For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భం సమయంలో బరువు తగ్గటానికి సురక్షితమైన మార్గాలు

By Lakshmi Perumalla
|

గర్భం అనేది మీ శారీరక మరియు మానసిక స్థితిలో చాలా మార్పులను తీసుకువస్తుంది. మీకు మాతృత్వం అనే ఒక అనుభవం చాలా అద్భుతముగా ఉంటుంది. సాదారణంగా మహిళలు గర్భం పొందినప్పుడు బరువు పెరుగుతారు. ఒక గర్భవతి శిశువు యొక్క పెరుగుదల మద్దతు కొరకు కొంత బరువు పెరగటం అనేది సాదారణంగా జరుగుతుంది. మీ కడుపు యొక్క బరువు మీ మొత్తం బరువుకు దోహదం చేస్తుంది. కానీ బరువు అనేది ఒక సాధారణ పరిధిలో ఉండాలి.

గర్భధారణ సమయంలో సురక్షితంగా బరువు తగ్గడం అనేది తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యం మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. అలాగే మీ శరీర బరువు డెలివరీ సులువుగా జరగటం మీద ప్రభావం చూపుతుంది. మీరు గర్భధారణ సమయంలో ఎక్కువ బరువు ఉన్నారని కనుగొంటే,అప్పుడు నియంత్రణ కోసం అవసరమైన సురక్షిత చర్యలను తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది మీ బరువు తగ్గించేందుకు మీ గర్భం ముందు మరియు తరువాత ఏదైనా ప్రయత్నించటానికి సాపేక్షకంగా మరియు తేలికగా ఉంటుంది. కానీ, గర్భధారణ సమయంలో బరువు తగ్గటం సులభం కాకపోవచ్చు.

గర్భధారణ సమయంలో మీ బరువు తగ్గించేందుకు సురక్షిత విధానాలను ఎంపిక చేసుకోవాలని గుర్తుంచుకోండి. గర్భిణీ స్త్రీలు వారి బరువు తగ్గించడం కొరకు కొన్ని పద్ధతులు ఎంచుకుంటున్నప్పుడు కొన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీరు శాస్త్రీయత లేని బరువు తగ్గే పద్ధతులను ప్రయత్నిస్తున్నప్పుడు కొంత రిస్క్ ఉంటుంది. ఇక్కడ గర్భం సమయంలో వేగంగా మరియు ప్రభావవంతంగా బరువు తగ్గటానికి కొన్ని సురక్షిత మార్గాలు ఉన్నాయి.

Safe Ways To Lose Weight During Pregnancy

ఆహారం

గర్భం సమయంలో మీ బరువు తగ్గించేందుకు కఠిన ఆహార నియంత్రణ ప్రణాళికను అనుసరించకూడదు. కానీ అదే సమయంలో మీరు అనారోగ్య ఆహారం తీసుకోవడం తగ్గించాలి. జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్ ఆహారాన్ని మానివేయాలి. ఆరోగ్యవంతమైన అలవాట్లు అనేది గర్భధారణ సమయంలో బరువు తగ్గించేందుకు ఉత్తమ మార్గం.

వాకింగ్ చేయండి

మీరు ప్రతి రోజు వాకింగ్ చేస్తే గర్భధారణ సమయంలో బరువు తగ్గడానికి బాగుంటుంది. మీరు గర్భం సమయంలో వైద్యపరంగా బయటికి వెళ్ళచ్చని అనుకుంటే బయట వాకింగ్ చేయటానికి ప్రయత్నించండి. ఇది మీ బరువు నిర్వహించడానికి భద్రమైన మార్గాలలో ఒకటి.

ఆరోగ్యకరమైన స్నాక్స్

గ్యాస్ సమస్యలను నివారించటానికి గర్భధారణ సమయంలో మీ ప్రధాన భోజనాల మధ్య విరామంలో స్నాక్స్ తీసుకోవాలని సిఫార్సు చేయబడింది. కానీ మీ బరువు తగ్గటానికి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఏ విధంగానూ దోహదం చేయదని గుర్తుంచుకోండి.

ఆర్ద్రీకరణ స్థితిలో ఉండండి

మీరు తగినంత నీరు త్రాగటం వలన ఆర్ద్రీకరణ స్థితిలో ఉండటానికి సహాయపడుతుంది. అదే సమయంలో గర్భధారణ సమయంలో అదనపు బరువు పెరుగుటను నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది.

వ్యాయామం

మీ ఆరోగ్య స్థితి గురించి మీ వైద్యునితో మాట్లాడి మరియు మీరు సాధారణ వ్యాయామాలు చేయడానికి సురక్షితమని నిర్ధారించుకోండి. గర్భధారణ సమయంలో మాత్రమే తేలికపాటి వ్యాయామాల మీద దృష్టి సారించండి.ఇది గర్భధారణ సమయంలో బరువు నష్టం కోసం సురక్షితమైన మార్గం.

యోగ

ఏదైనా కారణం వలన వైద్య సమస్యలతో చాలా అలసిపోయి వ్యాయామం చెయ్యలేకపోతే మీరు కంగారుపడవలసిన అవసరం లేదు. మీరు ఇప్పటికీ కూడా సాధారణ యోగ ప్రయత్నించటానికి అవకాశం ఉంటుంది. యోగ మీ మనస్సు మరియు శరీరంను ఆరోగ్యకరముగా ఉంచడానికి సహాయం చేస్తుంది.ఇది గర్భధారణ సమయంలో బరువు నష్టం కోసం గొప్పగా దోహదం చేస్తుంది.

మీ క్రేవ్ రక్షణ

ఒక గర్భవతి ఏ ప్రత్యేక ఆహారం కోసం వేడుకొనకూడదు. మీరు ఒక ఆరోగ్యకరమైన విధంగా మీ తృష్ణ నిర్వహిస్తున్నారని నిర్ధారించుకోండి. ఆహారంను వేడుకొని తీసుకోకూడదని చాలా ఎక్కువగా గుర్తుంచుకోవాలి.

మీ బరువును చూస్తుండాలి

మీ గర్భధారణ సమయంలో పెరిగిన బరువును ఒక చార్ట్ లో వేయండి. మీరు సాధారణ బరువులోకి వచ్చామో లేదో తెలియటానికి సహాయపడుతుంది. ప్రారంభ దశలో మీ బరువు నియంత్రణ కోసం అవసరమైన చర్యలను తీసుకోవడం ద్వారా గర్భధారణ సమయంలో సురక్షితంగా బరువు తగ్గటానికి సహాయం చేస్తుంది.

English summary

Safe Ways To Lose Weight During Pregnancy

Pregnancy brings many changes in your physical and emotional status. Most of these will be exciting for you as an experience of motherhood. But, what all women hate after getting pregnant is the associated weight gain.
Story first published: Monday, December 23, 2013, 10:58 [IST]
Desktop Bottom Promotion