For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్త్రీ-పురుషుల్లో సంతానలేమి సమస్యను నిరోధిండం ఎలా

|

కొత్తగా పెళ్ళైన దంపతులకు గర్భం పొందడం చాలా సులభం కావచ్చ. కానీ, మీలో ఏమైనా ఆరోగ్య సమస్యలున్నప్పుడు కొద్దిగా సమయం పడుతుంది. మీరు గర్భం పొందడానికి ప్రయత్నిస్తున్నట్లైతే, వంధ్యత్వం నిరోధించడానికి కొన్ని మార్గాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

వంధ్యత్వం అనేది స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఉండటాకి కారణం కావచ్చు. వంధ్యత్వాన్ని ఎలా ఎదుర్కోవాలని, నివారించడం ఎలా? అని విషయం చాలా మంది మహిళలకు తెలియదు. మరియు చాలా సందర్భాల్లో మహిళలు వారి సంతానోత్పత్తి గడియారం ఒక పక్వత వయస్సు సుమారు 27ఏళ్ళకు క్షీణిస్తుందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అయితే, సంతానోత్పత్తి గడియారం పురుషుల్లో కూడా క్షీణిస్తుంది లేదా నిరాకరిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషుల్లో యవ్వనం నుండి 35ఏళ్ళ వయస్సుకు చేరుకోగానే సంతానోత్తత్తి లక్షణాలు కోల్పోవడం జరుగుతుందంటున్నారు. కాబట్టి, మీరు గర్భం పొందడానికి వయస్సుతో పనిలేదనుకొనే వారు, ఒక సారి ఆలోచించడం మంచిది. వంధ్యత్వానికి ఇది కూడా ఒక ప్రధానకారణం కావచ్చు. అటువంటి వారు, సంతానప్రాప్తి లేకపోవడానికి కారణం తెలియని వారు, ప్రతి రోజూ అసురక్షిత సెక్స్ లో పాల్గొంటున్నా గర్భం పొందడానికి అసమతర్థతను చూపెడుతుంది.

ప్రస్తుత రోజుల్లో కొత్తగా పెళ్ళన వారిలో కూడా సంతానలేమికి అనేక కారణాలున్నాయి. అటువంటి వారు కొన్ని మంచి మార్గాలను ఎంపిక చేసుకోవడం వల్ల సంతానం పొందడం సలభతరం అవుతుంది. సంతానం కోసం ప్రయత్నించే వారికోసం కొన్ని మార్గాలు క్రింది విధంగా ఉన్నాయి. పరిశీలించండి..

ఒత్తిడి:

ఒత్తిడి:

సంతానలేమికి ముఖ్యంగా కారణం ఒత్తిడి. సంతానలేమిని నిరోధించడానికి మీరు ఒత్తిడిని నుండి బయట పడాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని రకాల ఒత్తిడి సాధరణం అయినా, సంతానోత్పత్తి మీద ప్రభావం చూపే కొన్ని అసాధరణ ఒత్తిడిలు కూడా ఉన్నాయని. అలాంటి ఒత్తిడి సంతానోత్పత్తికి సరికాదని సూచిస్తున్నారు.

ఆరోగ్యకరంగా ఉండటం:

ఆరోగ్యకరంగా ఉండటం:

మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే కనుక దంపతులిద్దరు ఆరోగ్యకరంగా ఉండటం చాలా అవసరం. సాధ్యమైనంత వరకూ ఆరోగ్యకరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎటువంటి అనారోగ్యసమస్యలకు గురికాకుండా ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. అందుకు ఆరోగ్యకరమైన తాజా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం వల్ల సంతానలేమిని నిరోధించడానికి ఒక మంచి మార్గం.

వ్యాక్సినేషన్:

వ్యాక్సినేషన్:

మీరు గర్భం పొందడానికి ప్రయత్నించేటప్పుడు, గర్భధారణ సమయంలో హానికరమైన, ప్రమాదకరమైన వ్యాధులను నిరోధించడానికి వ్యాక్సిన్ చేయించుకోవడడం ఉత్తమమైన మార్గం. గవదబిళ్లలు వలె వ్యాధులు స్పెర్మ్ ప్రొడక్షన్ మీద ప్రభావితం చూపెడుతాయి.

చెడు అలవాట్లు:

చెడు అలవాట్లు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మద్యపానం, సిగరెట్ మరియు కొన్ని హానికర పదార్థాలు తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ ప్రొడక్షన్ మరియు మహిళల్లో అండం విడుదలకు ప్రభావితం చేస్తుందని సూచిస్తున్నారు. వంధ్యత్వాన్ని నిరోధించడానికి, ఆరోగ్యానికి హాని తలపెట్టే, ఇటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఉత్తమమైన మార్గం.

గర్భ నిరోధక మాత్రలు:

గర్భ నిరోధక మాత్రలు:

గర్భనిరోధక మాత్రల వినియోగం వల్ల కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులను తగ్గించబడుతాయి. కానీ, దీనికి తోడు హార్మోను గర్భనిరోధంక కటివలయంలో మరియు గర్భాశయ క్యాన్సర్ యొక్క నిర్మాణం నుండి కాపాడుతుంది.

వ్యాయామం:

వ్యాయామం:

గర్భం పొందడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లైతే, వ్యాయామం మీ దిన చర్యలో చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు గర్భం పొందడానికి శరీరం ఫిట్ గా సౌకర్యవంతంగా ఉంటుంది. బ్యాలెస్డ్ లైఫ్ స్టైల్ వల్ల మీరు యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది. పాశ్చాత్య జీవన విధానం వల్ల బరువు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అధిక బరువు వల్ల సంతానలేమి ఎదుర్కోవల్సి వస్తుంది.

పొగతాగడం:

పొగతాగడం:

సంతానం కోసం ప్రయత్నించే స్త్రీ మరియు పురుషులిద్దరూ పొగతాగడాన్ని పూర్తిగా మానేయాలి. సిగరెట్ తాగడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని మరియు గర్భశ్రావాలను జరగడం మరియు ప్రీమెచ్చుర్ బర్త్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. పురుషులు సిగరెట్ తాగడం వల్ల, వారి భార్య గర్భం పొందడం కష్టమవుతుంది.

సరైన ఆహారం, సరైన సమయంలో తీసుకోకపోవడం:

సరైన ఆహారం, సరైన సమయంలో తీసుకోకపోవడం:

సంతానలేమిని నిరోధించడానికి, కొంత మంది స్త్రీలు పూర్తిగా ఉండాల్సిన బరువుకంటే అతి తక్కువగా ఉండటం వల్ల కూడా గర్భం పొందడం కష్టం అవుతుంది . సరైన ఆహారం, సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల కూడా సంతానోత్పత్తి సమస్యలకు దారితీయవచ్చు.

రసాయనాల ఎఫెక్ట్:

రసాయనాల ఎఫెక్ట్:

మీకు గార్డెనింగ్ అంటే ఎక్కువ ఇష్టమా? అయితే మీరు మీ గార్డెన్లో మొక్కలకు ఉపయోగిస్తున్న క్రిసంహారకమందులు, మరియు హెర్బిసైడ్లతో జాగత్తగా ఉండాలి. సంతానప్రాప్తి లేకుండుట నిరోధించడానికి, ఆర్గానిక్ పద్దతిని ఎంపిక చేసుకోవడం మంచిది.

వయస్సు:

వయస్సు:

గర్బం పొందడంలో వయస్సుకూడా ఒక కారణం అవుతుంది. మహిళల్లో 32ఏళ్ళు దాటిన తర్వాత గర్భం పొందే అవకాశాలు తగ్గిపోతాయని చెబుతుంటారు. పురుషుల్లో వంధ్యత్వానికి 50ఏళ్ళ వరకూ ఉన్నా కూడా పురుషులో సంతానం పొందడానికి 20-30వయస్సు అని చెబుతుంటారు.

English summary

How To Prevent Infertility!

Getting pregnant may seem like an easy job for a married couple. But, getting pregnant can be at times a little risky, especially when you have en number of health problems. So, if you are planning to get pregnant, it is very important to consider ways to prevent infertility.
Story first published: Saturday, August 24, 2013, 15:20 [IST]
Desktop Bottom Promotion