For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భాధారణలో స్త్రీలు ఎలా పడుకుంటే సురక్షితం..!

|

సుఖంగా నిద్రపోవాలంటే అందుకు సరైన పడకతో పాటు సరైన పొజిషన్(భంగిమ)అవసరం. మీకు ఇష్టం వచ్చినట్లు అడ్డదిడ్డంగా పడుకోవడం వల్ల మీరు సరైన స్లీప్ హైజీన్ ఫాలో అవ్వడం లేదని చెప్పవచ్చు. మీరు గర్భం ధరించిఉన్నట్లైతే, మీకు కనీసం 8గంట నిద్ర తప్పని సరి అవసరం. రాత్రులు 8-10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి . నిద్రపోవునపుడు ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి. ఎందుకంటే మీ బరువుతో పాటు మీ కడుపులో పెరుగుతున్న మీ బేబీ బరువు కూడా అదనంగా వచ్చి చేరడంతో మీరు చాలా అలసటకు గురిఅవుతారు. కాబట్టి మీ శరీరానికి కావల్సిన విశ్రాంతిని అంధివ్వడం చాలా అవసరం. అందుకే గర్భధారణలో కూడా స్లీప్ పొజిషన్ చాలా ముఖ్యం.

చాలా మంది మహిళలకు గర్భధారణ సమయంలో ఏవైపుకు తిరిగిపడుకోవాలని సందేహం ఉండవచ్చు. మనందరకి ఒక ఫ్రివరబుల్ స్లీపింగ్ పొజిషన్స్ ఉన్నాయి. మనలో కొంత మంది వెల్లకిలా పడుకొనే విశ్రాంతి పొందితే మరికొందరేమో బోర్లా పడుకొని విశ్రాంతి పొందుతారు. కాబట్టి గర్భిణీకి కరెక్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏది? గర్భిణీ స్త్రీ కరెక్ట్ స్లీపింగ్ పొజిషన్ ఏదో తెలుసుకుందాం...

Safe Sleeping Positions During Pregnancy

గర్భిణి ఆరోగ్యం ప్రభావం గర్భస్థ శిశువు మీద కూడా ఉంటుంది. గర్భవతికి తన ఆరోగ్యం, అలవాట్లు, ఆహారం పట్ల సరైన అవగాహన ఉండాలి. గర్భం ధరించిన సమయంలో ఆరోగ్యం గురించి తానే పద్ధతులు పాటించాలన్నదీ కాబోయే మాతృమూర్తి తెలుసుకోవడం అవసరం.

గర్భంతో ఉన్న సమయంలో స్త్రీల శరీరపు బరువు పెరగడం, వయసు మీరిన తర్వాత తల్లి కావడం, తల్లి పేగు పరిస్థితి, గర్భస్థ శిశువుకి కావసినంత నీరు లేకపోవడం, చివరి సమయంలో బిడ్డకు అవసరమైన ఆక్సిజన్ అందకపోవడం వంటివి బిడ్డ పుట్టక ముందే చనిపోవడానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. అయినప్పటికీ గర్భిణులు పడుకునే విధానం కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఇంగ్లండ్ దేశపు "అక్లాండ్ యూనివర్శిటీ" పరిశోధనలో తేలింది.

గర్భిణులు నిద్రపోయే సమయంలో తిన్నగా పడుకోకూడదు, ఒక ప్రక్కకు తిరిగే పడుకోవాలి. ఎడమ వైపుకి తిరిగి పడుకోవడం వల్ల తల్లి రక్త నాళాలు చక్కగా పనిచేయడమే కాకుండా బిడ్డకీ, తల్లికీ మధ్య రక్త ప్రసరణ చక్కగా ఉంటుందని వెల్లడైంది.

పడుకునేటప్పుడు గర్భిణుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దిండ్లు వాడుకోవాలి. అవి అందుబాటులో లేకపోతే మరో దిండును మోకాళ్ల మధ్య పెట్టుకొని పడుకోవచ్చు. పగటిపూట వీలు చేసుకొని కాసేపు కునుకు తీయాలి. నిద్ర బాగా పట్టేందుకు మనసును ప్రశాంతంగా ఉంచే పద్ధతులు పాటించాలి. నిద్రలేమితో బాధపడుతుంటే తప్పకుండా డాక్టరుకు చూపించుకోవటం మరవరాదు.

English summary

Safe Sleeping Positions During Pregnancy

Pregnancy is a period of happiness and also a period of discomfort. Trying to get comfort at night when you are pregnant is not something easy.
Story first published: Monday, November 25, 2013, 18:04 [IST]
Desktop Bottom Promotion