For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణ సమయంలో తినకూడని.. తినవల్సిన ఆహారాలు...!

|

మహిళలు గర్భం దాల్చిన తర్వాత సాధారణంగా కంటే ఎక్కువగా ఆకలి వేస్తుంటుంది. ఇలా ఎక్కువగా ఆకలి వేయడాన్ని సాధారణంగా గర్భం దాల్చిన మొదటి త్రైమాసిక సమయంలో(మొదటి మూడు నెలల్లో) గమనించవచ్చు. ఆ సమయంలో నిరంతరం ఏదోఒకటి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తినేటటువంటి ఆహారం కూడా ఒక నిర్థిష్టమైన వాటిపైనే అధికంగా చూపిస్తుంది. ఉదాహరణకు.. చాలా మంది గర్భిణీ స్త్రీలు ఎక్కువగా స్వీట్స్, కారంగా ఉన్న చిరుతిండ్లు లేదా జంక్ ఫుడ్స్ తినడానికి అమితంగా కోరికలను కలిగి ఉంటారు.

చాలా వరకూ ఎక్కువ మంది మహిళలు ఎల్లప్పుడూ జంక్ ఫుడ్స్ పట్ల ఎక్కువ ఇష్టం కలిగి ఉంటారు. అయితే మహిళలు గర్భం దాల్చాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారం పట్ల జాగ్రత్త వహించాలి. ఎక్కువ కారంగా ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగజేస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ లేదా చాట్స్ లేదా బర్గర్స్ వంటివి బయట స్ట్రీట్ ఫుడ్ పట్ల ఎక్కువ ఇష్టం కలిగి ఉండటం వల్ల వాటిలో హై క్యాలరీలు ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయి.

అందువల్ల, గర్భాధారణ సమయంలో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల తల్లి బిడ్డకు ఇద్దరికీ క్షేమం. గర్భాధారణ సమయంలో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ మీద ఎక్కువ కోరిక కలిగి ఉన్నట్లైతే... ఇక్కడ కొన్ని మీకోసం గర్భిణీ స్త్రీ తినవల్సిన ఆహారాలు మరియు ఖచ్చితంగా కొన్ని ఆహారాలకు దూరంగా ఉండవలసిన వాటు గురించి తెలుసుకుందాం...

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

కార్బోనేటెడ్ డ్రింక్స్: ముఖంగా గర్భిణీ స్త్రీ కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే సోడా లేదా కోల్డ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో అధిక క్యాలరీలు వచ్చి చేరుతాయి. మరయు గ్యాస్ ఏర్పడుతుంది.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

ప్రొసెస్డ్ మీట్: ప్రొసెస్డ్ మీట్(తాజాగా కానీ మాంసాహారం). తాజాగా లేని మాంసాహరం అంటే రాత్రి వండినది, లేదా ఒక రోజు లేదా రెండు రోజుల ముందు వండిన మాంసాహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. వీటిని బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్ల వీటికి దూరంగా ఉండటం మంచిది. అందుకోసం మాంసాహారాలతో తయారయ్యే జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ను బయట తినడం మానేయండి.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

పెరుగు: డైరీప్రొడక్ట్స్ లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తప్పకుండా పాలు, పెరుగు తీసుకోవడం వల్ల వారి ఎముకలు దృఢంగా ఉంటాయి.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

గోధుమలు: గోధుమలతో తయారు చేసే వంటలో ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో అధికంగా న్యూట్రీషియలన్స్ మరియు ఫైబర్ ఉండటం వల్ల అతి సులభంగా జీర్ణం అవుతుంది.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

ఫ్రోజొన్ ఫుడ్స్(ప్యాక్డ్ ఫుడ్స్): వీటిలో శరీరానికి హాలి కలిగించే ఉప్పు అధికంగా ఉండటం వల్ల వీటిని తినకుండా పూర్తిగా నివారించడం మంచిది.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

పాక్ చేసిన నూడిల్స్: ఫాస్ట్ ఫుడ్ తయారు చేయడం చాలా సులభం. అియతే వీటిలో అధికశాతంలో ఉప్పు, క్యాలరీలు, ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి వీటికి గర్భిణీ స్త్రీలు పూర్తిగా దూరంగా ఉండాలి.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

చీజ్: లోఫ్యాట్ చీజ్ లో లోక్యాలరీలు, ఎక్కువ క్యాల్షియం ఉంటుంది. కాబట్టి గర్భణీ స్త్రీలు తినవచ్చు.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

జ్యూసులు: క్యారెట్, బీట్ రూట్ మరియు ఫ్రూట్ జ్యూసులను రెగ్యులర్ గా తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. గర్భాధారణ సమయంలో శరీరానికి కావల్సిన న్యూట్రిన్స్ వీటినుండి అందుతాయి.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

క్యారెట్: క్యారెట్ లో అధికశాతంలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణకు కూడా బాగా సహాయపడుతుంది. కాబట్టి గర్భాధారణ సమయంలో మీరు గ్లోయింగ్ స్కిన్ మెయింటైన్ చేయాలనుకుంటే క్యారెట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

పండ్లు: అరటి, ఆపిల్, ఆరెంజ్, నిమ్మర, బేరి వంటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఏదైనా తినాలనిపిస్తే ఇటువంటి పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. పపాయ, పైనాపిల్ వంటి వాటికి దూరంగా ఉండండి.

గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

సలాడ్స్: సలాడ్స్ తాజావి మరియు పోషకాలు అందించేవి, ఆరోగ్యానికి క్షేమకరం. సలాడ్స్ ను తరచూ తీసుకోవడం వల్ల విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అధికంగా శరీరానికి అందుతాయి.

English summary

Fast Foods To Eat And Avoid During Pregnancy | గర్భాధారణ సమయంలో తినకూడని..ఆహారాలు...!

When you are pregnant, you often have lots of food cravings. This is most commonly observed during the first trimester of the pregnancy. The urge to eat something makes a pregnant woman restless. However, food cravings can be towards a particular dish or towards any thing. For example, many pregnant women have the cravings to eat sweet, spicy or junk food.
Story first published: Monday, January 7, 2013, 15:38 [IST]
Desktop Bottom Promotion