For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో కాలి తిమ్మిరులను నివారించటం ఎలా?

By Super
|

గర్భధారణ సమయంలో కాలి తిమ్మిరిని మీరు పూర్తిగా తగ్గించలేరు, కానీ కాలి తిమ్మిరి ఎక్కువ పెరగకుండా చేయటం మీ చేతుల్లోనే ఉన్నది.సాదారణంగా గర్భవతి అయిన సమయంలో ఎక్కువ బరువు వల్ల ఇది వస్తుంది. కాళ్ళ యొక్క హిప్ ప్రాంతంలో రక్త నాళాలు అదనపు ఒత్తిడికి గురి కావటం వల్ల కాలి తిమ్మిరి కలుగుతుంది. కాలి తిమ్మిరి రావటానికి రోజులో ఒక నిర్దిష్ట సమయం అంటూ ఉండదు,కానీ సాధారణంగా నిద్రవేళ లో ఉంటుంది.గర్భధారణ సమయంలో కాలి తిమ్మిరి నివారించడానికి కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి.

ఆరోగ్యకరమైనవి తినాలి:

ఆరోగ్యకరమైనవి తినాలి:

కొన్ని సందర్భాల్లో, కాలి తిమ్మిరులు కాల్షియం, మెగ్నీషియం లేదా భాస్వరం వంటి శరీరానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాల లోపం వల్ల వస్తాయి. అప్పుడు మీరు అరటి, బాదం,ఆకు కూరలు,సలాడ్ మొదలైన వాటిని భోజనం,అల్పాహారంలో ఉండేలా చూసుకోవాలి. మీరు సప్లిమెంట్స్ వాడవలసి వస్తే ఖచ్చితంగా మీ డాక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే వాడాలి.

నడవటం:

నడవటం:

మీ వైద్యుని అనుమతితో మొదటి మూడు నెలల కాలంలో ప్రతి 1-2 గంటల మద్య విరామంలో 10 నిమిషాల నడక మీ కాళ్ళపై రక్త ప్రసారాన్ని నియంత్రిస్తుంది. ఎక్కువ సేపు నిలబడటం వల్ల కూడా కాలి తిమ్మిరులు వస్తాయి.

కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు:

కాలు మీద కాలు వేసుకుని కూర్చోకూడదు:

ఈ విధంగా ఉండుట వల్ల కాళ్ళపై రక్త ప్రవాహంను తగ్గిస్తుంది.అంతే కాకుండా విశ్రాంతిగా పడుకొన్నప్పుడు తరచుగా ఆ ప్రాంతంలో ప్రసరణ మెరుగుపరచడానికి మీ కాలి వేళ్ళు ను అటు ఇటు ఉపుతూ ఉండాలి.

కుడివైపుకు పడుకోకండి:

కుడివైపుకు పడుకోకండి:

మీ శరీరం కంటే కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో కాళ్ళను పెట్టటానికి ప్రయత్నించండి. మీరు ఎడమ వైపుకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడే అవకాసం ఉంది.

పాదాల వ్యాయామం

పాదాల వ్యాయామం

మీ శరీర పరిస్థితి వల్ల స్వేచ్ఛగా వ్యాయామం చెయ్యలేకపోవచ్చు, కానీ మీ పాదంతో స్వేచ్ఛగా వ్యాయామం చేయవచ్చు. మీరు పడుకొని లేదా కూర్చున్నప్పుడు కొన్ని కనీస వ్యాయామాలకు ప్రయత్నించండి. మీ పాదంను క్రిందకి,పైకి,కుడికి,ఎడమకు త్రిప్పుతూ ఉండాలి.

వేడి కాపడం

వేడి కాపడం

మీకు ఒత్తిడి తగ్గించడానికి కాలికి ఆ ప్రాంతంలో ఒక సీసా లేదా వేడి ప్యాడ్ లో వెచ్చని నీరును నింపి కాపడం పెట్టవచ్చు. నిద్రించడానికి ముందు ఈ విధంగా కాపడం పెట్టడం మంచిది.అన్ని నివారణ చర్యలు తీసుకోవడం జరిగినప్పటికీ, మీకు ఇప్పటికీ కాలి తిమ్మిరి ఉంటే, అప్పుడు మీరు తప్పనిసరిగా ఈ విధంగా సాధన చేయాలి. మీ కాలి పిక్క కండరాలు వదులుగా ఉంచి మీ పాదంను మీ వైపుకు వంచే ప్రయత్నం చేయాలి.

English summary

How to Prevent Leg Cramps During Pregnancy? | గర్భధారణ సమయంలో కాలి తిమ్మిరులను నివారించటం ఎలా? |

Leg cramps during pregnancy is a common snag, though you can’t completely omit it but preventing it from further aggravation is in your hands. It occurs mostly due to the bulged belly or extra pounds mothers tend to pick up when pregnant. This exerts extra pressure on the adjoining hip area and blood vessels of the legs.
Desktop Bottom Promotion