For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లేటువయస్సులో ప్రెగ్నెన్సీ అసాధ్యం, ఎందుకో తెలుసా?

|

ప్రస్తుత రోజుల్లో మన సెలబ్రెటీలు చాలా మంది 40ఏళ్ళ వయస్సులో గర్భం దాల్చడమే కాదు చాలా సులభంగా ప్రసవిస్తున్నారు. అయితే, మీరు అనుకున్నట్లు అన్ని అనుకూలంగా ఉండకపోవచ్చు. 40ఏళ్ళ తర్వాత లేదా ఇంకా అంతకంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత గర్భం ధరించడం సాధ్యం, కానీ లేట్ ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని సమస్యల ఎదుర్కోవల్సి వస్తుంది. అంటే మద్య వయస్సులో మీరు గర్భం ధరించలేరని కాదు. అయితే, మిడిల్ ఏజ్ లో కూడా గర్భధారణ కోసం ప్రయత్నం చేసేటప్పుడు వాటి వల్ల ఎటువంటి రిస్క్ మరియు సమస్యల ఏర్పడుతాయనే వాటి గురించి తెలుసుకుని ఉండాలి.

అన్నికంటే ముందుగా, మీ శరీర స్థితిగతులను తెలిపేందుకు ఒక బయోలాజికల్ గడియారం తెలుపుతుంది మరియు 40ఏళ్ళ తర్వాత అంటే లేట్ ప్రెగ్నెన్సీ వల్ల మీలో ఫెర్టిలిటీ సామర్థ్యం అంతబాగుండదు. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్ది శరీరంలో హార్మోనుల సైకిల్(రుత చక్రం) ప్రెగ్నెన్సీకి కాకుండా మోనోపాజ్ కు సన్నద్దమవుతుంటుంది . అందుకే 40 ఏళ్ళ తర్వాత మహిళల్లో రుతుచక్రంలో చాలా తేడాలు కనిపిస్తుంటి. హార్మోను అసమతుల్యత నెలసరలు ముందే కావడం లేదా చాలా లేటుగా కావడం అనేది జరగుతుంది.

లేట్ ప్రెగ్నెన్సీ వల్ల మరో సమస్య మీ శరీరం సహకరించకపోవడం. వయస్సు మీరినప్పుడు గర్భంధరించడానికి అవసరం అయ్యే అండాలు గర్భాశయంలో సరిగా ఉత్పత్తికాకపోవడం. దాంతో మీరు దీర్ఘకాలిక వయస్సు సమస్యలు అంటే వ్యాధులు డయాబెటిస్ మరియు హైబ్లడ్ ప్రెజర్ వంటి వ్యాధులకు గురి అవుతారు. ఈ వ్యాధులు హార్మోనుల అసమతుల్యతకు సూచిక. ఇటువంటి వ్యాధులు శిశువు లో క్రోమోజోమ్ లోపాలను కలుగచేస్తాయి. లేట్ ప్రెగ్నెస్సీ వల్ల ఈ సమస్యలన్నీటి మీద ప్రభావం చేయవచ్చు. మరియు గర్భంధరించడానికి కూడా చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు.

లేట్ ప్రెగ్నెన్సీ (ఆలస్యంగా)గర్భం ధరించడం వల్ల వచ్చే కొన్ని సమస్యలను క్రింది విధంగా పరిశీలించండి...

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

గర్భ ధరించడానికి సమస్యలు: మహిళలు పుట్టినప్పుడే, అండాశయంలో గుడ్లు ఉంటాయి. మహిళలు మెచ్యుర్ అయిన తర్వాత ప్రతి నెలా వచ్చే రుతుచక్ర సమయంలో ఒకటి లేదా రెండు గుడ్లు పరిపక్వం చెందుతాయి. కనుక మీరు 45 ఏళ్ళు వయస్సులో అడుగు పెట్టగానే, మీ అండాశయంలోని గుడ్లు మీ వయస్సు ఎంత ఉంటుందో అంతే సంఖ్యలో గుడ్లు కూడా ఉంటాయి. కనుక ఉన్నవి కూడా ప్రతి నెలా రుతుచక్రంలో పరిపక్వం చెంది బయటకు వచ్చేయడం వల్ల చివరకు రుతుచక్రం నిలిచిపోతుంది.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

హార్మోనులు తక్కువగా ఉండటం: మీరు 40లోకి అడుగు పెట్టగానే, 40యే కాదు, 30ఏళ్ళు దాటినా కూడా మోనోపాజ్(రుతివిరతి)కు సన్నద్ధం అవ్వడానికి మొదలుపెడుతుంది. తర్వాత సహజ హార్మోనులు తక్కువ సూచిస్తుంది. దాంతో గర్భం ధరించడానికి సరిపడా హార్మోనులు ఉండవు.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

ఫైబ్రాయిడ్లు: మీ వయస్సును బట్టి, మీ రీప్రొడక్టివిటీ సిస్టమ్(జననేంద్రియ వ్యవస్థ) వల్ల అండాశయంలో తిత్తులు(సిస్ట్) మరియు ఫైబ్రాయిడ్లు సమస్యలు అభివృద్ధి మొదలవుతుంది. ఫైబ్రాయిడ్స్ తో మీరు గర్భం ధరించవచ్చు. కానీ అది మీ గర్భంను సంక్లిష్టంగా మార్చుతుంది.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

క్రోనిక్ ఏజ్ డిసీజ్: 40ఏళ్ళు దాటిన తర్వాత , వయస్సు వేగంగా పెరగడం మొదలెడుతుంది. వయస్సుతో పాటు జబ్బులు కూడ మొదలవుతాయి. అందువల్ల 40ఏళ్ళ తర్వత దీర్ఘకాల వ్యాధులు మధుమేహం, హై బ్లడ్ ప్రెజర్ మొదలవుతాయి. ఈ వ్యాధులు మీరు గర్భ ధరించడానికి కష్టతరం చేస్తాయి.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

గర్భసంచికి బయట పిండం ఏర్పడుట: వయస్సు పైబడ్డ మహిళల్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ(గర్భసంచికి బయట పిండం) ఏర్పడుటం సర్వసాధారణం. లేటు వయస్సులో గర్భం ధరించినప్పుడు ఇటువంటి అవకాశాలు పెరగడం చాలా ఎక్కువ.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

క్రోమోజోములు దోషాలు: కొన్ని క్రోమోజోములు డిఫెక్ట్స్. ఉదాహరణకు: నాన్ డిస్ జంక్షన్స్ ఇది లేట్ వయస్సు వారికి చాలా సాధారణం. ఇది డౌన్ సిండ్రోమ్ వంటి జన్యు లోపాలకు దారితీస్తుంది.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

క్యాన్సర్ రిస్క్: లేట్ ప్రెగ్నెన్సీ వల్ల క్యాన్సర్ రిస్క్ లు ఎక్కువ, ముఖ్యంగా బ్రెస్ట్ మరియు ఒవేరియన్ క్యాన్సర్ లు మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

గుండె మీద ఒత్తిడి: లేట్ వయస్సులో గర్భం ధరించి, ప్రసవించే సమయంలో గుండె మీద అధిక ఒత్తిడి కలుగుతుంది. దరిదాపు వెయ్యి కిలోమీటర్ల వేగం ఉంటుంది! కాబట్టి 40ఏళ్ళలో ఈ ఒత్తిడి అనేది మరికొంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాక, యువతలో గుండెను రక్షించే ఈస్ట్రోజెన్ క్షీణిస్తుంది.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

మావి సమస్యలు(ప్లేసెంటల్ ప్రాబ్లమ్స్): వయస్సుతో, శరీరంలోని కండరాలు యొక్క స్థితిస్థాపకత తగ్గుతుంది. ఈ స్థితి స్థాపకత వల్లే గర్భధారణ సమయంలో గర్భసంచి సాగడానికి అవకాశం ఉంటుంది. లేటు వయస్సులో స్థితిస్థాపకత తగ్గడం వల్ల గర్భాశయం యొక్క అసమర్థత మావికి అంతరాయం కలిగిస్తాయి.

లేటు వయస్సు గర్భధారణ సాధ్యమా?

పుట్టుక లోపాలు: లేట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడూ శిశువు పుట్టకతో సంబంధం కలిగి ఉంటాయి. గడువు కంటే ముందుగా ప్రసవించడం వల్ల పుట్టక లోపాలు ఉండే అవకాశం ఎక్కువ. శిశువు అపరిపక్వంగా పుట్టడం జరుగుతుంది. ముఖ్యంగా నలభై ఏళ్ళ తర్వాత గర్భం ధరించడం వల్ల పిల్లల్లో గుండె లోపాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ.

English summary

Problems of Having A Late Pregnancy...

Nowadays we see many celebrities getting pregnant at 40 and giving birth easily. However, things may not be as rosy as you assume. Becoming pregnant after 40 or even later might have been made possible by advancements in science but a late pregnancy comes with its set of problems.
Desktop Bottom Promotion