For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీ దంత సంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

By Lakshmi Perumalla
|

మీరు గర్భం సమయంలో చాలా విషయాల్లో శ్రద్ధ వహిస్తారు. కానీ మీ దంత పరిశుభ్రత మరియు మొత్తం నోటి ఆరోగ్యం విషయంలో కొంత అశ్రద్ధ చేస్తారు. గర్భధారణ సమయంలో నోటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవటం వలన దంత ఆరోగ్యం మరింత ఆకర్షణీయమైన స్మైల్ కలిగి ఉండటంలో గొప్ప పాత్రను కలిగి ఉంటుంది. నోటి పరిశుభ్రత లేకపోవుట వలన నోటి ఇన్ఫెక్షన్ మరియు చిగుళ్ళ వాపుకు కారణం కావచ్చు.అదే విధంగా గర్భం సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా చిగుళ్ళ వ్యాధులు అభివృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. అందువలన ఈ గర్భధారణ సమయంలో దంత పరిశుభ్రత నిర్వహణ ప్రాముఖ్యత పెరుగుతుంది.

గర్భవతి పొందడానికి ముందు ఒక దంతవైద్యుని సంప్రదించాలి. అప్పుడు మీరు మీ నోటి ఆరోగ్యం గురించి ఒక ప్రొఫెషనల్ అభిప్రాయం పొందుతారు. గర్భధారణ సమయంలో మంచి నోటి రక్షణ మరియు దంత కావిటీస్,చిగురువాపు మరియు చెడు శ్వాస నుండి దూరంగా ఉండడానికి సహాయపడుతుంది.

రెగ్యులర్ గా పళ్లు తోముకోవడం మరియు పాచిని పక్కాగా తొలగించడం,సమతుల్య ఆహారం తీసుకోవటం మరియు క్రమం తప్పకుండా మీ దంత వైద్యుడుని సందర్శించడం అనేవి మీకు గర్భం సమయంలో ఖచ్చితంగా మీ నోటికి రక్షణగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాక మీరు గర్భం సమయంలో దంత పరిశుభ్రత కోసం మరింత ఎక్కువగా చేయవచ్చు.క్రింద మీరు గర్భధారణ సమయంలో మంచి నోటి రక్షణ నిర్వహించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Oral Care During Pregnancy

రెండుసార్లు బ్రష్ చేయాలి

మీరు గర్భం సమయంలో నోటి రక్షణ కోసం ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయాలని గుర్తుంచుకోండి.ఆహారం తిన్న తరువాత మీ నోటిని ప్రతిసారీ శుభ్రం చేయాలి. ఇది మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.బ్రషింగ్ సమయంలో వికారము ఒక సమస్యగా ఉంటే,గర్భధారణ సమయంలో సౌమ్యమైన రుచి గల టూత్ పేస్టు మార్చండి.

మీ నాలుకను శుభ్రపరచండి

గర్భధారణ సమయంలో మీ నాలుక క్లీనింగ్ అనేది దంత పరిశుభ్రత మాదిరిగానే ప్రాముఖ్యతను కలిగి ఉంది.మీ నోటి శుభ్రం సమయంలో మీ నాలుకను కూడా శుభ్రం చేయాలి. మీరు మీ నాలుకను శుభ్రం చేయడానికి మీ టూత్ బ్రష్ ను కూడా ఉపయోగించవచ్చు.టంగ్ క్లీనర్లు తరచుగా గీతలు మరియు రక్తస్రావంనకు దారితీయవచ్చు.

ఫ్లోరైడ్ పరిమితం

ఫ్లోరైడ్ అనేక టూత్ పేస్టులలో మరియు మౌత్ వాష్ లలో ఒక ముఖ్యమైన కంటెంట్గా ఉన్నది. ఫ్లోరైడ్ వలన ఎనామెల్ కు బలం మరియు క్షయంనకు గురయ్యె అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ,ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం అనేది పళ్లపై తెలుపు మచ్చలకు కారణం కావచ్చు.

కాల్షియం తీసుకోవడం

గర్భధారణ సమయంలో మీ పళ్ళు ఆరోగ్యంగా మరియు మంచి నోటి రక్షణ పరిపూర్ణంగా ఉండాలి. గర్భం సమయంలో కాల్షియం చాలా అవసరం అవుతుంది. కాబట్టి తగినంత తీసుకోవటంముఖ్యం.లేదంటే,దంత సమస్యలకు కారణం కావచ్చు.

రోజువారీ ఫ్లాస్

గర్భధారణ సమయంలో దంత పరిశుభ్రత మాత్రమే పరిపూర్ణ పాచిని పక్కాగా తొలగించే టెక్నిక్ తో పూర్తి అవుతుంది.దంతాల మధ్య లో శుభ్రం చేయటానికి ఫ్లాస్ ఉపయోగించటం అనేది గర్భధారణ సమయంలో నోటి జాగ్రత్తకు సహాయం చేస్తుంది.పంటి పైన గమ్ లైన్ నుండి ఫ్లాస్ తో లాగి మరియు రెండు వైపులా శుభ్రం చేయాలి.

చక్కెర అధికంగా ఉన్న ఆహారాలు మానుకోండి

సాదారణంగా మీకు గర్భధారణ సమయంలో తీపి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ,గర్భధారణ సమయంలో ఒక మంచి నోటి రక్షణ కోసం తీపిని నివారించటం మంచిది. నోటిలో బాక్టీరియా చక్కెర విచ్ఛిన్నం మరియు మీ పళ్ళు పాడు చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి.

మంచి అలవాట్లు

ఇతర చట్టవిరుద్ధ మందులు మరియు ధూమపానం వాడకం కూడా మీ దంతాలకు హాని చేయవచ్చు.మీరు గర్భవతి ఉన్నప్పుడు,అది మీ మీద మాత్రమే కాకుండా మీకు పుట్టే బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. అందువలన మీ చెడు అలవాట్లను నిష్క్రమించటం చాలా ముఖ్యం.

ఒక దంతవైద్యుని సంప్రదించాలి

మీ దంత ఆరోగ్యం కోసం ప్రొఫెషనల్ తో చెకప్ చేయించుకోవటం చాలా మంచిది. మీరు గర్భం సమయంలో దంత చికిత్సలు చేయించుకోవడంలో కొన్ని పరిమితులను కలిగి ఉండాలి. మీరు ఈ చికిత్సలను గర్భవతిగా పొందటానికి ముందు చేయించుకోవటం ఉత్తమం.

ఆరోగ్యకరమైనవి తినాలి

సమతుల్యమైన ఆహారం తినడం అనేది గర్భధారణ సమయంలో నోటి రక్షణ కోసం చాలా ముఖ్యం.పాలు, చీజ్,కాటేజ్ చీజ్ లేదా తియ్యని పెరుగు వంటి పాల ఉత్పత్తులు అద్భుతమైన ఎంపికలు అని చెప్పవచ్చు. చక్కెర తీసుకోవడం మరియు జ్యూస్ లేదా కోలా వంటి ఇతర తీపి పానీయాలను తగ్గించాలి.

Story first published: Tuesday, December 17, 2013, 19:49 [IST]
Desktop Bottom Promotion