For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అబార్షన్ జరిగనప్పుడు ముఖ్యంగా తినాల్సిన ఆహారాలు

|

గర్భస్రావం అనేది కొంత మంది మహిళల్లో సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా వారికి తెలియకుండానే జరగడం వల్ల వారిలో ఒక బాధాకరమైన అనుభవం ఎదురౌతుంది. గర్భం తర్వాత దశలో గర్భస్రావం జరుగుతుంది. దాన్ని మరింత బందించడానికి అవుతుంది. అదీ కాక మానసికంగా గాయం చేస్తుంది, గర్భస్రావం పొందిన మహిళ శరీరంలో కూడా చాలా గాయాలపాలవుతుంది. ఫలితంగా చాలా వరకూ రక్తాన్ని కోల్పోవడం మరియు దాని వల్ల ఆరోగ్యప్రభావం పూర్తిగా పరిమితమై ఉంటుంది.

కాబట్టి గర్భస్రావం జరిగిన సమయంలో మన శరీరంలో కోల్పోయిన అన్ని పోషకాలను భర్తీ చేయడానికి సరైన డైట్ ను తీసుకోవడం చాలా అవసరం. గర్భస్రావం తర్వాత, కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు మహిళలకు చాలా అవసరం. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల, గర్భ స్రావం వల్ల కోల్పోయిన న్యూట్రీషియన్స్ తిరిగి మీ శరీరం పొందడానికి సహాయపడుతుంది. దాంతో మీరు త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. గర్భస్రావం జరిగిన సమయంలో మీరు తీసుకొనే ఆహారం పూర్తి పోషకమైనదిగా మరియు మానసింకంగా మీరు తీసుకోవడానికి సౌకర్యంగా ఉండాలి.

ఇక్కడ గర్భస్రావం సమయంలో డైట్ విషయంలో ప్రాధమిక అంశాలు కొన్ని మీకోసం.

పాలు:

పాలు:

గర్భధారణ సమయంలో అధిక క్యాల్షియం అవసరం అవుతుంది. దాంతో శరీరంలో క్యాల్షియం మొత్తం గర్భం పొందడానికి సరిపోతే, మరి గర్బస్రావం జరిగినప్పుడు ఆ పూర్తి క్యాల్షియం వ్రుదా అవుతుంది. అలాగే మహిళల ఎముకల్లో చాలా సులభంగా క్యాల్షియం తగ్గిపోతుంది. అందువల్లే, గర్భధారణ సమయంలో పాలు చాలా ముఖ్యమైన ఆహారంగా తీసుకుంటారు . అదేవిధంగా గర్భస్రావం జరిగిన సమయంలో కూడా రెండు మూడు గ్లాసుల పాలు తప్పనిసరిగా తీసుకోవడం చాలా అవసరం. పాలు తాగడం వల్ల మీ శరీరం తిరిగి కోలుకోవడానికి సరిపడే క్యాల్షియం, ప్రోటీలను, మరియు ఫాస్ఫరస్ శరీరానికి అందుతుంది.

డైరీ ప్రొడక్ట్స్:

డైరీ ప్రొడక్ట్స్:

పెద్దవారిలో ఒక పెద్ద సమస్య పాలు తాగడానికి చాల మంది ఇష్టపడరు. అటువంటి వారు పాలకు ప్రత్యామ్నాయంగా డైరీప్రొడక్ట్స్, కాటేజ్ చీజ్, పెరుగు వంటివి తీసుకోవచ్చు. ఎలాగైనా సరే, ఏమార్గంలోనైనా సరే మీ శరీరానికి తగినతం క్యాల్షియం అందేలా చేయాలి.

గ్రీన్ లీఫీ వెజిటేబుట్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుట్స్:

గర్భస్రావం వల్ల అధిక రక్తాన్ని కోల్పోవడం జరగుతుంది. అటువంటి సమయంలో ఐరన్ పూర్తిగా లోపిస్తుంది. కాబట్టి మీ ఆరోగ్యానికి కావల్సిన ఐరన్ ను తిరిగి పొందడానికి, అధికంగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ముఖ్యంగా సలాడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

రెడ్ మీట్ మరియు లివర్:

రెడ్ మీట్ మరియు లివర్:

రెడ్ మీట్ మరియు లివర్ అధికంగా ఐరన్ ఉన్నటువంటి ఆహారాలు. మీకు బలాన్ని చేకూర్చే ఇటువంటి ఆహారాలను గర్భస్రావం జరిగినప్పుడు తప్పనిసరిగా తీసుకోవల్సి ఉంటుంది. గర్భస్రావం తర్వాత రక్తహీనత సమస్యను ఎదుర్కోకుండా ఉండాలంటే మీరు రెడ్ మీట్ లివర్ వంటివి మీరు తప్పనిసరిగా తీసుకోవాలి.

గుడ్లు:

గుడ్లు:

గర్భస్రావం జరిగిన తర్వాత మీ శరీరం చాలా వీక్ గా తయారవుతుంది. కాబట్టి మీకు బలాన్ని చేకూర్చే ఇటువింటి ఆహారాలను తీసుకోవచం చాలా మంచిది. గుడ్డు నుండి మీ శరీరానికి అవసరమయ్యే ఫ్యాట్స్, ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ ను పుష్కలంగా అందిస్తుంది. వీక్ నెస్ ను బీట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఫుడ్ గా చెప్పవచ్చు.

సౌకర్యవంతమైన ఆహారాలు:

సౌకర్యవంతమైన ఆహారాలు:

గర్భస్రావం జరిగినప్పుడు పూర్తిగా శక్తిని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వేగించిన చికెన్ లేదా ఉడికించిన బంగాళదుంప చిప్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి హాని జరగదు. వీటిని తీసుకోవడం వల్ల ఏ ఇతర న్యూట్రీషియన్స్ జోడించకపోయినా, ఇటువంటి కొన్ని రుచికరమైన, సౌకర్యవంతమైన ఆహారాలను తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితి బాగుంటుంది.

English summary

Diet Basics During A Miscarriage

A miscarriage is usually a traumatic experience for a woman. And if the miscarriage takes place at a later stage in pregnancy, it becomes all the more threatening. But apart from the emotional trauma, your body also goes through a lot of physical trauma during miscarriage.
Desktop Bottom Promotion