For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలో గ్యాస్ సమస్యను పరిష్కరించటం చిట్కాలు

By Lakshmi Perumalla
|

గ్యాస్ సమస్య అనేది గర్భిణీ స్త్రీలకు అత్యంత సాధారణ సమస్యలలో ఒకటి.గర్భం సమయంలో మానసిక కల్లోలం,రుచుల తేడా,శారీరక మరియు మానసిక మార్పుల వంటి వివిధ రకాల మార్పుల అనుభూతి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య గర్భిణీ స్త్రీలకు ఒక పీడకల వలె ఉంటుందని చెప్పవచ్చు.

గర్భధారణ అనేది మహిళలకు గొప్ప వరం అని చెప్పవచ్చు. కానీ గర్భధారణ సమయంలో గ్యాస్ మరియు నొప్పి వంటి విషయాలు చాలా భాదాకరముగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు స్వీయ మందులు ఎంచుకొకూడదు. తగిన వైద్య సలహా తీసుకోవటం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో మీ గ్యాస్ సమస్య నివారించడానికి మరియు మీ గర్భం ఒక తీపి అనుభవంగా ఉండటానికి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలి.

గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య ప్రధానంగా శారీరక మార్పుల వల్ల సంభవిస్తుంది. ప్రధానంగా ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరగటం వలన ప్రేగు కండరాలు రిలాక్స్ మరియు జీర్ణక్రియ నెమ్మదిగా జరగటానికి కారణమవుతోంది. ఆహార అలవాట్లలో మార్పు కూడా గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్యకు కారణమవుతుంది. ఇక్కడ మీకు గర్భం సమయంలో గ్యాస్ సమస్య చికిత్సకు కొన్ని నివారణా దశలు ఉన్నాయి.

 తక్కువ మొత్తంలో భోజనం

తక్కువ మొత్తంలో భోజనం

గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్యను నివారించడానికి భారీ భోజనంనకు బదులుగా తరచుగా క్రమ అంతరాలతో రోజంతా తక్కువ మొత్తంలో భోజనం తినాలి. మీ ప్రేగులు సరిగ్గా భారీ భోజనంను జీర్ణం చేయలేవు. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవుట వలన గ్యాస్ మరియు ఉబ్బరం భావన కలుగుతుంది.

నెమ్మదిగా తినాలి

నెమ్మదిగా తినాలి

ఆహారంను పూర్తిగా నమిలి తినటం అలవాటు చేసుకోవాలి. జీర్ణక్రియలో ఒక భాగం నోటిలోనే జరుగుతుంది. జీర్ణక్రియ కొరకు ఆహారంతో లాలాజలం కలుస్తుంది. ప్రొజెస్టెరాన్ యొక్క కార్యకలాపాల కారణంగా మీ ప్రేగు సామర్ద్యం తగ్గుతుంది. అందువలన గర్భధారణ సమయంలో బాగా నమలి తినటం ముఖ్యం.

జాగ్రత్తగా త్రాగాలి

జాగ్రత్తగా త్రాగాలి

తినడం లేదా త్రాగటం అనేవి పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. తినే సమయంలో వినియోగించే నీరు జీర్ణ ఎంజైములతో కలవటం వలన జీర్ణ ప్రక్రియ నిదానించి గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. స్ట్రాస్ ఉపయోగించకుండా గ్లాస్ తోనే నీటిని నేరుగా త్రాగాలి.

మలబద్ధకంనకు చికిత్స

మలబద్ధకంనకు చికిత్స

గర్భం సమయంలోగ్యాస్ నొప్పి ఏర్పడినప్పుడు మలబద్ధకం వంటి సమస్యలను నివారించేందుకు తగిన శ్రద్ధ వహించాలి. మలబద్దకం అనేది గర్భిణి స్త్రీలకు సర్వసాధారణం.మీ ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు డబ్బాల ఆహారాలను మానుకోండి.

గ్యాస్ ఆహారాలు మానుకోండి

గ్యాస్ ఆహారాలు మానుకోండి

గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్యను కలిగించే ఆహారాలను తినకూడదు. ఈ ఆహారాలు ప్రతి వ్యక్తికీ ఒకే రకంగా లేకుండా వేరు వేరుగా ఉంటాయి. మీ వ్యక్తిగత ఎంపికలతో తీసుకోవాలి. ఉదాహరణకు,పాల ఉత్పత్తులలో లాక్టోజ్ ఉండుట వలన గర్భధారణ సమయంలో కొంత మందికి గ్యాస్ నొప్పి వచ్చే అవకాశం ఉంది.

శారీరకంగా చురుకుగా ఉండండి

శారీరకంగా చురుకుగా ఉండండి

డాక్టర్ అనుమతించే శారీరక కార్యకలాపాలను చేయండి. మీరు వ్యాయామం చేసే శక్తి మరియు కృషి గురించి మీ వైద్యుడిని అడగండి.సాధారణ ప్రినేటల్ వ్యాయామాలను అనుసరించండి.యోగ కూడా మందకొడిగా ఉన్న జీర్ణ వాహికను చురుకుగా చేయడానికి సహాయం చేస్తుంది.

ఔషధంగా మెంతులు

ఔషధంగా మెంతులు

ఒక గాజు గ్లాస్ లో రాత్రి పూట మెంతులను నానబెట్టి తరువాత ఉదయం మెంతులను తీసివేసి ఆ నీటిని త్రాగితే కడుపు నొప్పి మరియు గ్యాస్ తగ్గించటానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో గ్యాస్ సమస్య తగ్గించేందుకు ఈ సాధారణ గృహ వైద్యంను ప్రయత్నించండి.

మీ కడుపు నిండుగా ఉంచండి

మీ కడుపు నిండుగా ఉంచండి

కొంత మంది గర్భిణీ స్త్రీలు వికారము మరియు ఇతర శారీరక సమస్యల ప్రభావం వలన ఆహారం తీసుకోవటం తగ్గించవచ్చు. ప్రేగులలో ఉపయోగించని జఠర రసాలు ఉబ్బరం మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

కార్బోనేటేడ్ డ్రింక్స్ మానుకోండి

కార్బోనేటేడ్ డ్రింక్స్ మానుకోండి

కార్బోనేటేడ్ పానీయాలు మీ శరీరంనకు ఎటువంటి మంచి చేయవు. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు కార్బోనేటేడ్ పానీయాలు నివారించటం ముఖ్యం. ఇది నేరుగా వ్యవస్థను ప్రేరేపించుట వలన గర్భధారణ సమయంలో గ్యాస్ నొప్పి సంభవిస్తుంది.

English summary

How To Deal With Gas Problem During Pregnancy

Gas problem during pregnancy is one of the most common problems that pregnant women experience. During pregnancy you will experience different changes including mood swings, tastes change, physical and mental changes.
Desktop Bottom Promotion