For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భణీ స్త్రీల అలసటను నివారించి..ఉత్సాహంగా ఉంచే ఆహారాలు..!

|

గర్భధారణ సమయంలో, మహిళలు చాలా సులభంగా అలసటకు గురిఅవుతారు. అంతే కాదు నిద్ర వచ్చినట్లు కూడా వారు ఫీల్ అవుతుంటారు . ఈ బద్దక సంకేతాలే అలసటకు ముఖ్య కారణం. చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో ఎక్కువగా అలసటకు గురైనట్లు చెబుతుంటారు. చాలా నీరసంగా, బద్దకంగా, అలసటతో , నిదానమైన మరియు ఎనర్జీ చాలా తక్కువగా ఉన్నట్లు ఈ లక్షణాలన్నీ కూడానూ గర్భధారణ సమయంలో చాలా సాధారణంగా ఉంటాయి. ఈ లక్షణాలను ఎక్కువగా ఫస్ట్ సెమిస్టర్(మొదటి మూడు నెలలు)మరియు థర్డ్ సెమిస్టర్ (చివరి మూడు నలల్లో) గమనించవచ్చు.

చాలా మంది మహిళలు ప్రసవం తర్వాత చాలా బలహీనంగా భావిస్తారు. మానసిక, శారీరిక మరియు హార్మోన్ల మార్పులు వీటివల్లే గర్భధారణలో మహిళలు ఎక్కువ అలసటకు గురి అవుతుంటారు. ఇంకా వికారం మరియు మార్నింగ్ సిక్ నెస్ వంటివి ఆ రోజు గడవడాని మరింత నిదానమైన అనుభూతిని కలిగజేస్తుంది.

గర్భం ధరించిన మొదటి మూడు నెలలు, హార్మోనుల మార్పుల వల్లే వికారానికి, వేవిళ్ళు, మరియు ప్రొజిస్టిరాన్ హార్మోనుల ఉత్పత్తి, ఇవన్నీ కూడా గర్భిణీ స్త్రీల వికారానికి కారణం అవుతుంది. ఇక థర్డ్ సెమిస్టర్ లో గర్భి ణీ స్త్రీ యొక్క బరువు అధికంగా ఉండటం చేత , గర్భిణీ స్త్రీ తన బరువుతో పాటు తన కడుపులో శిశువు బరువును కూడా మోయడం వల్ల వెన్ను నొప్పి, నిద్రలేమి, తిమ్మిరులు, మరియు కాళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా మీ ఆలసత్వ అనుభూతికి కలిగిస్తుంది.

అలసట నివారించుకోవడానికి ప్రీనేటల్ కేర్ చాలా చాలా ముఖ్యం. గర్భధారణ సమంయలో, మీరు మంచిగా ఆలోచించాలి, మీ శరీరంలో ఏర్పడే మార్పులకు అనుగుణంగా మీరు తీసుకొనే ఆహారంలో మార్పలు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన ఆహారాలు తీసుకోవడం గర్భధారణ సమయంలో చాలా మంచిది. అవి అలసటతో పోరాడుతాయి. అంతే కాదు కొత్త తల్లికి కావల్సిన ఎనర్జీ లెవల్స్ ను అంధిస్తాయి. హెల్తీ ప్రీనేటల్ డైట్ తో పాటు మహిళలు తమంతట తాము జాగ్రత్తలు తీసుకుంటూ తగినంత నిద్రను పొందాలి. నిద్రలేమి కూడా హార్మోనుల అసమతుల్యతకు కారణం అవుతుంది. సరైన నిద్ర పొందడం వల్ల కూడా అలసటను నివారించుకోవచ్చు. మీరు రిఫ్రెష్ గా ఉండవచ్చు. గర్భధారణ సమయంలో అలసటను పోగొట్టే కొన్నే ఎనర్జిటిక్ ఫుడ్ మీరు తెలుసుకోవడానికి...

సీఫుడ్:

సీఫుడ్ లో గర్భిణీ స్త్రీలకు అవసరం అయ్యే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి మరియు ఎసెన్సియల్ యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండి గర్భణీ స్త్రీలకు మేలు చేస్తాయి.

పెరుగు:

పెరగులో క్యాల్షియం మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. పెరగులో ఉండే ప్రొబైటిక్ బ్యాక్టీరియా అలసటతో పోరాడుతాయి మరియు జీవక్రియను శుభ్రం చేస్తాయి.

ఆకు కూరలు:

విటమిన్స్, మినిరల్స్, మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే సూపర్ ఫుడ్స్ లో ఆకుకూరలు కూడా ఒకటి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం. మరియు ఇవి అలసటను దరిచేరనివ్వకుండా పోరాడుతాయి.

అరటి పండు:

అరటపండులో ఫొల్లేట్ లేదా ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని ప్రీనేటల్ విటమిన్లుగా భావిస్తారు. ఫ్లోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు శరీరంలో హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచి, బాడీ పెయిన్స్ ను తగ్గిస్తాయి. ఇంకా పుట్టుక లోపాలను నిరోధిస్తుంది.

మెంతి ఆకులు:

గర్భధారణ సమయంలో శరీరం నీరసంగా మారుతుంది. కాబట్టి ఆరోగ్యంగా మరియు బలంగా ఉండాలంటే క్యాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇవి అలసటతో పోరాడుతుంది మరియు కొత్త తల్లిలో ఎముకల సాంద్రత పెంచుతుంది. మెంతి ఆకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంది.

బాదాం :

బాదాంలో యాంటిఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉండి, బాడీ మెటబాలిజంను పెంచుతుంది, ఆకలి కోరికను తగ్గిస్తుంది మరియు కడుపు పిండం ఆరోగ్యంగా పెరగడానికి బాగా సహాయపడుతుంది.

ఆరెంజ్:

సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి.

కిడ్నీ బీన్స్:

గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్నట్లైతే, రక్తంలోని హీమోగ్లోబిన్ కౌంట్ పెంచుకోవడానికి ఈ కిడ్నీ బీన్స్ చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో ఉండే ఐరన్ పోస్ట్ నేటల్ స్టేజ్ సేఫ్ గా ఉండేలా సహాయపడుతుంది.

టోఫు:

పన్నీర్ కు మరో ప్రత్యామ్నాయం టోఫు. ఇది ఆరోగ్యకరమైనది. ఇది లో క్యాలరీలను కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది . టోఫు కడుపు నిండేలా చేస్తుంది మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. గర్భధారణ సమయం అలసటను నుండి విముక్తి పొందాంటే టోఫును మీ డైట్ లో చేర్చుకోవాలి.

బార్లీ:

బార్లీలో ఐరన్ పుష్కలం. గర్భధారణ సమయంలో అలసటను నివారించండానికి ఒక మంచి ఆహారం ఇది.

క్యారెట్స్:

క్యారెట్స్ లో విటమిన్ ఎ మరియు ఫొల్లేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కాబోతున్న తల్లికి చాలా ముఖ్యం. క్యారెట్స్ అలాగే పచ్చివాటిలా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.

ముల్లంగి దుంప:

క్యాల్షియం లోపించడం వల్ల అనేక ఆనారోగ్య వ్యాధులకు కారణం అవుతుంది మరియు గర్భధారణ సమయంలో అలసటకు గురిచేస్తుంది. గర్భధారణ సమయంలో బలంగా ఉండటానికి ఇవి బాగా సహాయపడుతాయి.

దానిమ్మ:

రెడ్ జ్యూస్ ఫ్రూట్స్ శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతాయి. అంతే కాదు అలసటతో పోరాడుతాయి . మరియు బాడీ మెటబాలిజంను పెంచుతాయి.

గోధుమలు:

గోధుమలు మంచి పోషకాంశాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ ఆహారాలు తీసుకోవడం వల్ల అలసట అనుభూతిని పొందుతారు. అంతే కాదు తిన్న ఆహారాన్ని విచ్చిన్నం చేసి జీర్ణం చేయడానికి జీర్ణక్రియకు ఎక్కువ శక్తి కావాలి. కాబట్టి, లైట్ ఫుడ్, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

బ్రొకోలి:

ఇది ఒక హెల్తీ సూపర్ ఫుడ్. ఇందులో వివిధ రకాల విటమిన్లు మరియు ప్రోటీనలు పుష్కలంగా ఉంటాయి . గర్భధారణ సమయంలో అలసటతో పోరాడో ఆహారల్లో ఇది ఒక అద్భుతమైన ఆహారం.

English summary

Foods To Fight Fatigue In Pregnancy

During pregnancy, a woman can easily feel tired and sleepy. These lazy conditions are termed as fatigue. Most of the women complain of suffering from fatigue during pregnancy. Feeling weak, lazy, tired, sluggish and low on energy are very common during pregnancy.
Story first published: Thursday, June 6, 2013, 15:50 [IST]
Desktop Bottom Promotion