For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సులభంగా గర్భం పొందడానికి ఫెర్టిలిటి సంకేతాలు

|

రస్తుత రోజుల్లో గర్భం ధరించడం అంటే అంత సులభం కాదు. ఎందుకంటే జీవనశైలిలో అనేక మార్పలు చోటు చేసుకొన్నాయి. జంక్ ఫుడ్, నిద్రలేమి, పార్టీలు, మద్యపానం ఇటువంటి ఎన్నో దాంపత్య జీవితానికి అవరోధం కలిగిస్తూ, సంతనం పొందలేకపోతున్నారు. అందుకే ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ సంతనం అంత సులభంగా జరగడం లేదు. దంపతుల్లో ఎటువంటి మేజర్ ఆరోగ్య సమస్యలు లేనప్పుడు ఒక్క సంవత్సరంలో సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకు ముఖ్యంగా జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

జీనవనశైలితో మార్పులతో పాటు, భార్యభర్తల మధ్య అనోన్యత చాల ముఖ్యం. చాలా మంది సంతానం పొందడానికి ఇద్దరి మధ్య సెక్స్ లైఫ్ ఒకటే సరిపోతుందనుకుంటారు. కానీ, గర్భం పొందడానికి సెక్స్ లైఫ్ ఒకటే సరిపోతుంది. మీరు పిల్లలకోసం ప్లాన్ చేస్తుంటే కనుక మీరు అందుకు సిద్ధంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. మీశరీరం, మీ మానసిక స్థితి అనుకూలంగా ఉండేట్లు చూసుకోవాలి.

Signs Of Fertility To Conceive Easily

మీరు గర్బం పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు మీ పీరియడ్ క్యాలెండర్ ను ట్రాక్ చేయాలి. మరియు దాంతో పాటు మీరు పనిచేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అందుకు మీరు ముందుగా మీ ఫెర్టిలిటి సమయం మరియు లక్షణాలు తెలుసుకోవాలి . దాన్ని బట్టి ప్రయత్నిస్తే, మీరు గర్భం పొందడంలో పాజిటివ్ రిజల్ట్ పొందవచ్చు. మీలో ఫెర్టిలిటీ లక్షణాలను తెలిపే కొన్ని లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఫెర్టిలిటి లక్షణాలు, మీరు గర్భం పొందడానికి ఒక మంచి సమయం మరియు సురక్షితం అని తెలియజేస్తాయి. మరి ఆ లక్షణాలేంటో క్రింది విధంగా తెలుసుకోండి..

క్రాంప్స్(తిమ్మిర్లు) : ఫెర్టిలిటి లక్షణాల్లో మొదటి లక్షణం మీ కడుపులో క్రింది భాగంలో(ఉదర భాగంలో) తిమ్మిరిలు కలిగి ఉంటాయి.

మీరు తడిగా భావిస్తారు: సాధారణంగా మహిళల్లో పీరియడ్స్ మొదలైన రెండవ వారంలో మిగిలిన రోజుల్లో కంటే తడిగా భావిస్తారు. ఈ సమయం మహిళలకు చాలా ఇబ్బందికరంగా, అసౌకర్యంగా భావిస్తారు.

రొమ్ముల్లో సలుపు: మరో సాధారణ ఫెర్టిలిటి లక్షణం, ఆ సమయంలో మహిళల్లో రొమ్ముల్లో సలుపుతుంది. ఏ చిన్నపాటి ఒత్తిడి, రాపిడి జరిగినా భరించలేనంత నొప్పిగా భావిస్తారు. దాని తర్వాత మీలో ఫెర్టిలిటి ప్రారంభం అవుతుంది. మీలో ప్రొజెస్టిరాన్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో రొమ్ముల్లో సలుపు ఏర్పడుతుంది, అది మిమ్మల్ని బాధిస్తుంది. ఇది కూడా ఫెర్టిలిటికి ఒక సంకేతంగా భావించాలి.

మీరు అధికాశక్తి కలిగి ఉంటారు: ఫెర్టిలిటి సమయంలో భర్త మీద ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. ఇలా కలిగే అదనపు ప్రేమ ఫెర్టిలిటికి ఒక సంకేతం. ఇది చాలా మంది మహిళల్లో జరిగే ఒక సాధరణ అనుభం.

కడుపు ఉబ్బరం: మరో ఫెర్టిలిటి లక్షణం, ఆ సమయంలో కడుపు ఉబ్బరంగా ఉంటుంది . ఓవొలేషన్ సమయంలో హార్మోనుల్లో మార్పుల వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఇది కూడా ఫెర్టిలిటి సంకేతాల్లో ఒకటి.

వికారం: మీకు బాగా ఇష్టమైన ఆహారాలైనా, ఒక్కోసందర్భంలో వాటిని చూసినప్పుడు మీకు వాటి మీద విరక్తి పుడుతుంది. వికారం కూడా మహిళల్లో పీరియడ్స్ సైకిల్ ఫెర్టిలిటికి మరో సంకేతంగా భావించవచ్చు.

ఈ లక్షణాలన్నీ మీలో కనిపించే ఫెర్టిలిటి లక్షణాలు, గర్భం పొందడానికి సురక్షితమైన సమయం అని మీరు గుర్తించి, ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకొన్నట్లైతే తప్పకుండా గర్భం పొందే అవకాశాలు ఎక్కువ.

English summary

Signs Of Fertility To Conceive Easily

Some may say that getting pregnant is an easy process as it involves only one thing, which is the love shared between a man and his wife. But, there are many things we need to consider before trying to conceive.
Story first published: Monday, December 9, 2013, 16:54 [IST]
Desktop Bottom Promotion