడం మంచిది కాదు. అయితే గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పికి కారణాలు తెలుసుకుంటే, మీరు తప్పకుండా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. గర్బధారణ సమయంలో వచ్చే తలనొప్పులకు కొన్ని ముఖ్య కారణాలు క్రింది ఇవ్వబడ్డాయి..వాటిని పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే ప్రెగ్నెన్సీ హెడ్ ఏక్ నుండి ఉపశనమం పొందవచ్చు. మరి గర్భధారణ సమయంలో తలనొప్పి రావడానికి గల కొన్ని ప్రధాన కారణాలు....

Pregnancy

ఒత్తిడితో కలిగే తలనొప్పి: ఎప్పుడైతే మీరు ఒత్తిడితో ఉంటారో..అప్పుడు మీకు తలనొప్పికి గురిఅవుతారు. గర్భధారణ సమయంలో ముఖ్యంగా మొదటి మూడు నెలలో మీ శరీరం మనస్సు చాలా ఒత్తిడితో కూడి ఉంటుంది. మొదటి మూడు నెలలు అసౌకర్యంగా ఎప్పుడూ అలసట, వికారం మరియు గర్భధారణకు మీ శరీరాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శరీరంలో అనేక మార్పులు చేటు చేసుకోవడం వల్ల ఒత్తిడి, టెన్షన్ హెడ్ ఏక్ వంటివి వస్తాయి. అయితే టెన్షన్ హెడ్ ఏక్ ను తగ్గించుకోవడానికి వేరే మార్గం లేదు. అందుకోసం రిలాక్స్ టెక్నిక్స్(మెడిటేషన్ మరియు యోగా) పాటిస్తే చాలా వరకూ తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

హార్మోనల్ హెడ్ ఏక్: గర్భధారణ సమయంలో శరీరంలోని అనేక హార్మోలను మార్పుల వల్ల కొన్ని సమయాల్లో తలనొప్పిక కారణం అవుతుంది. ఈ హార్మోనల్ హెడ్డేక్ నుండి ఉపశమనం పొందడానికి ఫ్రెష్ ఎయిర్ ను పీల్చడం కానీ లేదా మనస్సును ఆహ్లాదపరిచే మూడ్ బూస్టింగ్ ఫుడ్ అంటే చాక్లెట్ వంటివి తినడం వల్ల చాలా వరకూ ఉపశమనం పొందవచ్చు.

బ్లడ్ షుగర్ స్థాయిలు: ఎప్పుడైతే ప్రెగ్నెంట్ గా ఉంటారు, అటువంటి సమయంలో మీరు కొంచెం కూడా కష్టమైన పనులు చేయకున్నా కూడా మీ శరీరానికి రెగ్యులర్ డోస్ ఎనర్జీ చాలా అవసరం. మద్యహ్న సమయంలో వచ్చే తలనొప్పి కారణం? బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవడమే. అటువంటి సమయంలో ఏదైనా ఒక ఎనర్జీ డ్రింక్ ను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమం చేస్తుంది.

ఉపసంహరణ లక్షణాలు: మీరు పొగత్రాగేవారైనా లేదా కెఫిన్ కు పూర్తిగా బానిస అయినా..అప్పుడు మీరు గర్భధారణ సమయంలో వచ్చే తలనొప్పితో పోరాడవల్సిందే. మీ డాక్టర్ మీకు పొగత్రాగడం మానేయమని లేదా కెఫిన్ తగ్గించమని సలహా ఇస్తారు. మీ తలనొప్పికి ఈ ఉత్ప్రేరకాలు మానివేయడం వల్ల బహుశా మీ తలనొప్పిని నివారించుకోవచ్చు.

శబ్ధం వల్ల వచ్చే తలనొప్పి: గర్భధారణ సమయంలో మీరు మరింత సున్నితంగా మారడం వల్ల పెద్ద శబ్ధాలు, ఎక్కువ మాట్లాడటం మరియు ట్రాఫిక్ వల్ల తలనొప్పికి కారణం కావచ్చు. తలనొప్పి నివారించుకోవడానికి ఏకైక మార్గం. మిమ్మల్ని మీరు నిశ్శబ్దంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఆఫీసులో ఉన్నట్లైతే, కాలీగా ఉన్న మీ ఆఫీస్ కాన్ఫరెన్స్ రూమ్ మీరు రిలాక్స్ పొందడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక వేళ మీరు ఇంట్లో ఉంటే కనుక మీరు మీ ఇంట్లో టెలివిజన్ ను స్విచ్ ఆఫ్ చేయండి. అలాగే లైట్లు కూడా ఆఫ్ చేసి కొద్ది సమయం రిలాక్స్ అవ్వండి .

ఇవే గర్భధారణ సమయంలో మిమ్మల్ని బాధించే కొన్ని ప్రధానమైన తలనొప్పులు..కాబట్టి గర్భధారణ సమయంలో తలనొప్పి ఎందు వల్ల వస్తుందో కనిపెట్టిం అందుకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా ముఖ్యం.

English summary

Causes n Cures Of Pregnancy Headaches

Pregnancy is a time when you start getting used to aches and pains. Headaches is one of the pains that you have to suffer during pregnancy. Your pregnancy headaches may not be as severe as back pain or sore feet but they are equally inconvenient.
Story first published: Monday, June 3, 2013, 15:22 [IST]
Desktop Bottom Promotion