For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తాగడం సురక్షితమా..?

|

సాధారణంగా చాలా మంది మహిళలకు గర్భం ధరించే వరకూ ఎటువంటి ఆంక్షలు ఉండవు. వారు ఏపనులైన చకచక చక్కబెట్టేస్తారు. ఎటువంటి ఆహారాన్నైన చక్కగా తినేసి జీర్ణించుకోగల శక్తి వారిలో ఉంటుంది. ఒక్కసారి మహిళ గర్భం ధరించిన తర్వాత చేసే పనుల్లో మరియు తినే తిండిలో చాలా ఆక్షలు విధిస్తుంటారు. తల్లితో పాటు కడుపులో పెరిగే శిశువు యొక్క ఆరోగ్యం క్షేమంగా ఉండాలని అలా సలహాలు ఇస్తుంటారు ఇంట్లో పెద్దలు మరియు వైద్యులు. అయితే కొన్ని సంవత్సరాల పాటు ఉన్న అలవాట్లను సడన్ గా మానుకోవాలన్నా కొత్త పద్దతులను పాటించాలన్నా గర్భిణీ స్త్రీ మనస్సులో అనేక సందేహాలు ఏర్పడుతాయి. అటువంటి సందేహాల్లో ఒక్కటే గ్రీన్ టీ. గర్భిణీ స్త్రీ గ్రీన్ టీ త్రావచ్చా? గ్రీన్ టీ వల్ల భద్రత మరియు ఆరోగ్య అంశాలను గురించి తెలుసుకొని డాక్టర్ సలహా ప్రకారం తాగాల్సి ఉంటుంది.

గతంలో గ్రీన్ టీని గర్భిణీ స్త్రీలు కూడా తావచ్చని గ్రీన్ టీ లో అనేక ఔషధ గుణాలున్నాయని, గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గర్భధారణ సమయంలో గ్రీన్ టీ త్రాగడం వల్ల ఆరోగ్యానికి పూర్తిగా లాభదాయం అని భావించబడింది. అయితే రీసెంట్ గా చేసిన కొన్ని అధ్యయనాలు వల్ల గర్భధారణ సమయంలో గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని సూచిస్తున్నాయి. కాబట్టి గర్భధారణ సమయంలో ప్రమాదకరమైన గ్రీన్ టీ ని తీసుకోవడం వల్ల జాగ్రత్తగా ఉండటం ఉత్తమమైన మార్గం. గర్భధారణ సమయంలో గ్రీన్ టీ తీసుకోవడం ఎందుకు సురక్షితం కాదు? అని తెలిపే కొన్ని నిజాలను పరిశీలించండి...

Green Tea

1. గర్భిణీలో ఫోలీక్ యాసిడ్స్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది: గ్రీన్ టీ తాగడం పెరిగినప్పుడు శరీరంలోని ఫోలిక్ యాసిడ్ స్థాయిలను ప్రభావితం చేయవచ్చు. ఫొల్లేట్ లోపం వల్ల శిశువు యొక్క కేంద్ర నాడీ వ్యవస్థ ట్యూబ్ పూర్గిగా మూసుకుపోవచ్చు దాంతో వెన్నెముక చీలిక, నాడీ సంబంధ నాళిక లోపాలకు కారణం కావచ్చు.

2. కెఫిన్ యొక్క ప్రభావం: మీకు తెలుసా గ్రీన్ టీలో కూడా కొంత మొత్తంలో కెఫిన్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి గర్భధారణ సమయంలో తగు మోతాదులో మాత్రమే టీ, కాఫీ, త్రాగమని సిఫార్సు చేస్తుంటారు. అదే విషయం గ్రీన్ టీకి కూడా వర్తిస్తుంది.

3. శరీరంలోని ఇనుము శోషణ గావింపబడుతుంది: ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపడంతో పాటు గర్భిణీ శరీరంలో ఐరన్ శాతాన్ని తగ్గించేస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఐరన్ చాలా ముఖ్యమైనటువంటి పోషకాంశము. కాబట్టి గ్రీన్ టీని గర్భదారణ నియంత్రించబడింది.

4. శిశువు తక్కువ బరువుతో పుట్టడం: గ్రీన్ టీని అధికంగా తీసుకొనే గర్భిణీ స్త్రీలలో అతి తక్కువ బరువు కలిగిన పిల్లలు పుట్టే అవకాశంలో ఉంటుందని కనుగొన్నారు. ఇది గ్రీన్ టీలోని కెఫిన్ వల్లే ఇలా ప్రభావం చూపిస్తుందని పరిగణిస్తారు. గ్రీన్ టీలో 25-50mg కెఫిన్ ఉండి వివిధర రకాలుగా ఆధారపడి పనిచేస్తుంది.

5. డీహైడ్రేషన్: కెఫిన్ ఒక మూత్ర విసర్జన ప్రేరకంగా ఉంటుంది, కనుక గర్భధారణ సమయంలో ఒంట్లో నీటిశాతాన్ని తగ్గించేస్తుంది కాబట్టి, ప్రెగ్నెన్సీ టైమ్ లో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి గర్భధారణ సమంయలో తగు మోతాదలో మాత్రమే డాక్టర్ల సలహా మీద గ్రీన్ టీ త్రాగాలి.

6.కెఫిన్ మాయ దాటుతుంది: కెఫిన్ రక్తప్రసరణ ద్వారా శిశువు గర్భశయ మాయలో ప్రవేశించి శిశువుకు చేరుతుంది. దాంతో కడుపులో పెరుగుతున్న శిశువు యొక్క జీవక్రియ పరిపక్వత లోపిస్తుంది. కెఫిన్ శిశువు యొక్క అభివ్ద్దిని అడ్డుకుంటుంది.

గర్భధారణ సమయంలో గ్రీన్ టీ యొక్క ప్రమాదకర ఫలితాలను ఇన్ని అధ్యయనాలు చూపించబడి ఉన్నాయి కాబట్టి, గర్భధారణ సమయంలో తగు మోతాదులో తీసుకోవడం ఉత్తమం. కాబట్టి గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉండాలంటే ప్రస్తుతానికి గ్రీన్ టీకి సారిచెప్పడమే ఉత్తమైన మార్గం.

English summary

Is Green Tea Safe During Pregnancy? | గర్భిణీ స్త్రీ కి గ్రీన్ టీ సురక్షితమా...?

The moment you know you are pregnant, each and everything you have done for years will fall under suspicion and doubt since you always prefer to do the best for your baby. One common doubt among pregnant women is about the safety and health aspects of drinking green tea during pregnancy.
Story first published: Monday, April 29, 2013, 16:10 [IST]
Desktop Bottom Promotion