For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీల కోసం సురక్షితమైన డ్రైవింగ్ చిట్కాలు!

|

ఇది చాలా మంది గర్భవతులకు చాలా సాధారణంగా వచ్చే సందేహమే. తాము ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, విహారయాత్రలకు దూరప్రయాణాలు చేయవచ్చా అని తరచూ డాక్టర్‌ను అడుగుతుంటారు. గర్భవతిగా ఉండటం అన్నది ప్రయాణాలకు ఏమాత్రం అడ్డంకి కాదని గుర్తించాలి. అయితే అవసరాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి.

గర్భంతో ఉన్న వ్యవధిలో తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆర్నెల్ల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి ప్రసవం అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటారన్నది తెలిసిందే. ఏ ట్రైమిస్టర్‌లో అయినా ప్రయాణాలు చేయవచ్చు. కాకపోతే మొదటి, మూడో ట్రైమిస్టర్‌లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు మొదటి ట్రైమిస్టర్‌లో ఉన్నప్పుడు గర్భిణికి వికారం, వాంతులు ఉంటాయి. అటువంటి సమయంలో ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. ఇకపోతే కొంతమందిలో కడుపునొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు మొదటి ట్రైమిస్టర్‌లో ఉండవచ్చు. అలాంటివారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో వైద్యుల సలహా మేరకు ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు.

ఇక ప్రయాణాలు చేయాలనుకున్న వారు ఎలాంటి వాహనాలలో వెళ్లాలి, బస్‌లోనా, కారులోనా, రైల్లోనా, విమానప్రయాణాలు చేయవచ్చా...లాంటి సందేహాలను వెలిబుచ్చుతుంటారు. కుదుపులు లేకుండా ఉండే ఎలాంటి ప్రయాణమైనా చేయవచ్చు. అయితే, సాధరణంగా స్త్రీలు గర్భం (ప్రెగ్నెన్సీ)తో ఉన్నప్పుడు వాహనం నడపకపోవటమే చాలా మంచిది. అయితే, కొన్ని అనివార్య కారణాలు, పరిస్థితుల వలన తప్పనిసరిగా డ్రైవ్ చేయాల్సి వస్తే, అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. ఉద్యోగం చేసే మహిళలకు స్వతహాగా వాహనాలు డ్రైవ్ చేసుకొని వెళ్లటం తప్పనిసరిగా ఉంటుంది.

సాధారణంగా గర్భం దాల్చినప్పుడు స్త్రీల శరీరం భారంగా అనిపిస్తుంటుంది. ఆ సమయంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ అంటే చాలా రిస్కుతో కూడుకున్నది. ఇలాంటి సందర్భాల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంటుంది. అయితే, కొన్ని చిన్న చిట్కాలను పాటించడం వలన ఈ రిస్కు శాతాన్ని తగ్గించుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా వాహనం డ్రైవ్ చేయాల్సిన వస్తే, అలాంటి సందర్భాల్లో ఈ క్రింది చిట్కాలను పాటించడం వలన వారి ప్రయాణం మరింత సజావుగా, సౌకర్యవంతంగా సాగిపోతుంది. మరి ఆ చిట్కాలేంటో క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫుల్ ట్యాంక్/తగినంత ఇంధనం

ఫుల్ ట్యాంక్/తగినంత ఇంధనం

గర్భిణీ స్త్రీలు వాహనంలో ప్రయాణించడానికంటే ముందుగా, సదరు వాహనంలో తమ ప్రయాణ దూరానికి కావల్సినంత ఇంధనం ఉందో లేదోనని తనిఖీ చేసుకోవాలి. (ఫుల్ ట్యాంక్ ఇంధనం ఉంటే ఇంకా మంచిది). కేవలం ఫ్యూయెల్ ట్యాంక్ ఫుల్లుగా ఉండే సరిపోదు, కడుపు నిండా ఆహారం కూడా తీసకోవాలి.

జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి

జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి

సాధారణ పరిస్థితుల్లో డ్రైవ్ చేయటం వేరు, గర్భిణిగా ఉన్నప్పు డ్రైవ్ చేయటం వేరు. గర్భిణిగా ఉప్పుడు అత్యంత జాగ్రత్తతో, శ్రద్ధగా డ్రైవ్ చేయాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, నెమ్మదిగా డ్రైవ్ చేయాలి.

సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

సాధారణ పరిస్థితుల్లోనే సెల్‌ఫోన్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమైనది. అలాంటిది ప్రెగ్నెన్సీ సమయంలో ఇది మరింత ప్రమాదంతో కూడుకున్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపకండి. మరీ అత్యవసరం అయితే, వాహనాన్ని రోడ్డుకు పక్కగా నిలిపి, హాజర్డ్ లైట్లు ఆన్ చేసిన తర్వాత టెలిఫోన్ కాల్‌ను ఆన్సర్ చేయండి.

సీటింగ్ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకోండి

సీటింగ్ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకోండి

స్త్రీలు గర్భంతో ఉన్నప్పుడు ఉదర భాగం (పొట్ట) ముందుకు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి, డ్రైవర్ సీటును తమకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవాలి. స్టీరింగ్ వీల్‌కు, పొట్ట మధ్య తగినంత దూరం ఉండేలా సీటును/స్టీరింగ్‌ను అడ్జస్ట్ చేసుకోవాలి.

వీపుకు తగిన సపోర్ట్ ఉండాలి

వీపుకు తగిన సపోర్ట్ ఉండాలి

గర్భంతో ఉన్న స్త్రీలు ఎక్కువ సమయం డ్రైవ్ చేస్తే నడుము నొప్పి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి దీనిని నివారించేందుకు వెనుక వైపు వీపుకు తగిన సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే మెత్తటి దిండును ఉపయోగించుకోవచ్చు.

సీట్ బెల్ట్ (ముఖ్యమైనది)

సీట్ బెల్ట్ (ముఖ్యమైనది)

గర్భణీ స్త్రీలు తప్పనిసరిగా డ్రైవ్ చేయాల్సి వచ్చినప్పుడు సీట్ బెల్టును ధరించాలి. అయితే, ఈ సందర్భంలో సాధారణ సీట్ బెల్టుల కన్నా, గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన త్రీ పాయింట్ బెల్టును ధరించడం కడుపులో పెరుగుతున్న బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మంచిది. ఇవి డీలర్ల వద్ద లేదంటే బయటి మార్కెట్లలో కూడా లభ్యమవుతాయి. షోల్డర్ బెల్ట్ పొట్టపైకి రాకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.

తరచూ విరామాలు తీసుకోండి

తరచూ విరామాలు తీసుకోండి

మీ ప్రయాణం మొదలైన తర్వాత నిరంతరాయంగా డ్రైవ్ చేయకుండా, అప్పుడప్పుడు విరామం తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. దీనివలన బాడీలో రక్తప్రసరణ సజావుగా జరిగి, కీళ్లు పట్టేయటం వంటి సమస్యలు రావు.

గతుకులు/కుదుపుల రోడ్లలో ప్రయాణించకండి

గతుకులు/కుదుపుల రోడ్లలో ప్రయాణించకండి

గుంతలు, కుదుపులు ఎక్కువగా ఉండే రోడ్లపై అస్సలు ప్రయాణించకండి. షార్ట్ కర్ట్ అని ఇలాంటి రూట్లలో ప్రయాణిస్తే, బిడ్డకు తల్లికి ఇద్దరికీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యమైనా ఫర్వాలేదు మంచి రోడ్లపైన ప్రయాణించండి. వాహనంలో ఒంటరిగా దూర ప్రయాణాలు చేయకండి.

రాత్రిపూట డ్రైవింగ్ చేయకండి

రాత్రిపూట డ్రైవింగ్ చేయకండి

గర్భిణీ స్త్రీలు రాత్రివేళల్లో ఎట్టిపరిస్థితుల్లోను డ్రైవ్ చేయకండి. ఒకవేళ తప్పనిసరై డ్రైవ్ చేయాల్సి వస్తే, డ్రైవింగ్ తెలిసిన సన్నిహితులు లేదా బంధువుల సాయం తీసుకోవటం ఉత్తమం.

గడువు తేదీ దగ్గరపడితే డ్రైవ్ చేయకండి

గడువు తేదీ దగ్గరపడితే డ్రైవ్ చేయకండి

గడువు తేది దగ్గరపడే సమయంలో గర్భణీ స్త్రీలు ఎట్టిపరిస్థితుల్లోను వాహనం డ్రైవ్ చేయకూడదు. ఇది చాలా ప్రమాదకరమైనది. కారులో కుదుపుల వలన కడుపులో పెరిగి బిడ్డకు అపాయం సంభవించే అవకాశం ఉంటుంది.

English summary

Is Driving During Pregnancy A Safe Option?

Driving is a routine activity that comes under the scanner when you get pregnant. There is a divided opinion on whether or not driving during pregnancy is safe. However, many women do travel in their own vehicles when they are expecting and believe that it is the safest mode of travel during pregnancy.
Story first published: Tuesday, December 3, 2013, 16:42 [IST]
Desktop Bottom Promotion