For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేటు(35ఏళ్ళ)వయస్సులో గర్భం పొందడం కష్టమా?

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మహిళలు 35ఏళ్ళ తర్వాత గర్భం ధరించడం సాధరణమైపోయింది. కానీ, దీని ఫలితంగా చాలా ప్రెగ్నేన్సీలలో తల్లి లేదా శిశువు ఆరోగ్య మీద చాలా సమస్యలకు కారణం అవుతోంది. ఇలా లేట్ ప్రెగ్నెన్సీ పొందడానికి, కొంత మంది మంచి ప్రొషెషనల్ మరియు ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ ఎదగడానికి వేచి చూడాల్సి వస్తుంది. అంతలోపు, వయస్సు పెరగడంతో పాటు, మీరు గర్భం పొందే అవకాశం తగ్గుతుంది.

కానీ, నిజానికి 35ఏళ్ళ తర్వాత గర్భం ధరించడానికి కొన్ని సన్నాహాలు పాటించినట్లైతే గర్భం పొందడం అంతు కష్టమేం కాదు అంటున్నారు కొందరు నిపుణులు. ఇది మీరు సులభంగా కన్వీన్స్ అవ్వడానికి, అదేవిధంగా ఆరోగ్యకరమైన బిడ్డను పొందడానికి సహాయపడుతుంది. లేటు వయస్సులో గర్భం ధరించడానికి సరైన వైద్య సలహాలు మరియు వ్యాయామ నియమాలు పాటించడం ద్వారా, లేటు వయస్సులో గర్భాధారణకు అంత సమస్య ఉండదు.

లేటు వయస్సులో 35ఏళ్ళ తర్వాత గర్బం పొందడానికి, మరియు ఆరోగ్యకరమైన బిడ్డను పొందుటకు సరైన ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కొరకు ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒక సారి పరిశీలించండి...

35ఏళ్ళ తర్వాత కూడా గర్భం పొందడం సాధ్యమే!

మీ డైట్ ను మెరుగుపరుచుకోండి: ఆరోగ్యకరమైన డైట్ ను ఫాలో అవ్వాలి. అందుకు మీ రెగ్యులర్ డైట్ లో మాంసం, గుడ్లు, చేపలు, డైరీప్రొడక్ట్స్, వంటివి తీసుకోవడం వల్ల ఈ ఆహారాలన్నీ అండోత్సర్గం (అండం ఉత్పత్తికి)మెరుగుపర్చడానికి సహాయపడుతాయి.

35ఏళ్ళ తర్వాత కూడా గర్భం పొందడం సాధ్యమే!

ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్: మీరు గర్భం పొందడానికి కనీసం మూడు నెలల ముందునుండే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ను తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది శిశువు మొదటి దశలో చాలా అవసరం అవుతుంది. దీని వల్ల మీరు గర్భం ధరించారన్న విషయం కూడా మీకు తెలియదు. ఫోలిక్ యాసిడ్ శిశువు అభివృద్ధికి దోహదం చేసే నాడీ సంబంధ నాళిక లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు ఇటువంటి సప్లిమెంట్స్ తీసుకొనే ముందు గైనకాలజిస్టున్ సంప్రదించండి.

35ఏళ్ళ తర్వాత కూడా గర్భం పొందడం సాధ్యమే!

సరైన సమయంలో ప్రేమను పంచండి: ఓవేవొలేషన్ కు మంచి సమయం అంటే ఓవొలేషన్ (అండం విడుదలయ్యే సమయం)ముందు రోజు, అలాగే ఓవొలేషన్ తర్వాత రోజు మీ పాట్నర్ తో సమయాన్ని గడపడం బెస్ట్ చాన్స్. ఓవొలేషన్ (గర్భాశయంలో అండం విడుదలయ్యే సమయం)మెనుష్ట్యువల్ సైకిల్ (రుతక్రమం)మొదలైన మొదటి రోజు నుండి కరెక్ట్ గా 14వ రోజును అండం విడుదల అవుతుంది. ఈ రోజుకు ముందు రోజు మరియు తర్వాత రోజు కూడా గర్భం పొందడానికి అనుకూలమైన సమయంగా భావిస్తారు. కాబట్టి ఓవొలేషన్ కు 6 ముందు నుండి, అలాగే తర్వాత ఆరు రోజులు మీరు ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే అండోత్సర్గము రోజు అంచనా వేయడం కష్టం కాబట్టి.

35ఏళ్ళ తర్వాత కూడా గర్భం పొందడం సాధ్యమే!

మీ మానసిక ఆరోగ్యాన్ని గమనించండి: 35ఏళ్ళ తర్వాత గర్భం ధరించాలన్నా, లేదా బిడ్డను పొందాలన్నా ఒత్తిడితో కూడి ఉంటుంది. కాబట్టి మీరు రిలాక్స్ గా ఉండటం చాలా అవసరం. అందుకు ఉపశమన పద్ధతులు, యోగా మరియు మెడిటేషన్ వంటివన్నీ కూడా మీరు మానసిక ఆరోగ్యానికి చాలా సహాయపడుతాయి. కాబట్టి మీ శరీరం శక్తివంతమైన సానుకూల శక్తితో నిండిపోయేలాగా ప్రయత్నించండి.

35ఏళ్ళ తర్వాత కూడా గర్భం పొందడం సాధ్యమే!

మీ భాగస్వామి యొక్క శరీరం కూడా అందుకు సిద్ధంగా ఉండేలా ప్రయత్నించండి: లేటు వయస్సులో 35ఏళ్ళ తర్వాత గర్బం పొందడానికి మీ ఆరోగ్యంతో పాటు మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా అతనికి వేడి పుట్టించే ఆహారపానీయాలకు మరియు ఉష్ణోగ్రతకు దూరంగా ఉండనివ్వాలి . మద్యపానీయాలు, ధూమపానం మరియు అక్రమ మందులు వాడకుండా నివారించడా చాలా అవసరం. వీటికి బదులుగా జింక్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు పురుషులు తీసుకోవడం వల్ల అవి మీకు మద్దతిస్తాయి.

35ఏళ్ళ తర్వాత కూడా గర్భం పొందడం సాధ్యమే!

వైద్యులను సంప్రదించాలి: గర్భం ధరించడానికి ముందు మీరు(భార్య భర్త ఇద్దరూ) గైనకాలజిస్టును సంప్రధించడం చాలా అవసరం. లేటు వయస్సులో గర్భం ధరించానుకొనే వారి శరీర ఆరోగ్యం, మెడికల్ హిస్టరీ మరియు జనరల్ హెల్త్ రెండూ పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. పర్సనల్ మెడికల్ డీటైల్స్ తెలుసుకోవడ వల్ల, మీరు గర్భం పొందడానికి ఇరువురికి కొన్ని సలహాలను ఇవ్వవచ్చు.

35ఏళ్ళ తర్వాత కూడా గర్భం పొందడం సాధ్యమే!

పాజిటీవ్ గా ఉండటం: మాతృత్వంపై ఒక ఉత్తమ భావన మహిళ ఎప్పుడూ కలిగి ఉండాలి. పాజిటివ్ (సానుకూలంగా)ఉండి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి.

English summary

Is Pregnancy Hard After 35

Nowadays it is very common that women are getting pregnant after an age of 35. But, this always results in many pregnancy complications that may affect the health of the mother or baby.
Desktop Bottom Promotion