For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు ద్రాక్ష ఎందుకు తినకూడదు? దుష్ప్రభావాలేంటి

|

గర్భాధారణ సమయంలో ద్రాక్ష తినవచ్చా తినకూడదా అనేది పెద్ద కాంట్రవర్సీ. కొంత మంది గర్భిణీలు తీసుకోవడం ఫర్ ఫెక్ట్ గా సురక్షితం అంటారు. మరికొందరేమో గర్భధారణ సమయంలో ద్రాక్ష తినకూడదని ఆంక్షలు పెడుతుంటారు . కాబట్టి ద్రాక్ష గురించి పూర్తిగా తెలుసుకోకపోతే ఇవి గర్భిణీలు తీసుకోవడంలో ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. కాబట్టి ద్రాక్షలోని న్యూట్రిషినల్ బెనిఫిట్స్ మరియు వీటిని తినడవల్ల గర్భణీకి సైడ్ ఎఫెక్ట్ ఏవైనా ఉంటాయా? అని తీక్షణంగా తెలుసుకోవడం చాలా అవసరం. గర్భాధారణ సమయంలో కొన్ని ఆహారాలు ఇన్ స్టాంట్ నూడిల్స్, ఆల్కహాల్, బొప్పాయి వంటి ఆహారాలను తీసుకోకూడదని ఇంట్లో పెద్దలు, డాక్టర్లు కూడా సలహాలిస్తుంటారు. అయితే, గర్భిణీలు నివారించాల్సిన ఆహారాల లిస్ట్ లో, సాంకేతికంగా ఈ సాంప్రదాయ ఆహారాల లిస్ట్ లో ద్రాక్ష చేర్చలేదు.

అయితే కొన్ని శాస్త్రీయ పరిశోధన వల్ల గర్భధారణ సమయంలో ద్రాక్షతినవచ్చని నిర్ధారించాయి. నిజానికి, ఎండు ద్రాక్ష ప్యాకెట్స్ మీద కూడా గర్భిణీ స్త్రీలు తినడకూడదని లేబుల్ ఉంటుంది. ఈ వివాదాస్పద ప్రచురణకు ప్రధాన కారణం ఇందులో రెస్బెట్రాల్ అనే అంశం అధిక మొత్తంలో ఉంటుందంటారు. ఈ రసాయనలు తల్లిలో విషపూరితానికి కారణం కావచ్చని ఉద్దేశ్యం. కానీ చాలా మంది స్త్రీలు అవేవి పట్టించుకోకుండా అన్ని రకాల పండ్లతో పాటు ద్రాక్ష కూడా తినేస్తుంటారు. గర్భణీ స్త్రీలు ద్రాక్ష తినడం వల్ల ముఖ్యమైన పోషకాలతో పాటు విటమిన్ ఎ మరియు విటమిన్ సి ను పుష్కలంగా పొందవచ్చు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవల్సింది గర్భిణీలకు ద్రాక్ష సురక్షితమా కాదా? వీటివల్ల గర్భిణీకి ఏవింధంగా దుష్ర్పభావాలను చూపుతుంది అని తెలుసుకోవాంటే ద్రాక్ష గురించి మరింత లోతుగా తెలుసుకోవల్సిందే.. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

Grapes

ద్రాక్ష గర్భిణీలకు కలిగించే సైడ్ ఎఫెక్ట్స్:
1. బ్లాక్ గ్రేప్: గర్భిణీ స్త్రీలకు బ్లాక్ గ్రేప్ సురక్షితం కాదు అంటారు. ఎందుకంటే, నల్ల ద్రాక్ష పొట్టు గర్భిణీ స్త్రీలకు జీర్ణం అవ్వడం కష్టంగా భావిస్తారు. గర్భిణీ స్త్రీలలో జీర్ణక్రియ సమస్య గర్భాధారణ సమయంలో సర్వ సాధారణం. అందుకే గర్భిణీ స్త్రీలు బ్లాక్ గ్రేప్స్ ను తినడం నివారించాలి.
2. అసిడిటి: ద్రాక్షలో అసిడిటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ద్రాక్ష పుల్లగా ఉన్నప్పుడు మరింత అసిడిక్ ఆమ్లా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో ఆల్రెడ్రీ ఈ హార్ట్ బర్నింగ్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఎక్కవగా ద్రాక్ష తినడం వల్ల మరింత ఎక్కువ అసిడిటి సమస్య ఎదురౌతుంది. ఫలితంగా గర్భిణీలు ఎక్కువ అలసటకు మరియు వాంతులు చేసుకోవడం జరుగుతుంది.
3. డయోరియా: గర్భిణీలు ఎక్కువగా ద్రాక్ష తినడం వల్ల శరీరంలో అధిక వేడి ఉత్పన్నం అవుతుంది. దాంతో గర్భిణీలలో లూజ్ మోషన్ మరియు డయోరియాకు దారితీస్తుంది.గర్భధారణ సమయంలో డయోరియా చాలా ప్రమాధకరమైన పరిస్థితి. ఎందుకంటే శరీరంలో అదనపు నీటి శాతం కోల్పోవడం జరగుతుంది. కాబట్టి గర్భిణీలు ద్రాక్ష తినకపోవడమే మంచిది.
4. టాక్సిటి(విష లక్షణాలు): గర్భధారణ సమయంలో గర్భిణీ ద్రాక్ష తినడం వల్ల వచ్చే ముఖ్య సమస్య రెస్వెట్రాల్ అధిక మొత్తంలో ఉండే రసాయనం గర్భిణీ స్త్రీలలో విషపూరితంగా మారి హార్మోనుల అసమతుల్యతకు దారితీస్తుంది. అంతే కాదు, ఇంకా అనేక సమస్యలను కలిగించవచ్చు.

ఇక చివరగా దీని వల్ల మనకు తెలుసొచ్చిందేమిటంటే గర్భిణీ స్త్రీలకు ద్రాక్ష తినడం సురక్షితం కాదు అని నిర్ధారించుకోవచ్చు. కాబట్టి తినాలున్నా చాలా తక్కువగా తీసుకోవాలి. అందులోనూ పుల్లగా లేని వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరియు కాలీ కడుపుతో ఎప్పటీకి ద్రాక్షను తినకూడదు. లేదంటే అసిడిక్ రిఫ్లెక్షన్ కు దారితీయవచ్చు.

English summary

Is Eating Grapes During Pregnancy Safe?

Eating grapes during pregnancy is shrouded in controversy. Many people say that it is perfectly safe and others argue that it is best to avoid grapes during pregnancy.
Story first published: Thursday, September 26, 2013, 16:56 [IST]
Desktop Bottom Promotion