For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలకు రక్తం లేకపోతే తప్పక తినాల్సిన 15 ఆహారాలు..!

|

ప్రస్తుతం మహిళలను వేధిస్తోన్న సమస్య ఎనీమియా (రక్తహీనత). లేచింది మొదలు గొడ్డు చాకిరీ చేసే మహిళలకు రోజంతా... పనితోనే సరిపోతుంటే ఇక తినేందుకు సమయమెక్కడ ఉంటుంది చెప్పండి. ఒకవేళ ఉన్నా ఆ... ఏం తింటాలే... అని ఊరుకునే మహిళలు ఎంతమందో..! దీని ఫలితమే రక్తహీనత. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, 15-45 సం.వయస్సు గల స్త్రీలు, 11 సం.ల లోపు పిల్లలలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది.

మన శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హీమోగ్లోబిన్ అనే పదార్థం. ఇది తయారవడానికి మాంసకృత్తులతో పాటు ఇనుము అనే పోషక పదార్థం ముఖ్యంగా అవసరం. మన శరీరంలో హీమోగ్లోబిన్ పరిమాణం ఒక మోతాదులో (16 mg%) ఉంటుంది. ఒక వేళ హీమోగ్లోబిన్ మోతాదు ఈ విలువల కన్నా తగ్గితే రక్త హీనతతో వారు బాధపడుతున్నట్లు పరిగణించవచ్చు. రక్తహీనతకు (అనీమియా) గురైన వ్యక్తి శరీ రంలో ఎర్ర రక్త కణాలు (రెడ్‌బ్లడ్‌సెల్స్‌- ఆర్‌ బిసి- లేదా ఎరిత్రోసైట్స్‌) సంఖ్య తగ్గిపోతుంది.

కారణాలు : స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత - రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.
1.పౌష్టికాహార లోపం - ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.
2.రక్తం నష్టపోవడం - స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో పొట్టపురుగులు ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.
3.రక్తం తయారీలో అవరోధం - జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు...దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.

లక్షణాలు : బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం. 1) నాలుక, కనురెప్పలలోపలి భాగాలు పాలిపోవడం, 2) అలసట, 3) చికాకు, 4) ఆకలి లేకపోవడం, 5) మైకం, కళ్ళు తిరగడం, 6) అరచేతుల్లో చెమట, 7) చేతుల గోళ్ళు వంగి గుంటలు పడడం 8) పాదాలలో నీరు చేరడం, 9) చిన్న పిల్లల్లో అయితే చదువులో అశ్రద్ధ, ఆటల్లో అనాసక్తి, నీరసం.

రక్త హీనత వల్ల కలిగే దుష్పరిణామాలు: బలహీనత, గర్భస్రావం, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డ లేదా తల్లి చనిపోవడం, పనిచేసే సామర్థ్యం తగ్గుదల, రోగాలు తేలికగా వెంటవెంటనే రావడం, చదువులో వెనుకపడడం, ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, ఆటలు ఆడలేకపోవడం మైదలైనవి.

గర్భిణీలో కలిగే రక్తహీనత అరికట్టడానికి, గర్భంలో పిండం ఎదగటానికి, గడువుకు మందుగా ప్రసవించడం నివారించడానికి, అతి తక్కువ బరువు ఉన్న శిశువును ప్రసవించకూడదనుకుంటే గర్భిణీలు ఐరన్‌తోపాటు, ఫోలినిక్‌ యాసిడ్‌ అవసరం. గర్భిణీ స్త్రీ అన్ని రకాల విటమిన్లు తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ సి కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. 'బి' కాంప్లెక్స్‌, ఇతర విటమిన్ల కొరకు గర్భిణీ అన్నీ రకాల ఆకుకూరలు, కూరగాయలు, మాంసం , చేపలు, గుడ్లు తీసుకోవాలి. అన్నం తక్కువ తిన్నా ఫరవాలేదు కానీ తగిన పోషక విలువలు గల పదార్థాలు తీసుకోవాలి.

బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా, సక్రమమైన బరువు వుంటే ఎటువంటి ఇబ్బందులు కలగవు. అబార్షన్ కు గురిఅయ్యే ఆహారాలకు ఉదా: కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. పాలు కూడా తగుమోతాదులో మాత్రమే తీసుకోవాలి. పాలను భోజనం సమయంలో కాకుండా భోజనానికి-భోజనానికి మద్య తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి రక్తహీనత లేకుండా గర్భిణీ ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు ఇక్క 15 న్యూట్రిషియన్స్ ఆహారాలను అంధిస్తున్నాం. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చి రక్తహీనతను నివారించుకోండి...

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

అరటిపండు: బిడ్డను ప్రసవంచే సమయంలో మహిళల మరణాలకు కారణం ఐరన్ లోపించటం, రక్తహీనత ఏర్పడటం. ఈ రకమైన దుర్ఘటనలను ఎదుర్కొనకుండా వుండటానికి గాను గర్భిణీ స్త్రీలకు అరటిపండు తినాలని వైద్యులు సూచిస్తారు. గర్భవతికి అధిక శక్తి కావాలి. అరటిపండు అధిక శక్తినిస్తుంది. అనేక విటమిన్లు వుంటాయి. ప్రతిరోజూ గర్భిణీ స్త్రీ రెండు అరటిపండ్లు తింటే ఐరన్ కొరతతో వచ్చే రక్తహీనత నివారించవచ్చు. అరటిపండులో గర్భవతికి అవసరమైన ఫోలిక్ యాసిడ్ కూడా వుంటుంది. ఇది కడుపులోని పిండానికి కూడా ఆవశ్యకమే అంటారు వైద్యులు. గర్భిణీ స్త్రీకి ఉదయ వికారం కలుగకుండా విటమిన్ బి 6 అవసరం. విటమిన్ బి 6 అరటిపండులో వుంటుంది.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

కర్జూరం: హీమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడంలో కర్జూరాలు చాలా అద్భుతంగా సహాయపడుతాయి. డేట్స్ ను అప్పుడప్పుడు తీసుకోవడం కంటే, ఒక రోజులో రెండు సార్లు రెండు రెండు డేట్స్ ను తీసుకోవడం చాలా అవసరం.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

ఓట్ మీల్: గర్భధారణ సమయంలో ఓట్ మీల్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల రక్తహీనతతో పోరాడుతుంది. ఓట్ మీల్ చాలా సులభంగా జీర్ణం అయ్యే ఆహారం. అంతే కాదు ఇందులో గర్భిణీ స్త్రీకి అవసరం అయ్యే పోషకాలు మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

నట్స్: నట్స్ లో రక్తహీనతను నివారించే పుష్కలమైన ఐరన్ అంశం ఉంది. మరియు గర్భం పొందడానికి తీసుకోవల్సిన ఆహారాల్లో ఇవి టాప్ లిస్ట్ లో ఉన్నాయి. మీరు వర్కింగ్ ఉమెన్ అయితే వీటిని మీ వెంట తీసుకెళ్ళి తినడం చాలా మంచిది.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

బ్రొకోలీ: ఇది ఒక హెల్తీ సూపర్ ఫుడ్. ఇందులో వివిధ రకాల విటమిన్లు మరియు ప్రోటీనలు, ఐరన్, ఫొల్లెట్, పుష్కలంగా ఉంటాయి . గర్భధారణ సమయంలో అలసటతో పోరాడో ఆహారల్లో ఇది ఒక అద్భుతమైన ఆహారం.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

రెడ్ మీట్: గర్భధారణ సమయంలో రక్తహీనతతో పోరాడాలంటే రెడ్ మీట్ ను మీ డైట్ లిస్ట్ లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో పుష్కలంగా ఐరన్ ఉంది కాబట్టి.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

ఆకు కూరలు: విటమిన్స్, మినిరల్స్, మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ లో ఆకుకూరలు కూడా ఒకటి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. మరియు ఇవి అలసటను దరిచేరనివ్వకుండా పోరాడుతాయి. ఆకుకూరల్లో ఉండే ఫొల్లెట్ అనీమియాతో పోరాడుతాయి.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

దానిమ్మ: రెడ్ జ్యూస్ ఫ్రూట్స్ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతాయి. అంతే కాదు అలసటతో పోరాడుతాయి . మరియు బాడీ మెటబాలిజంను పెంచుతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో అనీమియాతో పోరాడవచ్చు.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

ఎండు ద్రాక్ష: ఎండు ద్రాక్ష. రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు ఎండు ద్రాక్ష ఒక అద్భుత ఆహారం. ఎండు ద్రాక్ష కొన్నింటిని నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం తాగాలి. అనీమియాకు మంచి ఉపశమనం.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

గుడ్డు: గుడ్డులో కావల్సినంత, మరియు మంచి ఐరన్ ఉంటుంది. రెగ్యులర్ గా గుడ్డును తినడం వల్ల రక్తంలోని హీమోగ్లోబిన్ నార్మల్ కండీషన్ లో ఉండటానికి సహాయపడుతుంది.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

చిరు ధాన్యాలు: గర్భధారణ సమయంలో రక్తహీనత బారీన పడకుండా, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చిరు ధాన్యాలు శరీరంలోని రక్తంలోని హీమోగ్లోబిన్ ను నార్మల్ రేంజ్ లో ఉంచుతుంది.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

చేపలు: సీఫుడ్ లో గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఎసెన్సియల్ యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండి గర్భణీ స్త్రీలకు మేలు చేస్తాయి.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

తేనె: గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడే స్త్రీలకు వారి డైట్ లో తేనె చేర్చుకోమని సలహా ఇస్తుంటారు వైద్యులు. అంతే కాదు ఇందులో పుష్కలమైన ఐన్ అంశం కూడా ఉంది. దీన్ని అలాగే లేదా డ్రై ఫ్రూట్స్ తో మిక్స్ చేసి తీసుకోవచ్చు.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

లెగ్యుమ్స్: పప్పుధాన్యాలు మరియు బీన్స్ వంటి వాటిలో ఐరన్ పుష్కలంగా ఉండి రక్తహీనత ఏర్పడకుండా కాపాడుతాయి. కాబట్టి, ప్రెగ్నెన్సీ డైట్ లో లెగ్యుమ్స్ ను చేర్చుకోవాలి.

రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు 15 ఐరన్ రిచ్ ఫుడ్స్...!

ఆరెంజ్ జ్యూస్: సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి. ఇందులో ఉండి విటమిన్ సి ఐరన్ శోషణ బాగా సహాయపడుతుంది. అంతే కాదు, ఈ విటమిన్ సి అనీమియాతో పోరాడుతుంది.

English summary

Foods To Fight Anaemia In Pregnancy

Anaemia is a condition where there is a decrease in the number of red blood cells, or in the normal quantity of haemoglobin in the blood. Anaemia is a common health condition during pregnancy
Desktop Bottom Promotion