For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలలో మూత్రనాళ ఇన్ఫెక్షన్: పరిష్కారం

|

ఎక్కువ శాతం మంది మహిళలు యోని ఇన్ ఫెక్షన్లు, యూరినరీ ఇన్ఫెక్షన్లకు గురవడం చూస్తూ ఉంటాం. వారిలో ఇటువంటి రుగ్మతలు రావడానికి కారణాలేమిటి ?మహిళలు జీవితంలో ఒక్కసారన్నా ఈ యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ (యుటిఐ) బాధకు గురవుతుంటారు. మామూలుగా యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ చాలా సుళువుగా తగ్గిపోతుంది. సుగర్‌ లాంటి ఇతర అనారోగ్యాల కారణం లేకపోతే యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్‌ చికిత్స గోటితే పోయే సమస్యే అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి బారిన పడ్డవారిలో మొదట్లో మూత్రవిసర్జన బాధాకరంగా పరిణమిస్తుంది. తరువాత ఇంకా నిర్లశ్య్రం చేస్తే... తీవ్రమై ... కడుపును చేరి చాలా బాధపెడుతుంది. మూత్రవిసర్జన అంటేనే భయపడిపోయే పరిస్థితి దాపురిస్తుంది. జ్వరం, నీరసం, నిస్సత్తువ అన్నీ దాని తోబుట్టువలమంటూ తయారవుతాయి. పుళ్లు పడటం ఇక నరకమే.

గర్భిణీల విషయంలో యూటీఐ మరింత హానికరంగా తయారవుతుంది. హానికరమైన సూక్ష్మజీవి మూత్రనాళంలోకి ప్రవేశించడం వల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ 20 నుంచి 50 ఏళ్ల వయస్సులోని మహిళల్లో సాధారణంగా వస్తుంది. తమ జీవితకాలంలో 50 శాతం మహిళలు దీని బారినపడతారు. దీనికి చికిత్స చేయకపోతే, బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ మూత్రనాళం నుంచి పైకి వెళ్లి, కిడ్నీలకు చేరుకుంటే పరిస్థితి తీవ్రమవుతుంది. గర్భిణిగా ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల వల్ల మూత్రానాళ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిర్ధారణ: సూక్ష్మజీవి వల్ల మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందా? లేదా? అని సులభమైన 'యూరిన్‌ కల్చర్‌' పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.

How to Prevent UTI During Pregnancy

యూరినరీ ఇన్ఫెక్షన్స్ లక్షణాలేమిటి?

యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది స్త్రీలు వారి జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అనుభవించే ఉంటారు. భరించరాని బాధగా కూడా ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మూత్రంలో మంట, మాటిమాటికీ మూత్రానికి వెళ్ళాలీ అని అనిపించడం, వెళ్ళిన తర్వాత ఏదో చుక్కలు చుక్కలుగానే మూత్రం రావడం, అలాగే యోనిలో చాలా మంటగా ఉండటం, ఇంకా కొంచెం సివియారిటీ గనుక ఎక్కువయిపోతే పొత్తికడుపులో నొప్పి, జ్వరం రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటిలో రెండు రకాలు ఉంటాయి. లోయర్ యూరినరీ ఇన్ఫెక్షన్, అప్పర్ యూరినరీ ఇన్ఫెక్షన్ అని అంటాము. లోయర్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే మూత్రంలో మంట, యోనిలో దురద ఉంటాయి. అప్పర్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటే మూత్రనాళాల ద్వారా, యూరెటర్స్ ద్వారా కిడ్నీలకు కూడా అది సోకుతుంది. దాంతో విపరీతమైన కడుపునొప్పి, జ్వరం, మూత్రంలో రక్తం పడటం, దుర్వాసన, చీము పడటం వంటివి ఉంటాయి. మూత్రం ఘాటైన వాసనతో ఉంటుంది. మూత్రం ఎక్కువ లేదా తక్కువగా రావొచ్చు. మూత్రంలో చీము ఉండొచ్చు. సంభోగంలో నొప్పిగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపించగానే వైద్యుల్ని సంప్రదించాలి.

చికిత్స: మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది. గర్భిణిగా ఉన్నప్పుడు కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయకుంటే నెలలు నిండకుండానే ప్రసవం అవుతుంది. లేదా తక్కువ బరువుతో బిడ్డలు పుడ తారు. గర్భిణిగా ఉన్నప్పుడు మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ వస్తే, యాంటిబయాటిక్స్‌ మందులతో చికిత్స చేస్తారు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతను బట్టి, వీటిని మూడు నుంచి ఏడు రోజుల పాటు వాడాల్సి ఉంటుంది.

వీటితో పాటు మరికొన్ని చిట్కాలు: 1. గర్భణీ స్త్రీ, రోజంతా తగినంత నీరు, పానీయాలు, తాజా జ్యూలు త్రాగుతుండాలి . 2. సమస్య ప్రారంభ దశలోనే ఇన్ఫెక్షన్స్ తో పోరాడే విటమిన్స్ తీసుకొని నివారించవచ్చు.3. అధికంగా ప్రొసెస్ చేసిన లేదా రిఫైడ్ ఫుడ్స్ తినడం నివారించండి. 4. మీరు బాత్రూత్ వెళ్ళాలనిపించినప్పుడు వెంటనే వెళ్ళి, బ్లాడర్ కాళీ చేయండి. 5. బాత్రూమ్ కు వెళ్ళిన ప్రతి సారి మీ జననేంద్రియాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటితో కడుక్కొని, టిష్యూతో తేమలేకుండా తుడుచుకోవాలి.6. లోదుస్తులు కాటన్ వి మాత్రమే ఉపయోగించాలి. అవి కూడా ప్రతి రోజూ మార్చుకోవాలి. వాటిని శుభ్రంగా ఉతికి ఎండలో వేస్తుండాలి. 7. సెక్సువల్ ఇంటర్ కోర్స్ తర్వాత, ముందు బాత్రూమ్ కు వెళ్ళి శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. 8. సమస్య తగ్గనప్పుడు డాక్టర్ వద్దకు వెళ్ళడం తప్పని సరి.

English summary

How to Prevent UTI During Pregnancy

Your uterus pushes and can sometimes block your urinary tract as your baby grows inside you during pregnancy, causing pain and frequent urination. Women in their first trimester of pregnancy are more likely to experience a urinary tract infection or UTI.
Story first published: Saturday, December 21, 2013, 16:14 [IST]
Desktop Bottom Promotion