For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణ సమయంలో గ్యాస్ట్రిక్ కు కారణం అయ్యే ఆహారాలు...!

|

గ్యాస్టిక్ సమస్యతో ప్రతి ఒక్కరూ బాధపడుతుంటారు. అది అప్పుడే పుట్టిన పిల్లలు కావచ్చు. పెద్దలూ కావచ్చు. గాస్ట్రిక్ సమస్య రావడానికి వయస్సుతో సంబంధం లేదు. చాలా రకాల ఆహారాలు గ్యాస్ట్రిక్ సమస్యకు కారణం అవుతున్నాయి. ఇంకా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీస్తుంది. ఉదహారణకు ఆహారం తీసుకొనేటప్పుడు సరిగా నమలకపోవడం లేదా తినేసమయంలో ఆహారంతో పాటు, గాలిని మింగడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ కు కారణం అవుతుంది. గర్భాధారణ సమయంలో కొన్నిఆహారాలను తీసుకోవడం వల్ల కూడా గర్భిణీకి గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఇంకా అటువంటి ఆహారాలు తినడం వల్ల పాలిచ్చే తల్లులు కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు గురి అవుతారు.

కొన్ని ఆహారాల్లో స్టార్చ్(పిండి పదార్థాలు లేదా గంజి), ఫైవర్, మరియు షుగర్ లెవల్స్ అధికంగా ఉండటం వల్ల అనేక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఈ ఆహారాలు గ్యాస్, కడుపు ఉబ్బరం, ప్రేగు కదలికలు సరిగా లేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. గర్భం సమయంలో మరియూ గర్భం తర్వాత కూడా మహిళలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం కోసం డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

హెల్తీ డైయట్ తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యను నివారించుకోవడమే కాకుండా అనవసరపు మందులు వాడకాన్ని నివారించవచ్చు. మహిళల్లో అన్ని రకాల ఆహారాలు గ్యాస్ట్రిక్ కారణం కావు. కాబట్టి మహిళల్లో గ్యాస్ సమస్యకు కారణం అయ్యే ఆహారాలు.. ముఖ్యంగా గర్భాధారణ సమయంలో దూరంగా ఉండాల్సినటుంటి ఆహారాలు పట్టికను మీకు అందిస్తున్నాం. ఈ పట్టికలో గ్యాస్ట్రిక్ కు కారణం అయ్యే ఆహారాలు గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదు పాలిచ్చే తల్లులకు కూడా వర్తిస్తాయి. మరి గాస్ ఉత్ప్రేరిత ఆహారాలేంటో చూద్దాం...

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

ఆపిల్స్: యాపిల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చురుకుగా ఉంటుంది. ఇందులో ఉండే పెక్టిన్ అనే అంశం(కార్బోహైడ్రేట్) గ్యాస్ ను ఉత్పన్నం చేస్తుంది.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

క్యాబేజ్: చాలా మంది గర్భిణీ స్త్రీలకు క్యాబేజీ అంటే పడుదు. అందుకు ముఖ్య కారణం. గ్యాస్ ను ఏర్పరచడమే. ఇటువంటి ఆహారాలు నిదానంగా జీర్ణం అయ్యే గుండెల్లో మంటగా అనిపిస్తుంటుంది.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

బీన్స్: బీన్స్ కూడా గ్యాస్ ఉత్పన్నం చేసే ఆహారాల్లో చేర్చారు. ఎందుకంటే వీటిలో గ్యాస్ కు కారణం అయ్యే రఫినోస్ అంశం ఉంటుంది కాబట్టి. అయితే, బీన్స్ పప్పుదాన్యాలు, ఆరోగ్యకరం మరియు పోషకాలు అధికం. కాబట్టి గర్భిణీలు ఈ ఆహారాలు తినదల్చుకొన్నప్పుడు వీటిని ముందుగా నీటిలో 8గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడిగి ఉపయోగించడం వల్ల గ్యాస్ కు దారితియ్యవు.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

ఫ్రైడ్ ఫుడ్స్: ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణం అవ్వడం కష్టం అవుతుంది. అందుకే ఫ్రై చేసిన మరియు ఫ్యాటీ ఫుండ్స్ అంటే మాంసం, ఫ్రెంచ్ ఫ్రైస్, వంటి ఆహారాలను గర్భాధారణ సమయంలో తీసుకోకపోవడం చాలా మంచిది.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

రెడ్ రాడిష్: చాలా మంది గర్భిణీ స్త్రీలకు వీటిని తీసుకోవడం వల్ల దుర్వాసనతో కూడిన గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. గర్భాధారణ సమయంలో రెడ్ రాడిష్ తో పాటు ఉల్లిపాయలు, టర్నిప్, మరియు గ్రీన్ పెప్పర్ వంటివి కూడా గ్యాస్ట్రిక్ కు కారణం అవుతాయి.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

సాఫ్ట్ డ్రింక్: కార్బొనేటెడ్ పానీయాలు, కోల్డ్ డ్రింక్స్ కడుపు ఉబ్బరానికి మరియు గ్యాస్ట్రిక్ కు కారణం అవుతాయి. అనవసరమైన గాలి జీర్ణ వ్యవస్థలో చేరి జీర్ణక్రియను అడ్డుకొంటుంది. దాంతో జీర్ణక్రియ మందగించి గ్యాస్ ను ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి పానీయాలను గర్భాధారణలో అవాయిడ్ చేయడం చాలా మంచిది.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

బ్రసెల్స్ మొలకలు: క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అత్యధిమైన న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ తో నిండి ఉండటం వల్ల గ్యాస్ మరియు ఉబ్బరానికి దారితీస్తుంది.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

పొటాటో: బంగాళదుంపలు స్టార్చ్ తో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది కొలన్ లో బ్యాక్టీరియాన్ ఏర్పరచి తిన్న ఆహారాన్ని జీర్ణం కానివ్వకుండా అడ్డుకొంటుంది. దాంతో గ్యాస్ ఏర్పడుతుంది.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

చీజ్: గర్భిణీ స్త్రీలు చీజ్ తినడం తప్పనిసరిగా మానుకోవాలి. దీన్ని తినడం వల్ల గ్యాస్ ను ఏర్పరిచే బ్యాక్టీరియాను ఫామ్ చేయడమే కాదు, గర్భంలో పెరిగే పిండాన్ని ఎదగనియ్యకుండా అడ్డుకుంటుంది.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

మొక్కజొన్నలు: చాలా కొద్ది మందిలో మాత్రమే ఈ మొక్కజొన్న గింజలు అరుగుతాయి. కొంత మందిలో ఇవి తినడం వల్ల కడుపు నొప్పి మరియు గ్యాస్ కు కారణం అవుతాయి. కాబట్టి మీ డైయట్ లిస్ట్ నుండి వీటిని తొలగించడం ఉత్తమం.

గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

కీరదోస: వాటర్ రిచ్ వెజిటేబుల్స్ కూడా గ్యాస్ సమస్యకు దారితీస్తుంది. గర్భిణీ స్త్రీకి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నట్లైతే వీటిని తినకుండా మానుకోవడం మంచిది.

English summary

Foods That Cause Gas During Pregnancy | గర్భిణీలో గ్యాస్ట్రిక్ సమస్యకు కారణాలివే..!

Gastric problems are something that we all suffer from. Be it for a newborn or adult, there are many foods that causes gastric problems. Even improper eating habits like swallowing air while chewing can cause gastric problem. There are various foods that causes gas when consumed during pregnancy. Even breastfeeding mothers suffer from gastric problems because of these foods.
Story first published: Wednesday, March 13, 2013, 17:05 [IST]
Desktop Bottom Promotion