For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం ధరించిన మొదటి 3నెలలు ఈ ఆహారం చాలా అవసరం...!

|

గర్భం ధరించిన మొదటి మూడు నెలలో చాలా ముఖ్యమైన దశ. గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత వహించాలి. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రత్యేకంగా నిబంధనలతో ప్రెగ్నెన్సీ డైయట్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భం ప్రోటీన్ మరియు క్యాల్షియం ఆహారాలను ప్రధానంగా చేసుకుంటుంది. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

మొదటి మూడు మాసాల్లో తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీనులు ఒక జీవికి ప్రాణం పోస్తుందనడంలో ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతే కాదు మొదటి మూడు నెలల్లో కడుపులో బిడ్డ పరిమాణం కూడా వేగంగా పెరుతుంది. మొదటి మూడు నెలల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం చాలా అవసరం. కడుపులో బిడ్డ తల్లి యొక్క రక్తం శోషణ ద్వారా పెరుగుతుంది. అందుచేత మీరు మీ గర్భం ధరించిన ప్రారంభ దశలో క్యాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం.

ప్రెగ్నెన్సీ మహిళలకు గుడ్డు అత్యుతమ ఆహారం. ఇది తల్లికి పూర్తి పోషణ అందిస్తుంది. కాబట్టి మొదటి మూడు నెల్లో తీసుకోవల్సి అటువంటి అత్యుత్తమ ఆహారాలను పరిశీలించండి....

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

ఆకుకూరలు: ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

బాదాం: బాదాంలో విటమిన్ ఇ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ మరియు ప్రోటీనులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా బాగా సహాయపడి గర్భిణీ స్త్రీ మరికొన్ని అదనపు ప్రోటీనులను మొదటి మూడు నెలల్లో పొందుతుంది.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

చికెన్: మార్నింగ్ సిక్ నెస్(కడుపులో తిప్పడం, నీరసంగా ఉండటం, వాంతి వచ్చేట్లు ఉండటం) ఉన్నట్లైతే చికెన్ బెస్ట్ ఆప్షన్ గా చెబుతారు. ఇందులో అధిక శాతంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

ఆస్పరాగస్: మీకు తెలిసే ఉంటుంది. డి విటమిన్ వల్లే మన శరీరంలో క్యాల్షియం ఉత్పత్తి అవుతుందని. ఆస్పరాగస్ లో డి విటమిన్ పుష్కలంగా ఉండి. మరియు ఇందులో ఉండే ఆరోమాటిక్ ఫ్లేవర్ మార్నింగ్ సిక్ నెస్ ను పోగొడుతుంది.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

బెండకాయ: బెండకాయ అరుదుగా తింటారు. అయితే ఇందులో ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. బెండకాయలోని ఫోలిక్ యాసిడ్స్ పుట్టుకతో లోపాలను నిరోధిస్తుంది. మరియు ఇది గర్భధారణ సమయంలో మధుమేహానికి గురైయ్యే మహిళలకు చాలా మంచి చేస్తుంది థ ఫోలిక్ యాసిడ్.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

ఆరెంజ్: ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. మరియు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

బ్రొకోలి: బ్రొకోలీ గ్రీన్ సూపర్ ఫుడ్. దీని వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని మొదటి మూడు నెలలు తీసుకోవడం చాలా మంచిది. దీని తినడం వల్ల తల్లికి కావల్సిన ఐరన్ అంధించడమే కాకుండా అధిక రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

గుడ్డు: గుడ్లు: అత్యధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగినటువంటి గుడ్లలో విటమిన్ డి మరియు విటమిన్ బి12 మరియు ప్రోటీనులు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి వీటిని తరచూ ఆహారంతో తీసుకోవడం చాలా ముఖ్యం.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

సాల్మన్: చేపలు: గర్భాధారణ సమయంలో చాలా మంది సీ ఫుడ్ (ఫ్రాన్, క్రాబ్స్) తినడానికి ఇష్టపడరు. అయితే సీ ఫిష్ లో సాల్మన్, తున మరియు క్యాట్ ఫిష్ వీటిలో విటమిన్ డి మాత్రమే కాదు కాల్షియం, ఒమేగా 3 ఫాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి కాబట్టి మొదటి మూడు నెలలు చేపలు తినడం మంచిది.

గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

పెరుగు: డైరీ ప్రొడక్ట్స్ లో అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. సాధారణంగా పాలు తీసుకొనే కంటే పెరుగు, మజ్జిగా తీసుకోవడం చాలా మంచిది. కొంత మందికి పాలు త్రాగడం ఇష్టం ఉండదు. అటువంటి వారు మజ్జిగ పెరుగు తీసుకోవడం వల్ల కడుపు ప్రశాంతంగా ఉంటుంది.

English summary

Foods To Have In The First Trimester | గర్భిణీ మొదటి 3నెలలు తినాల్సిన అత్యుత్తమ ఆహారాలు..!

The first trimester of pregnancy is a very important phase. You need to very careful about your nutritional needs during these early months of your pregnancy. Most pregnancy diets make special provision for the foods to be consumed in the first trimester. Your pregnancy diet for the first trimester is basically rich in protein and calcium. It helps your baby grow at a faster pace. 
Story first published: Friday, March 15, 2013, 16:02 [IST]
Desktop Bottom Promotion