For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భణీ స్త్రీలు తీసుకొనే ఆహారంలో అపోహలు..!

|

తల్లి అయ్యే అదృష్టం మహిళలకు దేవుడిచ్చిన ఓ అపురూపమైన కానుక. కొన్ని సూచనలు పాటిస్తే ప్రసవం సులభతరమౌతుంది. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. ఆరోగ్యమైన శిశువు కొరకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

గర్భిణులు అన్ని రకాల ఆహారపదార్థాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్థాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహారపదార్థాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్థితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తినాలి.

రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు, చేపలు, క్రొవు్వపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్థాలు, పీచుపదార్థాలు తీసుకోవాలి. సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2గంటలు, రాత్రి 8గంటలు)

గర్భిణులలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీనివలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండినపండ్లు, (కర్జూరం, ద్రాక్ష), నువు్వలు, చెరకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున వంద ఐరన్‌ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యంగా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది.

Pregnant Women

తినకూడని పదార్థాలు:
1. బాగా ఉడకని మాంసం ముఖ్యంగా పందిమాంసము తినకూడదు. దీనివల్ల టాక్సోప్లాసోమోసిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీస్తుంది లేదా పుట్టే బిడ్డ గుడ్డిదిగా పుడుతుంది.
2. కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు తినకూడదు. దీనివల్ల లిస్టెరియోసిస్‌ అనే ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉన్నది. దీనివల్ల అబార్షన్లు జరిగే అవకాశము కూడా ఉంది.
3. అతి వేడిచేసే పదార్థాలు అంటే ఆవకాయ, మామిడికాయ, ఆవపెట్టిన కూరలు, నువు్వలు, బొప్పాయి వంటివి 1-3 నెలల గర్భిణులు తీసుకోకూడదు.
4. పచ్చిగుడ్డు, సరిగా ఉడకని గుడ్లతో చేసిన పదార్థాలు తినకూడదు. పచ్చిగుడ్డులో సోల్మోనెల్లా అనే బాక్టీరియా వల్ల టైఫాయిడ్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశము ఎక్కువ.
5. పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుచేసిన జున్ను వంటి పదార్థములు తినకూడదు. పాచ్యురైజేషన్‌ చేయని పాలలో లిస్టేరియా అనే బాక్టీరియా ఉంటుంది. దానివల్ల అబార్షన్‌ అయ్యే ప్రమాదము ఉంది.
6. కాఫీలోని కెఫిన్‌, కెఫినేటెడ్‌ డ్రింక్స్‌ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు. రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాదము ఉంది. కెఫిన్‌ డైయూరిటిక్‌గా పనిచేస్తుంది. ఒంట్లోని నీటిని బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్‌ ఎక్కువ.
7. సారా, సారా సంబంధిత పదార్థములు తీసుకోకూడదు. బేబీ పెరుగుదలను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగుతాయి.
8. కాయగూరలు బాగా కడిగి తినాలి. కడగని ఆకుకూరలు, కాయలు, పండ్లపైన టాక్సోప్లాసామోసిస్‌ కలుగజేసే బాక్టీరియా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం.
9. విటమిన్‌ ఎ ఎక్కువగా ఉన్న మాంసాహారము అనగా లివర్‌తో వండిన కూర. దీనివలన బేబీ పుట్టుకతో కూడుకున్న డిఫెక్ట్స్‌తో పుట్టే అవకాశమున్నది. బీటాకెరొటిన్‌తో కూడుకుని ఉన్న విటమిన్‌ ఎ తినవచ్చును.

గుర్తుంచుకోవలసినవి:
మత్తుపానీయాలు, కాఫీ, కెఫినేటెడ్‌ డ్రింక్స్‌, పచ్చి, సరిగా ఉడకని గుడ్లు, మెర్కురీ మూలకము ఉన్న చేపలు, కాల్చిన సముద్రపు ఉత్పత్తులు, కర్మాగారాల కెమికల్స్‌తో కూడుకుని ఉన్న చేపలు, పచ్చి, సరిగా ఉడకని ఆల్చిప్పలు, ఎండ్రకాయలు, పాచ్చురైజ్‌ చేయని పాలతో చేసిన జున్ను, శుభ్రంగా కడగని కాయలు, కూరలు, వేడిచేయని పాలు, పాలపదార్థాలు, కారం, మసాలా, ఇంగువతో కూడుకున్న పచ్చళ్లు, ఊరగాయలు తినకూడదు.
11.తినకూడని పండ్లు:
సాధారణంగా పళ్లు తింటే ఆరోగ్యం ఆనందం రెండూ కలుగుతాయని చెప్తారు పెద్దలు. అయితే కొన్ని రకాల ఫలాలు సమయానుకూలంగా తీసుకోకుంటే కొత్త సమస్యలు తెచ్చిపెడతాయని అందునా గర్భవతులు కొన్నిపళ్లు తీసుకుంటే అనేక దుష్పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని కూడా చెప్పారు. ఇలా సమస్యలు తెచ్చిపెట్టే ఫలాలు ఏమిటంటే...
12. పైనాపిల్‌: గర్భవతిగా ఉన్నవారు ప్రసవం అయ్యే వరకు పైనాపిల్‌కి దూరంగా ఉండాల్సిందే. ఇందుకు ముఖ్యకారణం ఇందులో అధికంగా ఉండే బ్రొమెలైస్‌ అనే పదార్థం గర్భాశయాన్ని శుభ్రపరిచే గుణం కలది. దీంతో గర్భవిచ్ఛిన్నం కావటమో, నెలలు నిండక ముందే ప్రసవం జరిగి బిడ్డ అనారోగ్యంగా పుట్టడమో జరుగుతాయి. అందుకే గర్భవతులు తినే పళ్లలో ఇది పూర్తిగా నిషేధించిన పండు.
13. బొప్పాయి: గర్భవతులు బొప్పాయి పండు తీసుకుంటే అందులోని సి విటమిన్‌ మేలు చేస్తుందని, వారిలో వచ్చే గుండెమంట, మలబద్దకం తగ్గేందుకు ఉపయోగపడుతుందని పెద్దలు చెప్పినా, బొప్పాయిలో గర్భవిచ్ఛిన్న గుణాలుండటంతో సురక్షిత ప్రసవం కోరుకునే గర్భిణులు దాన్ని తినవద్దనే చెప్తారు. అయితే ప్రసవానంతరం బొప్పాయికి కాసింత తేనె కలిపి తీసుకుంటే పిల్లలకు సరిపడ పాలు పడతాయి. పైగా ప్రసవంలో కోల్పోయిన సత్తువని బొప్పాయందించే విటమిన్‌సితో సరిచేసుకోవచ్చు.
14. నల్లద్రాక్ష: చాలామంది గర్భిణులుగా ఉన్నవారికి రక్తం ఎక్కువగా ఇచ్చే గుణముందని నమ్మి, తెలిసో తెలియకో మార్కెట్‌లో కనిపించే నల్లద్రాక్షని కొనిఇస్తుంటారు. అయితే నల్ల ద్రాక్షకు శరీరంలో వేడిని పుట్టించే గుణం ఉండటం వల్ల అది గర్భస్థశిశువులకు మంచిది కాకపోవటం, దాన్ని తట్టుకోలేని బిడ్డల ఆరోగ్యస్థితి మారిపోయే ప్రమాదం కూడా ఉందని అందుకే ఈ పళ్లని గర్భిణులకు ఇవ్వవద్దని వైద్యులు సూచిస్తారు. గర్భిణులే కాదు మీరు తీసుకునే ఏ ఇతర పళ్లనైనా నేరుగా కాకుండా ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు శుభ్రమైన నీటితో కడిగి, వాటికి ఎలాంటి రసాయనాలు, పురుగులు లేనట్లు నిర్థారించుకుని తినండి. లేదంటే రసాయనాలు మీ ఆరోగ్యాన్ని చెడగొట్టి మరిన్ని సమస్యలకు కారణమయ్యే అవకాశాలను మీరే ఇచ్చినవారవుతారు.

English summary

Nutritious Foods that Pregnant Women Should Eat


 There are so many rumors about what to eat, and what not to eat, during pregnancy. How do you make sure you are eating healthy foods for your pregnancy? Follow a simple diet filled with the proper nutrients and food groups.
Story first published: Saturday, August 17, 2013, 16:18 [IST]
Desktop Bottom Promotion